కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీరిచ్చిన ఎంతో అమూల్యమైన బహుమతి”

“మీరిచ్చిన ఎంతో అమూల్యమైన బహుమతి”

“మీరిచ్చిన ఎంతో అమూల్యమైన బహుమతి”

బె ల్జియం మాజీ ప్రధానమంత్రి ఒకరు, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి * అనే పుస్తకాన్ని అలా వర్ణించాడు. ఒక వ్యక్తి స్నేహపూర్వకంగా ఆయన్ని కలుసుకొని ఆ పుస్తకపు కాపీని ఆయనకిచ్చాడు. ఆ తర్వాత ఆయన కృతజ్ఞతలు తెల్పుతూ ఒక ఉత్తరం రాశాడు: “మీరు నన్ను స్నేహపూర్వకంగా కలుసుకోవడం నాకు నిజంగా సంతోషం కలిగించింది. అంతేకాదు నాకు మీరు ఇచ్చిన ‘మహాగొప్ప మనిషి’కి అంకితం చేయబడిన పుస్తకం నాకు బాగా నచ్చింది, అది మీరిచ్చిన ఎంతో అమూల్యమైన బహుమతి.”

ఆ మాజీ ప్రధానమంత్రి, ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా విశ్లేషించి ఈ ముగింపుకొచ్చాడు: “ప్రజలు సువార్త సందేశంపట్ల మరింత ఆసక్తి చూపించి, యేసుక్రీస్తు సూత్రాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే నేడు లోకం పూర్తి భిన్నంగా ఉండేది. అప్పుడు మనకిక ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అవసరం వుండదు; తీవ్రవాదుల దాడులు జరగవు, లోకంలో హింసనేది లేకుండా పోతుంది.” ఇలా జరుగుతుందని తాను నమ్మలేనని ఆయన ఒప్పుకున్నప్పటికీ, ఆ తోటి వ్యక్తి చేస్తున్న మంచి పనిపట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశాడు.

ఆ ఉత్తరంలో ఇంకా ఇలా ఉంది: “మీరు ఇతరుల సంక్షేమంపట్ల శ్రద్ధగల ప్రశంసనీయమైన ప్రజలు, మీరు ఆశావాదులూ కాదు నిరాశావాదులూ కాదు గానీ మానవులు మెరుగవుతారనీ పరిస్థితులు చక్కబడతాయనీ నమ్మే ప్రజలు.”

శ్రేష్టమైన లోకం మనుష్యుల ప్రయత్నాలవల్ల కాదు గానీ దైవ ప్రమేయంవల్ల మాత్రమే వస్తుందని యెహోవా సాక్షులు నమ్ముతున్నారు. వారు మహాగొప్ప మనిషియైన యేసుక్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. యెహోవాసాక్షులు ఈ మధ్య ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా? మీరు వారితో, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడవచ్చు. మాజీ ప్రధానిని అంతగా ముగ్దుణ్ణి చేసిన ఆ పుస్తకాన్ని మీకు ఇవ్వడానికి వారెంతో సంతోషిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 2 యెహోవాసాక్షులు ప్రచురించారు.