కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సురకూసై పౌలు తన సముద్రయానంలో తాత్కాలికంగా ఆగినస్థలం

సురకూసై పౌలు తన సముద్రయానంలో తాత్కాలికంగా ఆగినస్థలం

సురకూసై పౌలు తన సముద్రయానంలో తాత్కాలికంగా ఆగినస్థలం

దాదాపు సా.శ. 59వ సంవత్సరంలో, ఒక ఓడ మధ్యధరా సముద్రంలోవున్న మెలితే ద్వీపం నుండి ఇటలీకి బయలుదేరింది. ఆ ఓడ ముఖభాగంలో, ‘జీయస్‌ కుమారుల’ చిహ్నం ఉంది, వీరు నావికులను కాపాడే దేవుళ్ళగా పరిగణించబడుతున్నారు. ఆ ఓడ సిసిలికి ఆగ్నేయతీరానవున్న “సురకూసైకి” చేరుకుని అక్కడ “మూడు దినములు” ఆగిందని బైబిలు రచయిత లూకా నివేదిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 28:11, 12, NW) ఓడలో లూకాతోపాటు అరిస్తార్కు, విచారణ కోసం రోమాకు తీసుకెళ్ళబడుతున్న అపొస్తలుడైన పౌలు కూడా ఉన్నారు.—అపొస్తలుల కార్యములు 27:2.

పౌలు సురకూసైలో దిగేందుకు అనుమతించబడ్డాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఆయనగానీ, ఆయనతోపాటు ప్రయాణిస్తున్నవారుగానీ అక్కడ దిగివుంటే, వారేమి చూసి ఉండేవారు?

గ్రీకుల, రోమన్ల కాలంలో సురకూసైకి కూడా ఏథెన్స్‌కు, రోముకు ఉన్నంత ప్రాముఖ్యత ఉండేది. ఎంతోకాలంగా విశ్వసించబడుతున్నట్లుగా, దానిని సా.శ.పూ. 734లో కొరింథీయులు స్థాపించారు. సురకూసై కొంతకాలంపాటు ఖ్యాతి పొందింది, నాటక రచయిత ఎపికార్మస్‌, గణితశాస్త్రవేత్త అర్కెమీడీస్‌ వంటి ప్రాచీనకాల ప్రముఖులు అక్కడే జన్మించారు. సా.శ.పూ. 212లో రోమన్లు సురకూసైని కైవసం చేసుకున్నారు.

ఆధునిక సురకూసై పట్టణానికి ఒకసారి వెళ్తే పౌలు కాలంలోని సురకూసై గురించి కొంత తెలుసుకోవచ్చు. ఆ పట్టణం రెండు భాగాలుగా విభజించబడింది, ఒక భాగం బహుశా పౌలు ఓడ నిలిచిన ఓర్త్‌జీ అనే చిన్న ద్వీపంలో ఉంది, మరొక భాగం ప్రధాన భూభాగంలో ఉంది.

నేడు ఆ ద్వీపంలో, సా.శ.పూ. 6వ శతాబ్దానికి చెందిన అపొల్లో దేవాలయ శిథిలాలను అంటే సిసిలిలో ప్రాచీన డోరిక్‌ శైలిలో నిర్మించబడిన దేవాలయ శిథిలాలను మీరు చూడవచ్చు. అక్కడ సా.శ.పూ. 5వ శతాబ్దానికి చెందిన ఏథెనాకు అంకితం చేయబడిన దేవాలయ స్తంభాలు కూడా ఉన్నాయి, కానీ ఆ దేవాలయం కెథడ్రిల్‌లో భాగంగా చేయబడింది.

ఆధునిక సురకూసై పట్టణం ప్రధాన భూభాగంలో ఉంది, అక్కడ నెయపొలిస్‌ పురావస్తుశాస్త్ర పార్కును సందర్శించవచ్చు. దాని ముఖద్వారానికి దగ్గరలో గ్రీకు థియేటర్‌ ఉంది. ఇది, గ్రీకు థియేటర్‌ నిర్మాణశైలిలో నిర్మించబడి, ఇప్పటికీ ఉనికిలోవున్న అత్యంత అద్భుతమైన థియేటర్లలో ఒకటి. అది సముద్రం తట్టు ఉండడంవల్ల, ప్రదర్శనలకు రమణీయమైన నేపథ్యంగా ఉండేది. పార్కు దక్షిణభాగంలో సా.శ. మూడవ శతాబ్దానికి చెందిన రోమన్‌ ఆంఫిథియేటర్‌ ఉంది. అది అండాకారంలో ఉంది, దాని పొడవు 140 మీటర్లు, వెడల్పు 119 మీటర్లు, ఇది ఇటలీలోవున్న అతిపెద్ద పార్కులలో మూడవది.

సురకూసైకి వెళ్ళే అవకాశం మీకు లభిస్తే, ఓర్త్‌జీలో సముద్రానికి ఎదురుగా ఒక బెంచిపై కూర్చుని మీ బైబిల్లో అపొస్తలుల కార్యములు 28:12 తీసి, ఓడరేవుకు చేరుకుంటున్న ఓడలో అపొస్తలుడైన పౌలు ఉన్నట్లు ఊహించుకోండి.

[30వ పేజీలోని డయాగ్రామ్‌/మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మెలితే

సిసిలి

సురకూసై

ఇటలీ

రేగియు

పొతియొలీ

రోమా

[30వ పేజీలోని చిత్రం]

సురకూసైలో ఉన్న ఒక గ్రీకు థియేటర్‌ శిథిలాలు