కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఇది నిజంగానే దేవుని అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన పేరు”

“ఇది నిజంగానే దేవుని అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన పేరు”

“ఇది నిజంగానే దేవుని అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన పేరు”

క్యూసాకు చెందిన నికోలస్‌ 1430లో తానిచ్చిన ప్రసంగంలో పైనున్న మాటలను అన్నాడు. * ఆయనకు చాలా విషయాల్లో ఆసక్తి ఉండేది. ఉదాహరణకు, గ్రీకు, హెబ్రీ, తత్త్వశాస్త్రం, మతధర్మశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పరిపాలన కోసం ఏర్పడిన శాస్త్రంలో ఆయన 22 ఏళ్ళకే పట్టభద్రుడయ్యాడు. 1448లో ఆయన పోప్‌ తర్వాతి స్థానమైన కార్డినల్‌గా నియమించబడ్డాడు.

సుమారు 550 సంవత్సరాల క్రితం క్యూసాకు చెందిన నికోలస్‌, క్యూస్‌ అనే పట్టణంలో ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించాడు. ఆ పట్టణానికిప్పుడు బెర్న్‌ క్యాసల్‌ క్యూస్‌ అని పేరు, అది జర్మనీలోని బాన్‌కి దక్షిణాన దాదాపు 130 కి.మీ. దూరంలో ఉంది. ఆ భవనాన్నే క్యూసా గ్రంథాలయంగా మార్చి దానిలో 310కంటే ఎక్కువ చేతిరాత ప్రతులను ఉంచారు. వాటిల్లో కోడెక్స్‌ క్యూసానస్‌ 220 కూడ ఒకటి. క్యూసా 1430లో ఇచ్చిన ప్రసంగం దీనిలో ఉంది. ఇన్‌ ప్రిన్సిపియో ఎరట్‌ వెర్బమ్‌ (ఆదియందు వాక్యముండెను) అనే ఆ ప్రసంగంలో నికోలస్‌ యెహోవాకు లాటిన్‌ పదమైన ఇహువను వాడాడు. * దానిలోని 56వ పత్రంలో, “ఇది దేవుడు తనకు తానే పెట్టుకున్న పేరు. ఇది టెట్రాగ్రెమాటన్‌ అంటే నాలుగు అక్షరాల పేరు. . . . ఇది నిజంగానే దేవుని అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన పేరు” అని దేవుని పేరు గురించి రాయబడింది. ఆదిమ హెబ్రీ లేఖనాల్లో దేవుని పేరు ఖచ్చితంగా ఉందని నికోలస్‌ మాటలు చూపిస్తున్నాయి.​—⁠నిర్గ. 6:⁠3.

“ఇహువ” అన్న టెట్రాగ్రెమాటన్‌ ఉన్న​వాటిల్లో, పదిహేనవ శతాబ్ద ప్రారంభానికి చెందిన ఈ కోడెక్స్‌ అతిపురాతనమైనది. “యెహోవా” అనే దేవుని పేరును, చాలా శతాబ్దాలపాటు పుస్తకాల్లో తరచూ విభిన్న రీతుల్లో రాసేవారు అనడానికి ఈ రాతప్రతి మరో రుజువుగా ఉంది.

[అధస్సూచీలు]

^ పేరా 2 క్యూసాకు చెందిన నికోలస్‌కు నికోలస్‌ క్రిఫ్టస్‌ (క్రెబ్స్‌), నికోలస్‌ క్యూసానస్‌, నికోలస్‌ వాన్‌ క్యూస్‌ అనే పేర్లు కూడ ఉన్నాయి. క్యూస్‌ అనేది జర్మనీలో ఆయన పుట్టిన పట్టణం పేరు.

^ పేరా 3 ఆ ప్రసంగం త్రిత్వాన్ని సమర్థించడానికి ఇవ్వబడింది.

[16వ పేజీలోని చిత్రం]

క్యూసా గ్రంథాలయం