కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘గొఱ్ఱెపిల్లతోపాటు పొందిన విజయాన్ని’ బట్టి సంతోషించడం

‘గొఱ్ఱెపిల్లతోపాటు పొందిన విజయాన్ని’ బట్టి సంతోషించడం

‘గొఱ్ఱెపిల్లతోపాటు పొందిన విజయాన్ని’ బట్టి సంతోషించడం

క్యారీ డబ్ల్యు. బార్బర్‌ 1971లో వ్రాసిన ఒక ఉత్తరంలో, సత్య దేవునికి తాను చేసిన 50 సంవత్సరాల సేవ గురించి ఇలా పేర్కొన్నారు: “యెహోవా సేవలో గడిపిన సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి! ఆయన ప్రజలతో సహవాసం, సాతాను లోకంలోని దుష్టులనుండి కాపుదల, గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తుతోపాటు విజయాన్ని పొందడమనే ఉత్తరాపేక్ష, యెహోవా ప్రేమకు రుజువు వంటివన్నీ ఆహ్లాదకరమైన శాంతిని, అంతర్గత సంతృప్తిని ఇచ్చాయి. ఈ శాంతి, సంతృప్తి హృదయాన్ని కాపాడి, అంతిమ విజయం తప్పక లభిస్తుందనే నిరీక్షణనిస్తాయి.”

ఆరు సంవత్సరాల తర్వాత, ఆత్మాభిషిక్త క్రైస్తవ సహోదరుడైన బార్బర్‌, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడిగా సేవచేయడం ప్రారంభించారు. పరిపాలక సభ సభ్యుడిగా ఆయన ఆ తర్వాతి 30 సంవత్సరాల్లో, ‘గొఱ్ఱెపిల్లతోపాటు విజయం పొందేందుకు’ ఎదురుచూశారు. ఆయన 101 సంవత్సరాల వయసులో, 2007 ఏప్రిల్‌ 8, ఆదివారం నాడు మరణించేంతవరకు నమ్మకంగా ఉండడంద్వారా దాన్ని సాధించారు.—1 కొరింథీయులు 15:57.

క్యారీ బార్బర్‌ 1905లో ఇంగ్లాండ్‌లో జన్మించారు, ఆయన కెనడాలోని విన్నీపెగ్‌లో 1921లో బాప్తిస్మం తీసుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత ఒక క్రొత్త ప్రాజెక్టులో సహాయం చేయడానికి ఆయన, ఆయన కవల సోదరుడైన నార్మన్‌, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు పంపించబడ్డారు. ఆ సమయంలో యెహోవా ప్రజలు, “లోకమందంతట” రాజ్య సువార్త ప్రకటించేందుకు పుస్తకాలను స్వయంగా ముద్రించడం ఆరంభించబోతున్నారు. (మత్తయి 24:14) సహోదరుడు బార్బర్‌కు ఇవ్వబడిన తొలి నియామకాల్లో ఒకటి, చిన్న ముద్రణా యంత్రాన్ని నడపడం. దానిమీద, అమెరికా సుప్రీంకోర్టులో విచారించబడే మన కేసులకు సంబంధించిన క్లుప్త వివరాలను తెలియజేసే పత్రాలు కూడా ముద్రించబడేవి. కొంతకాలానికి, సహోదరుడు బార్బర్‌ సంఘ విషయాలపై, ఆ దేశమంతటిలో జరిగే ప్రకటనా పనిపై దృష్టి కేంద్రీకరిస్తూ సేవా విభాగంలో పనిచేశారు.

సహోదరుడు బార్బర్‌ 1948లో సమావేశాలను, అమెరికాలోని పశ్చిమ భాగంలోవున్న సంఘాలన్నింటిని సందర్శించే ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డారు, ఆయనకున్న నేపథ్యాన్నిబట్టి ఆయన ఆ నియామకానికి తగిన వ్యక్తి. ప్రత్యేకంగా, ఆరుబయట స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ బహిరంగ ప్రకటనా పనిలో భాగం వహించడాన్ని తానెంతో ఆనందించానని ఆయన చెప్పారు. ఈ నియామకంవల్ల ఎంతోమంది సహోదర సహోదరీలు సహోదరుడు బార్బర్‌ను కలుసుకోగలిగారు. ఆ తర్వాత వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 26వ తరగతికి హాజరైనప్పుడు, విషయాన్ని త్వరగా ఆకళింపు చేసుకోగల ఆయన సామర్థ్యం, పరిచర్యపట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతో ఉపయోగపడ్డాయి. గిలియడ్‌ పాఠశాలకు హాజరవుతున్నప్పుడు ఆయనకు కెనడా నుండి వచ్చిన సిడ్నీ లీ బ్రూయెర్‌ అనే తోటి విద్యార్థితో పరిచయం ఏర్పడింది. స్నాతకోత్సవమైన తర్వాత వారు వివాహం చేసుకొని, ఇల్లినోయిస్‌లోని చికాగోలోవున్న సంఘాల్లో సేవ చేసేందుకు వెళ్తున్న స్వల్పకాల ప్రయాణంలో హనీమూన్‌ జరుపుకున్నారు. సహోదరి బార్బర్‌ తన భర్తకు అమూల్యమైన భాగస్వామిగా ఉండి, వారి రెండు దశాబ్దాల ప్రయాణ పరిచర్యలో ఎల్లవేళలా ఆయనకు తోడుగా ఉంది.

సహోదరుడు బార్బర్‌ జిల్లా, ప్రాంతీయ పైవిచారణకర్తగా పనిచేసిన దశాబ్దాల కాలంలో, పరిపాలక సభ సభ్యుడిగా పనిచేస్తూ ప్రయాణించిన 30 సంవత్సరాల కాలంలో ఆయనను కలిసినవాళ్ళు, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు ఆయన ప్రసంగాలను, శక్తివంతమైన వ్యాఖ్యానాలను చాలాకాలంపాటు గుర్తుంచుకుంటారు. ఆయన ‘గొఱ్ఱెపిల్లతోపాటు పొందిన విజయాన్ని’ బట్టి మనం సంతోషించడం సరైనదే.