కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“త్రవ్వడం మొదలుపెట్టమని” గిలియడ్‌ పట్టభద్రులు ప్రోత్సహించబడ్డారు

“త్రవ్వడం మొదలుపెట్టమని” గిలియడ్‌ పట్టభద్రులు ప్రోత్సహించబడ్డారు

123వ గిలియడ్‌ స్నాతకోత్సవం

“త్రవ్వడం మొదలుపెట్టమని” గిలియడ్‌ పట్టభద్రులు ప్రోత్సహించబడ్డారు

సెప్టెంబరు 8, 2007 శనివారం రోజున, వాచ్‌టవర్‌ బైబిలు స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 123వ ​తరగతి స్నాతకోత్సవానికి 41 దేశాల నుండి 6,352 మంది వచ్చారు. ఉదయం 10 గంటలకు ఆ కార్యక్రమ అధ్యక్షుడు, పరిపాలక సభ సభ్యుడు అయిన ఆంథనీ మారిస్‌ సభి​కులకు స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని పరిచయం చేసిన తర్వాత ఆయన మొదటి ప్రసంగీకుడిని వేదికపైకి ఆహ్వానించారు. మొదటి ప్రసంగాన్ని గ్యారీ బ్రొ ఇచ్చారు, ఆయన అమెరికా బ్రాంచి కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు.

విద్యార్థుల బాహ్యరూపం ఎలావున్నా, వారిలో యెహోవా ఇష్టపడేవిధంగా జీవించేవారు ఆయనకు ‘అందంగా’ కనిపిస్తారని సహోదరుడు బ్రొ వారికి హామీ ఇచ్చాడు. (యిర్మీ. 13:​11, NW) ఆ అందాన్ని కాపాడు​కోవాలని ఆయన వారిని ప్రోత్సహించాడు. దాని తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు గెరట్‌ లోష్‌, మనం యెహోవాను సేవిస్తున్నప్పుడు ప్రతిఫలం కోసం ఎదురు​చూడడం సబబేనని నొక్కిచెప్పారు. (హెబ్రీ. 11:⁠6) కానీ నిస్వార్థ ప్రేమే మనం యెహోవాను సేవించేలా పురికొల్పాలి.

తర్వాతి ప్రసంగంలో, దైవపరిపాలనా పాఠశాలల విభాగానికి పైవిచారణకర్త అయిన విలియమ్‌ సామ్యుల్సన్‌, పరిపాలిస్తున్న రాజు గురించి ప్రకటించే గౌరవపూర్వకమైన నియామకాన్ని నమ్మకంగా చేయమని, మంచి ప్రవర్తన ద్వారా తమ హుందాతనాన్ని కనబరచమని పట్టభద్రులను ప్రోత్సహించాడు. * దైవపరిపాలనా పాఠశాలల విభాగానికి సహాయ పైవిచారణకర్త అయిన సామ్‌ రాబర్‌సన్‌, ఎల్లప్పుడూ ఇతరుల్లో మంచిని చూడమని పట్టభద్రులను ప్రోత్సహించాడు. అలా చేసినప్పుడు వారు “సహోదరులను” మరింత ‘ప్రేమించగలుగుతారు.’​—⁠1 పేతు. 2:​17.

ఉత్తేజకరమైన ఆ ప్రసంగాల తర్వాత గిలియడ్‌ ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ పట్టభద్రుల్లో చాలామందిని ఇంటర్వ్యూ చేశారు. గిలియడ్‌ కోర్సు చేస్తున్న కాలంలో క్షేత్ర సేవలో తమకు ఎదురైన అనుభవాల గురించి వారు చెప్పారు. అక్కడున్నవారు పట్టభద్రులకు పరిచర్యపట్ల ఉన్న ప్రేమను, ఇతరులకు సహాయం చేయాలనే తపనను స్పష్టంగా చూడగలిగారు. ఆ తర్వాత, పాటర్‌సన్‌ బెతెల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కెంట్‌ ఫిషర్‌ మిషనరీలున్న మూడు దేశాలకు చెందిన బ్రాంచి కమిటీ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. పరిణతి చెందిన ఆ సభ్యుల మాటలు, కొత్త మిషనరీలు వారు వేళ్లే కొత్త ప్రదేశాల్లో చాలా చక్కగా చూసుకోబడతారని శ్రోతల్లో ఉన్న అనేకమంది పట్టభద్రుల తల్లిదండ్రులకు హామీనిచ్చాయి. ఆ తర్వాత, అనువాద సేవల విభాగానికి చెందిన ఇసాక్‌ మారే చాలా​కాలంగా సేవచేస్తున్న మిషనరీలను ఇంటర్వ్యూ చేశారు. వారు చెప్పిన అనుభవాలు పట్టభద్రులకు తాము చవిచూడబోయే ఆనందాల రుచిచూపించాయి.

“ఇదంతా విన్నాక మీరు ఇప్పుడు ఏమి చేయాలను​కుంటున్నారు?” అనే కార్యక్రమ ముఖ్య ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్‌ ఇచ్చారు. దక్షిణ పసిఫిక్‌లో దాదాపు 25 సంవత్సరాలు మిషనరీగా పనిచేసిన ఈ సహోదరుడు యేసు ఇచ్చిన కొండమీది ప్రసంగపు ముగింపులో చెప్పిన విషయాలను చర్చించారు. ఆ ప్రసంగంలో యేసు ఇద్దరు వ్యక్తుల గురించి అంటే ఒక బుద్ధిమంతుని, ఒక బుద్ధిహీనుని గురించి మాట్లాడాడు, వారిద్దరూ ఇళ్లు కట్టారు. ఆ రెండు ఇళ్లూ బహుశా ఒకే చోట కట్టబడివుండవచ్చని సహోదరుడు చెప్పారు. బుద్ధిహీనుడు ఇసుకపై ఇల్లు కడితే, బుద్ధిమంతుడు బండ కనిపించేంతవరకు నేలను త్రవ్వి ఇల్లు కట్టాడు. భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు రాతి పునాదిపై కట్టబడిన ఇల్లు నిలిచింది కానీ ఇసుకపై కట్టిన ఇల్లు కూలిపోయింది.​—⁠మత్త. 7:​24-27; లూకా 6:​48.

బుద్ధిహీనుడు, తన బోధలు విన్నా వాటిని అన్వయించుకోని వారిని పోలివున్నాడని యేసు వివరించాడు. బుద్ధిమంతుడు తన మాటలు విని, వాటిని జీవితంలో పాటించేవారిలా ఉన్నాడు. సహోదరుడు జాక్సన్‌ పట్టభద్రులతో, “మీరు బైబిలు అధ్యయనం ద్వారా నేర్చుకున్న విషయాలను మిషనరీ సేవలో అన్వయిస్తే మీరు బుద్ధిమంతునిలాగే ఉంటారు” అని చెప్పారు. ప్రసంగ ముగింపులో ఆయన, పట్టభద్రులను తమ మిషనరీ నియామకాల్లో “త్రవ్వడం మొదలుపెట్టమని” ప్రోత్సహించారు.

చివరిగా, పట్టభద్రులకు వారివారి పట్టాలను ఇచ్చి వారు ఏ యే దేశాలకు వెళ్లబోతున్నారో ప్రకటించారు. ముగింపులో, సహోదరుడు మారిస్‌ వారిని ప్రోత్సహిస్తూ కొంతసేపు మాట్లాడారు. పట్టభద్రులు ఎల్లప్పుడు యేసును అనుసరించాలని, శక్తి కోసం యెహోవాను వేడుకోవడం మానుకోవద్దని ఆయన ప్రోత్సహించారు. దానితో స్నాతకోత్సవ కార్యక్రమం ముగిసింది.

[అధస్సూచి]

^ పేరా 5 దైవపరిపాలనా పాఠశాలల విభాగం బోధనా కమిటీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. అది గిలియడ్‌ పాఠశాలను, బ్రాంచి కమిటీ సభ్యుల పాఠశాలను, ప్రయాణ పైవిచారణకర్తల పాఠశాలను పర్యవేక్షిస్తుంది.

[31వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

విద్యార్థులు 10 దేశాల నుండి వచ్చారు

24 దేశాలకు పంపించబడ్డారు

56 మంది హాజరయ్యారు

వారి సగటు వయసు 33.5

సగటున 17.9 సంవత్సరాలు సత్యంలో ఉన్నారు

సగటున 13.8 సంవత్సరాలు పూర్తికాల సేవలో ఉన్నారు

[32వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 123వ తరగతి పట్టభద్రుల పేర్లు

ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.

(1) ఎస్పార్సా, ఇ.; పాపీయా, ఎస్‌.; బీలాల్‌, ఎ.; స్వారేస్‌, ఎమ్‌.; ఇవర్స్‌, ఇ.; డొమిచీనో, కె. (2) రోజా, ఎమ్‌.; ఫ్యూజీ, ఆర్‌.; రేటీ, ఓ.; లివాటాన్‌, జె.; వాన్‌ లీమ్‌ప్యూటన్‌, ఎమ్‌. (3) బాస్కైనో, ఎ.; బెక్‌, కె.; బుడనాఫ్‌, హెచ్‌.; బ్రాజ్‌, సి.; పెల్ట్స్‌, కె.; సియా, ఎ. (4) లివాటాన్‌, ఎస్‌.; సాంటికో, హెచ్‌.; కాంటీ, ఎస్‌.; విల్సన్‌, జె.; రైలట్‌, జె.; పియర్స్‌, ఎస్‌.; ఫ్యూజీ, కె. (5) రోజా, డి.; బాస్కైనో, ఎమ్‌.; ఆస్టిన్‌, వి.; రోడియల్‌, పి.; బీలాల్‌, పి.; డొమిచీనో, పి. (6) రేటీ, బి.; ఛిజిక్‌, డి.; క్లార్క్‌, సి.; రైడెల్‌, ఎ.; ఎస్పార్జా, ఎఫ్‌.; సియా, పి.; వాన్‌ లీమ్‌ప్యూటన్‌, టి. (7) రోడియల్‌, జె.; ఇవర్స్‌, జె.; గ్రీన్‌, జె.; ఛిజిక్‌, జె.; సాంటికో, ఎమ్‌.; రైలట్‌, ఎమ్‌. (8) పెల్ట్స్‌, ఎల్‌.; ఆస్టిన్‌, డి.; రైడెల్‌, టి.; బెక్‌, ఎమ్‌.; పియర్స్‌, డబ్ల్యూ.; కాంటీ, ఎస్‌.; గ్రీన్‌, ఎస్‌. (9) స్వారేస్‌, జె.; క్లార్క్‌, జె.; పాపీయా, ఎస్‌.; బుడనాఫ్‌, ఎమ్‌.; విల్సన్‌, ఆర్‌.; బ్రాజ్‌, ఆర్‌.