కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ నమ్మకాలను తెలియజేసే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారా?

మీ నమ్మకాలను తెలియజేసే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారా?

మీ నమ్మకాలను తెలియజేసే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారా?

“సం పూర్ణ సత్యమనేది ఉందా?” అనే అంశంపై పోలాండ్‌లో జాతీయ వ్యాసరచనా పోటీ జరిగింది. వ్యాసం ఎలా రాయాలో చెప్పే సూచనల్లో ఇలా ఉంది: “మనకు సంపూర్ణ సత్యం అవసరం లేదు. అది ఎవరికీ అవసరం లేదు. నిజానికి సంపూర్ణ సత్యమనేది అసలు లేనేలేదు.” ఉన్నత పాఠశాలలో చదువుతున్న 15 సంవత్సరాల అగాథా ఒక యెహోవాసాక్షి. ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన మతనమ్మకాల గురించి ఇతరులకు తెలియజేయాలనుకుంది.

వ్యాసానికి సిద్ధపడుతున్నప్పుడు అగాథా ముందుగా నడిపింపుకోసం యెహోవాకు ప్రార్థన చేసి, ఆ తర్వాత సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కావలికోట జూలై 1, 1995 సంచికలో కనుగొన్నది. ‘సత్యమంటే ఏమిటి?’ అని పొంతి పిలాతు యేసును అడిగిన ప్రశ్నను ఆమె తన వ్యాసంలో ఉల్లేఖించింది. (యోహాను 18:37) పిలాతు వేసిన ఆ ప్రశ్న, హేళనా దృక్పథంతో, ‘సత్యమా? అంటే ఏమిటి? అలాంటిదేదీ లేదే!’ అంటున్నట్లుగా ఉందని ఆమె వ్రాసింది. “పిలాతు వేసిన ప్రశ్న, వ్యాసం వ్రాయడానికి ఇచ్చిన సూచనలను గుర్తుచేసిందని” అగాథా వ్రాసింది.

ఆ తర్వాత నిరపేక్షతావాదం ఎలా వృద్ధిచెందిందో ఆమె వివరించింది. నిరపేక్షతావాదం అంటే ఒక వ్యక్తికి నిజమని అనిపించే ఒక విషయం మరో వ్యక్తికి అబద్ధం అనిపించడం, వారిద్దరూ చెప్పేది “సత్యమే” కావచ్చు. “వైమానిక గతిశీల నియమాలు సంపూర్ణ సత్యాలని మనం నమ్మకపోతే మనలో ఎంతమందిమి విమానంలో ప్రయాణించడానికి ధైర్యం చేస్తాం?” వంటి ప్రశ్నలను ఆమె లేవదీసింది. ఆ తర్వాత ఆమె బైబిలు గురించి ప్రస్తావిస్తూ ఇలా వ్రాసింది: “మనం దేవుని వాక్యాన్ని నమ్మవచ్చు ఎందుకంటే అందులో నిరూపించదగ్గ వాస్తవాలున్నాయి.” సంపూర్ణ సత్యాన్ని యథార్థంగా వెదికేవారికి దానిని కనుగొనేంత ఓర్పు ఉంటుందని ఆమె వ్రాసింది.

ఆ వ్యాసం వ్రాసినందుకు అగాథా ఒక ప్రత్యేక యోగ్యతా పత్రాన్ని గెలుచుకుంది. తరగతిలో అందరిముందు తన నమ్మకాల గురించి వివరించే అవకాశం ఆమెకు లభించింది. తోటి విద్యార్థుల్లో అనేకమంది బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన నమ్మకాల గురించి ఇంకా అనేకులకు తెలియజేయగలిగినందుకు అగాథా యెహోవాకు కృతజ్ఞురాలై ఉంది. అవును, మీరు మీ విశ్వాసం గురించి మాట్లాడే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు. మీ నమ్మకాల గురించి మాట్లాడే ఎలాంటి అవకాశాలు మీకున్నాయి?