కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

కొందరు క్రైస్తవులకు వివాహం తర్వాత ఎలాంటి తీవ్రమైన సమస్య ఎదురైంది, దాని విషయంలో వారు ఏమి చేయడానికి ప్రయాసపడాలి?

కొందరు క్రైస్తవ భార్యాభర్తలు వివాహం తర్వాత, తమ ఇష్టాయిష్టాలు ఎంతో వేర్వేరుగా ఉన్నాయని గుర్తించవచ్చు. లేఖనవిరుద్ధంగా విడాకులు తీసుకోవడం ఆమోదయోగ్యమైన పరిష్కారం కాదని వారికి తెలుసు కాబట్టి, వారు తమ కాపురాన్ని కాపాడుకునేందుకు ప్రయాసపడాలి.​—⁠4/15, 17వ పేజీ.

వృద్ధాశ్రమంలో ఉండే క్రైస్తవులకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు?

వారు చేరిన వృద్ధాశ్రమం ఏ సంఘ క్షేత్రంలో ఉందో వారికి తెలియకపోవచ్చు. అక్కడ ఉండేవారిలో చాలామంది విభిన్న మతనమ్మకాలు గలవారు అయ్యుండవచ్చు. వారు తమ మతాచారాల్లో సాక్షులను పాల్గొనేలా చేయవచ్చు. క్రైస్తవ బంధువులు, స్థానిక సంఘ సభ్యులు ఈ సమస్యలను గుర్తించి సహాయసహకారాలను అందించాలి.​—⁠4/15, 25-27 పేజీలు.

భార్యాభర్తలు సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడే నాలుగు పద్ధతులు ఏమిటి?

సమస్య గురించి మాట్లాడడానికి సమయాన్ని కేటాయించండి. (ప్రసం. 3:1, 7) మీ అభిప్రాయాన్ని నిజాయితీగా, గౌరవపూర్వకంగా తెలియజేయండి. (ఎఫె. 4:25) మీ భాగస్వామి చెప్పేది విని, వారి భావాలను అర్థం చేసుకోండి. (మత్త. 7:12) పరిష్కారం విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి, సమస్యను పరిష్కరించుకోవడానికి కలిసి ప్రయత్నించండి. (ప్రసం. 4:9, 10)​—⁠7/01, 10-12 పేజీలు.

ఋణాలను క్షమించమని మనం ప్రార్థించాలని యేసు ప్రోత్సహించినప్పుడు ఆయన ఏ ఋణాల గురించి మాట్లాడాడు?

మనం మత్తయి 6:12ను ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లోని లూకా 11:4తో పోలిస్తే యేసు అక్కడ అప్పులను క్షమించడం గురించి మాట్లాడడంలేదని స్పష్టమౌతుంది. ఆయన పాపాల గురించి మాట్లాడాడు. మనం క్షమించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా దేవుణ్ణి అనుకరించాలి.​—⁠5/15, 9వ పేజీ.

పరిపాలక సభ సభ్యులు ఏయే కమిటీల్లో పనిచేస్తున్నారు?

కో-ఆర్డినేటర్స్‌ కమిటీ, పర్సోనెల్‌ కమిటీ, పబ్లిషింగ్‌ కమిటీ, సర్వీస్‌ కమిటీ, టీచింగ్‌ కమిటీ, రైటింగ్‌ కమిటీ.​—⁠5/15, 29వ పేజీ.

రోమీయులు 1:24-32లో వర్ణించబడిన ప్రవర్తన యూదులకు అన్వయిస్తుందా లేక అన్యులకు అన్వయిస్తుందా?

ఆ వర్ణన రెండు గుంపులకు సరిపోతున్నా అపొస్తలుడైన పౌలు ముఖ్యంగా ఎన్నో శతాబ్దాలు ధర్మశాస్త్రాన్ని పాటించని ప్రాచీనకాల మతభ్రష్ట ఇశ్రాయేలీయుల గురించి ప్రస్తావిస్తున్నాడు. వారికి దేవుని న్యాయ​విధులు తెలిసినా వాటికి అనగుణంగా ప్రవర్తించలేదు.​—⁠6/15, 29వ పేజీ.

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకోవడం సంతోషాన్ని పెంచుతుందని ఎందుకు చెప్పవచ్చు?

ఎలాగైనా సరే ఫలాని పని చేయాలని మన సామర్థ్యానికి మించి కష్టపడితే అనవసరంగా బాధపడాల్సివస్తుంది. అయితే, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని, ప్రకటనా పనిలో మనం చేయగలిగినంత చేయకపోవడానికి దాన్ని ఒక సాకుగా చేసుకోకూడదు.​—⁠7/15, 29వ పేజీ.