కావలికోట కొత్త అధ్యయన ప్రతి
కావలికోట కొత్త అధ్యయన ప్రతి
మీరు చదువుతున్న పత్రిక కావలికోట అధ్యయన ప్రతియొక్క మొదటి సంచిక. ఈ పత్రిక సంతరించుకున్న కొత్తరూపానికి సంబంధించిన కొన్ని అంశాలను మీకు వివరించాలని అనుకుంటున్నాం.
అధ్యయన ప్రతి యోహోవాసాక్షుల కోసం, ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థుల కోసం ప్రచురించబడుతుంది. ఇది నెలసరి ప్రతి, ఇందులో నాలుగు లేదా ఐదు అధ్యయన ఆర్టికల్స్ ఉంటాయి. వాటిని పరిశీలించాల్సిన తేదీలు ఈ పత్రిక ముఖపత్రంపై ముద్రించబడ్డాయి. అధ్యయన ప్రతి క్షేత్ర పరిచర్యలో అందించబడదు కాబట్టి కావలికోట యొక్క సార్వజనిక ప్రతికి ఉన్నట్టు అధ్యయన ప్రతి సంచికల ముఖపత్రంపై వేర్వేరు చిత్రాలు ఉండవు.
ఈ పత్రికలోని 2వ పేజీలో, ప్రతీ అధ్యయన ఆర్టికల్ గురించిన లేక వరుసగా వచ్చే వివిధ అధ్యయన ఆర్టికల్స్ గురించిన సహాయకరమైన సంక్షిప్త సారాంశం ఉంది. అంతేకాక అదే పేజీలో ఈ ప్రతిలోని ఇతర ఆర్టికల్‌ల పట్టిక కూడా ఉంది. కావలికోట అధ్యయన నిర్వాహకులు, ఆ ఆర్టికల్స్‌ను సంఘ కూటాల్లో ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేలా నిర్వహించేందుకు సిద్ధపడుతున్నప్పుడు, 2వ పేజీలో ఇవ్వబడిన సారాంశం చాలా సహాయకరంగా ఉంటుంది.
అధ్యయన ఆర్టికల్స్ ఇంతకుముందుకన్నా కాస్త చిన్నవిగా ఉన్నాయని మీరు గమనిస్తారు. దీనివల్ల కావలికోట అధ్యయనం సమయంలో కీలక వచనాలను పరిశీలించడానికి తగినంత సమయం ఉంటుంది. ప్రతీవారం, ఆర్టికల్‌లో పేర్కొనబడిన లేఖనాలన్నింటినీ తెరిచి చూడాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. కొన్ని లేఖనాలు “చదవండి” అని పేర్కొనబడి ఉంటాయి, వాటిని కావలికోట అధ్యయనం జరుగుతున్న సమయంలో చదివి, చర్చించాలి. సమయముంటే ఇతర లేఖనాలను కూడా చదవచ్చు. కొన్ని ఆర్టికల్స్‌లో “పోల్చండి” అని పేర్కొనబడివున్న లేఖనాలు కనిపిస్తాయి. ఆ లేఖనాలకు పేరాలోని ముఖ్యమైన విషయాలకు నేరుగా సంబంధం ఉండదు కాబట్టి సాధారణంగా అవి సంఘ కూటాల్లో చదవబడవు. అయినప్పటికీ, “పోల్చండి” అని పేర్కొనబడిన లేఖనాల్లో ఆసక్తికరమైన అదనపు సమాచారం ఉంటుంది లేదా చర్చించబడుతున్న విషయాలను అవి పరోక్షంగా సమర్థించవచ్చు. కావలికోట అధ్యయనానికి సిద్ధపడుతున్నప్పుడు వాటిని చదవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. బహుశా మీరు మీ వ్యాఖ్యానాల్లో వాటిని చేర్చవచ్చు.
ఇకపై కావలికోటలో వార్షిక నివేదిక ప్రచురించబడదు. ఆ నివేదిక 2008 నుండి మన రాజ్య పరిచర్య మధ్యపేజీలో, వార్షికపుస్తకములో ఇవ్వబడుతుంది. అయితే, పైన సూచించబడినట్లుగా అధ్యయన ప్రతిలో మరితర ఆర్టికల్స్ కూడా ఉంటాయి. వీటిలో అనేకం సంఘ కూటాల్లో చర్చించబడకపోయినా మీరు వాటిని శ్రద్ధగా చదవాలని ప్రోత్సహిస్తున్నాం. వాటిలో కూడా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందిచ్చే ఆధ్యాత్మిక ఆహారం ఉంటుంది.—మత్త. 24:45-47.
చివరగా, కావలికోట యొక్క అధ్యయన ప్రతి, సార్వజనిక ప్రతి రెండు వేర్వేరు పత్రికలు కావు. అవి రెండూ కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే పత్రికకు సంబంధించినవే. ఆ రెండింటిలోనూ 2వ పేజీలో, కావలికోట ఉద్దేశాన్ని వివరించే పేరాలు ఉన్నాయి. వార్షిక సంపుటిలో రెండు ప్రతులూ ఉంటాయి. అధ్యయన ప్రతిలో ప్రచురించబడే “మీకు గుర్తున్నాయా?” అనే శీర్షికలో రెండు ప్రతులలోని సమాచారం ఉంటుంది.
కావలికోట 1879 నుండి, యుద్ధం, ఆర్థిక ఒడుదుడుకులు, వ్యతిరేకత ఉన్న సమయాల్లోనూ దేవుని రాజ్యాన్ని గురించిన సత్యాలను నమ్మకంగా ప్రకటిస్తూనే ఉంది. యెహోవా ఆశీర్వాదంతో, కొత్త రూపాన్ని సంతరించుకున్న కావలికోట కూడా అలానే చేస్తూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. కావలికోట కొత్త అధ్యయన ప్రతిని పాఠకులైన మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటుండగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాం.