కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దయచేసి ఈ చిన్న కానుకను స్వీకరించండి”

“దయచేసి ఈ చిన్న కానుకను స్వీకరించండి”

“దయచేసి ఈ చిన్న కానుకను స్వీకరించండి”

యెహోవాసాక్షుల రష్యా బ్రాంచి కార్యాలయానికి అందిన ఒక ఉత్తరంలో పై మాటలు ఉన్నాయి. ఆ ఉత్తరంతోపాటు ఉన్ని సాక్సులున్న పెద్ద పెట్టె కూడా పంపించబడింది.

అది, రష్యాకు చెందిన ఫార్‌ ఈస్ట్‌లోవున్న ఒక సంఘంలో యెహోవాసాక్షిగా సేవచేస్తున్న 67 సంవత్సరాల ఆలా అనే సహోదరి పంపించిన బహుమానం. ఆలా పదికన్నా ఎక్కువ సంవత్సరాలుగా యెహోవాను సేవిస్తూ, రాజ్యసువార్తను ఆసక్తితో ప్రకటిస్తూవుంది. అయితే, ఆమెకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడిపోయాయి. అయినప్పటికీ, తన తోటి విశ్వాసులకు బట్టలు కుట్టిచ్చిన, మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవ స్త్రీయైన దొర్కాలాగే ఆలా తన తోటి సాక్షుల కోసం ప్రేమతో సాక్సులు అల్లింది.—అపొస్తలుల కార్యములు 9:36, 39.

ఆలా తన ఉత్తరంలో ఇలా వ్రాసింది: “నేను నా కాళ్ళు కదపలేను కానీ నా చేతులు కదపగలను. కాబట్టి నేను ఉత్తరాలు వ్రాస్తూ ప్రకటనాపనిలో పాల్గొంటున్నాను.” ఆమె ఇంకా ఇలా వ్రాసింది: “నేనింకా నా చేతులు కదపగలుగుతున్నాను కాబట్టి, కొన్ని జతల ఉన్ని సాక్సులను అల్లాలని నిర్ణయించుకున్నాను. వాటిని, వాతావరణం చల్లగావుండే రష్యాలోని ఫార్‌ ఈస్ట్‌, సైబీరియా వంటి ప్రదేశాల్లో రాజ్యమందిరాలు నిర్మించడానికి వెళ్ళే సహోదర, సహోదరీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.”

తనను యథార్థంగా అనుసరించేవారి గురించి యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:35) ఆలా చూపించినలాంటి ప్రేమ యేసు నిజ అనుచరుల గుర్తింపు చిహ్నంగా ఉంది.