కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ ఐక్యత సాధ్యమేనా?

ప్రపంచ ఐక్యత సాధ్యమేనా?

ప్రపంచ ఐక్యత సాధ్యమేనా?

మన ప్రపంచం శాంతివైపుకు పయనిస్తోందా లేక నాశనంవైపుకు పయనిస్తోందా? ఆ రెండు వాదనలు సరైనవిగానే కన్పించవచ్చు.

ఒకప్రక్క, ప్రపంచ శాంతి సాధించగల లక్ష్యమేనన్నట్లుగా ప్రపంచ నాయకుల్లో కొందరు నమ్మకంగా చెబుతున్నారు, ఎందుకంటే ప్రపంచ శాంతి సాధించబడకపోతే కలిగే పరిణామాలు ఎంతో భయంకరంగా ఉండవచ్చు. మరోప్రక్క, ఏయే దేశాల దగ్గర సామూహిక నిర్మూలనా ఆయుధాలున్నాయి? వాటిని ఉపయోగించడానికి ఆ దేశాలు సాహసిస్తాయా? వాటిని ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది? వంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తూ చాలామంది ఆందోళన చెందుతున్నారు.

అనాదిగా పోటీతత్వం, దురభిమానం, ప్రపంచ ఐక్యతకు అడ్డంకుగా ఉన్నాయని చరిత్ర చూపిస్తోంది, అయితే మతం పోరాటమనే జ్వాలల్ని ఆర్పేసే బదులు వాటిని రగిలించింది. జేమ్స్‌ ఎ. హోట్‌ అనే విలేఖరి ఇలా రాశాడు: “ప్రజల్ని విభజించేది ఏదైనా సరే శత్రుత్వానికి దారితీస్తుంది, వారు విభజించబడడానికి గల బలమైన కారణాల్లో ఒకటి మతం.” “మతం ప్రజల్ని ‘మంచివారిగా’ చేస్తుందన్న సాధారణ నమ్మకంవున్నా, అది ఘోరమైన చెడు కార్యాలు చేసేలా కొంతమందిని నడిపిస్తుందన్నది స్పష్టం.” రచయితైన స్టీవన్‌ వైన్‌బెర్గ్‌ అలాంటి దృక్పథాన్నే వ్యక్తపరుస్తూ ఇలా రాశాడు: “మంచివాళ్ళు చెడు చేయడానికి గల ఏకైక కారణం మతమే.”

మన ప్రపంచం ఎప్పటికైనా ఐక్యమౌతుందనే నిరీక్షణేదైనా ఉందా? ఉంది! అయితే, మనం చూడబోతున్నట్లుగా ప్రపంచ ఐక్యతకు మూలం మానవులూ కాదు, మానవ నిర్మిత మతాలూ కాదు.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రపంచం పేలడానికి సిద్ధంగా ఉన్న గ్రెనేడ్‌లా ఉందా?