కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఏకహృదయంతో’ ఐక్యంగా దేవుణ్ణి సేవించండి

‘ఏకహృదయంతో’ ఐక్యంగా దేవుణ్ణి సేవించండి

‘ఏకహృదయంతో’ ఐక్యంగా దేవుణ్ణి సేవించండి

యేసుక్రీస్తు శిష్యులచుట్టూ యూదులు, యూదామత ప్రవిష్టులు గుమిగూడారు. వాళ్లంతా యెరూషలేములో పెంతెకొస్తు పండుగ జరుపుకోడానికి పశ్చిమానున్న రోమా, తూర్పునున్న పార్తీయ వంటి సుదూర ప్రాంతాలనుండి వచ్చారు. వాళ్లంతా వేర్వేరు భాషలు మాట్లాడేవారు. కానీ వారితో మాట్లాడుతున్న యేసు శిష్యులు గలిలయ​వాసులు. అందుకే అక్కడున్న కొందరు, “మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?” అని ఆశ్చర్యపడ్డారు.​—⁠అపొ. 2:⁠8.

అపొస్తలుడైన పేతురు వారి మధ్య నిలబడి వారు చూసిన అద్భుతం ఎలా జరిగిందో వివరించాడు. వెంటనే వేలాదిమంది స్పందించి బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 2:​41) కొద్దికాలంలోనే చాలామంది క్రైస్తవులైనా వాళ్లంతా ఐకమత్యంతో ఉండేవారు. అందుకే, “విశ్వసించినవారందరును ఏకహృదయము” కలిగివున్నారని బైబిలు రచయిత లూకా చెప్పాడు.​—⁠అపొ. 4:⁠32.

సా.శ. 33 పెంతెకొస్తునాడు బాప్తిస్మం తీసుకున్న వేలాదిమంది తమ కొత్త విశ్వాసం గురించి మరిన్ని విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇంకొంతకాలం యెరూషలేములోనే ఉండాలనుకున్నారు. కానీ అంతకాలం ఉండడానికి కావల్సిన ఆహారం, వస్తువులు వారి దగ్గర లేవు. అప్పుడు అపొస్తలులు వాళ్ల కోసం డబ్బును పోగుచేశారు. కొంతమంది విశ్వాసులు ఇష్టపూర్వకంగా తమ చరస్థిరాస్తులను అమ్మి, ఆ డబ్బును అవసరంలో ఉన్నవారి కోసం ఉపయోగించమని అపొస్తలులకు ఇచ్చారు. (అపొ. 2:​42-47) వారి ప్రేమా ఉదారతలు ఎంత గొప్పవి!

నిజ క్రైస్తవులు మొదటినుంచీ ఇలాగే ప్రేమా ఉదారతలను చూపించారు. నేటికీ క్రైస్తవ సంఘం ఐక్యంగా ‘ఏకహృదయముతో’ యెహోవాను సేవిస్తోంది. క్రైస్తవులు తమ సమయాన్ని, శక్తిని, డబ్బును సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యానికి సంబంధించిన పనులు చేయడానికి ఉదారంగా వెచ్చిస్తారు.​—⁠“కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు...” అనే బాక్సు చూడండి.

[6, 7వ పేజీలోని బాక్సు]

కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు . . .

ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు

చాలామంది కొంత మొత్తాన్ని పక్కనపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు.

ప్రతీనెలా సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. డబ్బు రూపంలో పంపించే విరాళాలను నేరుగా ఈ పత్రికలోని 2వ పేజీలో ఉన్న ఏ బ్రాంచి కార్యాలయ చిరునామాకైనా పంపించవచ్చు లేదా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయ చిరునామాకు పంపించవచ్చు. ఆ చిరునామాలకు పంపించే చెక్కులను “Watch Tower” * పేరున రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను కూడ విరాళంగా పంపించవచ్చు. అలాంటి వస్తువులను పంపిస్తున్నప్పుడు మీరే వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

 రతుపై విరాళ ట్రస్టు ఏర్పాటు  *

మీ విరాళాలను ప్రపంచవ్యాప్త పని కోసం ఉపయోగించడానికి వాచ్‌టవర్‌ ట్రస్టులో జమచేయవచ్చు. అయితే మీరు కావాలనుకున్నప్పుడు డబ్బు తిరిగి తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

దానధర్మ ప్రణాళిక  *

డబ్బు రూపంలోనేకాక ఇతర పద్ధతుల్లో కూడా ప్రపంచవ్యాప్త రాజ్యసేవ కోసం విరాళాలు ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు ఏమిటంటే:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ఖాతాలకు లబ్ధిదారుగా Watch Towerను సూచించవచ్చు. లేదా మరణానంతరం నగదును Watch Towerకు చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు బేషరతుగా బహుమతి రూపంలో ఇవ్వవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను బేషరతుగా బహుమతి రూపంలో ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి వారి మరణానంతరం Watch Towerకు చెందే ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన వీలునామాలు రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షిక​భత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న ఒక నిర్దిష్ట కార్పోరేషన్‌కు బదిలీ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో Watch Towerను * లబ్ధిదారుగా సూచించవచ్చు. కొన్ని దేశాల్లో, మత​పరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు. అయితే, ఇండియాలో మాత్రం అలాంటి రాయితీలు ఉండవు.

“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలంటే దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక * అనే బ్రోషూరు ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషూరు వివరిస్తుంది. ఆ బ్రోషూరును చదివి, తమ న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా మనం మతపరంగానూ, మానవతా దృష్టితోనూ చేస్తున్న పనికి మద్దతునివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందారు.

మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన నంబరుకు ఫోన్‌చేసి లేక చిరునామాకు ఉత్తరం రాసి యెహోవా​సాక్షులను సంప్రదించవచ్చు. లేదా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Jehovah’s Witnesses,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[అధస్సూచీలు]

^ పేరా 10 ఇండియాలోనైతే చెక్కులను “The Watch Tower Bible & Tract Society of India” పేరున రాయాలి

^ పేరా 11 ఇది ఇండియాకు వర్తించదు

^ పేరా 13 గమనిక: పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పన్ను నిబంధనలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి మీ అకౌంటెంట్‌ను లేక వకీలును సంప్రదించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని కూడా సంప్రదించండి.

^ పేరా 20 ఇండియాలోనైతే, “The Watch Tower Bible & Tract Society of India” పేరున రాయాలి

^ పేరా 21 ఇండియాలో లభించదు