కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలు చదివి ప్రయోజనం పొందారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• “పాత నిబంధన”కు ఎందుకు శాశ్వత విలువ ఉంది?

దాని గ్రంథకర్త ఏ క్రూరమైన దేవుడో కాదు గానీ ప్రేమగల దేవుడైన యెహోవా. యేసు ఆయన తొలి అనుచరులు హెబ్రీ లేఖనాలను ఉపయోగించడంలో కొనసాగారు. దానిలో దైనందిన జీవితానికి అవసరమయ్యే ఆచరణాత్మక సలహా ఉంది, అంతేకాక అది భవిష్యత్తు విషయంలో అద్భుతమైన నిరీక్షణనిస్తుంది.—9/1, 4-7 పేజీలు.

• ఆదాము హవ్వలు పాపం చేసినప్పటినుండి ఇప్పటివరకు సమయం గడవడానికి అనుమతించడం ద్వారా ఏమి సాధించబడింది?

ఈ వేల సంవత్సరాల్లో, సాతాను అబద్ధికుడని రుజువయ్యింది, ఆదాము హవ్వలు, వారి సంతానంలో లక్షలాదిమంది మరణించారు. మానవులు దేవుని నుండి వేరై స్వతంత్రంగా జీవించలేరని, వారికి తమ మార్గమునేర్పర్చుకొనే హక్కుగానీ, సామర్థ్యంగానీ లేవని గడిచిన సమయం నిరూపించింది.—9/15, 6-7 పేజీలు.

• యాకోబు తాను ఏశావునని నమ్మించినందుకు ఎందుకు విమర్శింపబడలేదు?

యాకోబు ఏశావు నుండి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు కాబట్టి తన తండ్రి దగ్గరనుండి దీవెనలు పొందే హక్కు యాకోబుకే ఉంది. తాను యాకోబును దీవించానని గ్రహించినప్పుడు ఇస్సాకు దానిని మార్చడానికి ప్రయత్నించలేదు. దేవుడు ఆ ఆశీర్వాదం యాకోబుకే చెందాలని స్పష్టంగా కోరుకున్నాడు, లేకపోతే ఆయన జోక్యం చేసుకునేవాడే.—10/1, 31వ పేజీ.

• మనం మనస్సాక్షి కలిగివుండడం, పరిణామ సిద్ధాంతం తప్పని ఎలా నిరూపిస్తుంది?

అన్ని జాతుల, సంస్కృతుల ప్రజలు ఇతరులకు సహాయం చేయాలనే సుముఖత చూపిస్తారు, అది తమను అపాయంలో పడేసేదైనా సరే వెనుకాడరు. మానవులు గనుక, ఏమి చేసైనా సరే ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడే జంతువులైతే, వారిలో అలాంటి నిస్వార్థత ఉండాలని ఆశించము.—10/15, 20వ పేజీ.

• దేవుడు వినయస్థుడని మనమెందుకు చెప్పవచ్చు, ఆయన ఈ లక్షణాన్ని ఎలా కనబరుస్తున్నాడు?

సర్వాధిపతిగా, సృష్టికర్తగా, దేవునికి మనకున్నట్లు పరిమితులు లేవు. అయినా 2 సమూయేలు 22:36వ వచనానికి అనుగుణంగా దేవుడు తనను సంతోషపర్చడానికి ప్రయత్నించే దీనులపట్ల శ్రద్ధను, దయను చూపిస్తాడు కాబట్టి ఆయన వినయస్థుడని చెప్పవచ్చు. దైవభయంగలవారితో దయాపూర్వకంగా వ్యవహరించేందుకు, సూచనార్థకంగా చెప్పాలంటే, ఆయన కిందకు వస్తాడు.—11/1, 4-5 పేజీలు.

• ప్రాచీనకాల కుండపెంకులు బైబిలు వివరాలను ఎలా ధృవీకరిస్తున్నాయి?

షోమ్రోనులో పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్న కుండపెంకులపై, యెహోషువ 17:1-6లో నమోదుచేయబడిన ఏడు వంశాల పేర్లు ఉన్నాయి. అరాదు కుండపెంకులు, యాజక కుటుంబాల గురించిన సమాచారాన్ని ధృవీకరిస్తున్నాయి, వాటిలో దేవుని నామం ఉంది. లాకీషు కుండపెంకులు, యూదాపై బబులోనీయులు దాడి చేయడానికి ముందు దానిలోవున్న రాజకీయ పరిస్థితుల గురించి, అల్లకల్లోల పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి.—11/15, 12-14 పేజీలు.

• అపొస్తలుల కార్యములు పుస్తకాన్ని లూకా వ్రాశాడనడానికి కారణమేమిటి?

లూకా సువార్తలాగే అపొస్తలుల కార్యములు కూడా థెయొఫిలను ఉద్దేశించే వ్రాయబడింది, ఈ విషయం ఆ రెండింటినీ లూకాయే వ్రాశాడని సూచిస్తోంది. “మేము” “మా” “మనము” అనే సర్వనామాలు ఉపయోగించడం, కొన్ని సంఘటనల్లో లూకా పాల్గొన్నాడని చూపిస్తోంది. (అపొస్తలుల కార్యములు 16:8-15)—11/15, 18వ పేజీ.

• క్రైస్తవులు వేటాడడాన్నీ చేపలుపట్టడాన్నీ ఎలా దృష్టించాలి?

నోవహు కాలం నుండి, దేవుడు మానవులకు జంతువులను చంపి తినడానికి అనుమతిచ్చాడు. అయినా, రక్తాన్ని ఒలికించడమనే నిర్దేశం, దేవుడు జంతువులను సృష్టించాడు కాబట్టి వాటి జీవాన్ని మనం గౌరవించాలని నొక్కిచెప్పింది. క్రైస్తవులు కేవలం వినోదం కోసం, లేదా వాటిని తరమడంలో, చంపడంలో ఉన్న ఆనందం కోసం చంపకూడదు. కైసరు నియమాలకు విధేయత చూపించడం, ఇతరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకోవడం ప్రాముఖ్యం. (రోమీయులు 14:13)—12/1, 31వ పేజీ.