“వచ్చి నన్ను వెంబడించుము”
“వచ్చి నన్ను వెంబడించుము”
“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.”—లూకా 9:23.
యేసు తన పరిచర్య చివరిభాగంలో యూదయకు ఈశాన్యాన యొర్దాను నది ఆవలివైపునున్న పెరయ ప్రాంతంలో సాక్ష్యమిస్తున్నాడు. ఓ యువకుడు ఆయన దగ్గరకు వచ్చి నిత్యజీవం పొందాలంటే తాను ఏమి చేయాలని ఆయనను అడిగాడు. ఆ యువకుడు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా అనుసరిస్తున్నట్లు గ్రహించిన యేసు ఆయనకు ఓ గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చాడు. యేసు “నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము” అని ఆయనతో చెప్పాడు. (మార్కు 10:21) ఆయనకు దొరికిన ఆహ్వానం గురించి ఒక్కసారి ఆలోచించండి. మహోన్నతుడైన దేవుని అద్వితీయ కుమారుడైన యేసునే అనుసరించే అవకాశం ఆయనకు లభించింది!
2 ఆ యువకుడు యేసు ఆహ్వానాన్ని అంగీకరించలేదు కానీ ఇతరులు దాన్ని అంగీకరించారు. అంతకుముందు “నన్ను వెంబడించుము” అనే ఆహ్వానాన్ని యేసు ఫిలిప్పుకు ఇచ్చాడు. (యోహా. 1:43) ఆయన దాన్ని అంగీకరించి ఆ తర్వాత అపొస్తలుడయ్యాడు. అదే ఆహ్వానాన్ని మత్తయికి ఇచ్చినప్పడు ఆయన కూడ దాన్ని అంగీకరించాడు. (మత్త. 9:9; 10:2-4) యేసు అలాంటి ఆహ్వానాన్నే నీతిని ప్రేమించేవారందరికీ ఇచ్చాడు, ఎందుకంటే ఆయన “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను” అని చెప్పాడు. (లూకా 9:23) కాబట్టి నిజంగా యేసు శిష్యులు కావాలనుకుంటే ఎవ్వరైనా కావచ్చు. మీకు ఆయన శిష్యులు కావాలనివుందా? మనలో చాలామంది ఇప్పటికే యేసు ప్రేమతో ఇచ్చిన ఆ ఆహ్వానాన్ని అంగీకరించాం. పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మనం ఆ ఆహ్వానాన్ని ఇతరులకు ఇస్తున్నాం.
3 అయితే, విచారకరంగా కొందరు మొదట్లో బైబిలు సత్యంపట్ల ఆసక్తి చూపించినా వారి ఆసక్తి సన్నగిల్లి, యేసును అనుసరించకుండా క్రమక్రమంగా ‘కొట్టుకొనిపోతారు.’ (హెబ్రీ. 2:1) మనకు అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే బాగుంటుంది: ‘అసలు నేను యేసును ఎందుకు అనుసరించాలనుకున్నాను? మనం ఆయనను అనుసరించాలంటే ఏమి చేయాలి?’ ఈ రెండు ప్రశ్నల జవాబులను మనం గుర్తుంచుకుంటే మనం ఎంపికచేసుకున్న మంచి మార్గంలోనే ఉండిపోవాలన్న కృతనిశ్చయంతో ఉండగలుగుతాం. అంతేకాక, ఇతరులు యేసును అనుసరించేలా ప్రోత్సహించగలుగుతాం.
యేసును ఎందుకు అనుసరించాలి?
4 యిర్మీయా ప్రవక్త ఇలా చెప్పాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీ. 10:23) యిర్మీయా మాటలు వాస్తవమని చరిత్ర రుజువుచేసింది. అపరిపూర్ణ మానవులు తమను తాము సరిగ్గా పరిపాలించుకోలేరనే విషయం అంతకంతకూ స్పష్టమైంది. ఏ మానవ నాయకునికి లేనన్ని అర్హతలు యేసుకు ఉన్నాయని తెలుసుకొన్నాం కాబట్టే ఆయనను అనుసరించమనే ఆహ్వానాన్ని మనం అంగీకరించాం. యేసుకున్న కొన్ని అర్హతలను మనం ఇప్పుడు చూద్దాం.
5 మొదటిగా, యేసును నాయకుడైన మెస్సీయగా యెహోవాయే ఎంపికచేశాడు. మనపై నాయకునిగా ఎవరిని నియమించాలో మన సృష్టికర్తకన్నా బాగా ఎవరికి తెలుసు? రెండవదిగా, మనం ఇష్టపడి అనుకరించగల లక్షణాలు యేసులో ఉన్నాయి. (యెషయా 11:2, 3 చదవండి.) ఆయన పరిపూర్ణమైన మాదిరినుంచాడు. (1 పేతు. 2:21) మూడవదిగా, యేసు తనను అనుసరించేవారి కోసం తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా వారిపట్ల ఎంతో శ్రద్ధవుందని చూపించాడు. (యోహాను 10:14, 15 చదవండి.) ఇప్పుడు సంతోషంగా ఉండేందుకు కావాల్సిన నిర్దేశాలనిస్తూ అద్భుతమైన నిత్య భవిష్యత్తు వైపు మనల్ని నడిపించడం ద్వారా తాను శ్రద్ధగల కాపరినని నిరూపించుకున్నాడు. (యోహా. 10:10, 11; ప్రక. 7:16, 17) ఈ కారణాలనుబట్టీ, మరితర కారణాలనుబట్టీ మనం ఆయనను అనుసరించాలని తీసుకున్న నిర్ణయం సరైనదే. అయితే ఆయనను అనుసరించాలంటే మనం ఏమి చేయాలి?
6 క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి క్రీస్తు అనుచరుడైపోడు. నేడు దాదాపు 200 కోట్లమంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. అయితే వారు ‘అక్రమము చేయువారు’ అని వారి కార్యాలు నిరూపిస్తున్నాయి. (మత్తయి 7:21-23 చదవండి.) నిజక్రైస్తవులు తమ అనుదిన జీవితంలో యేసు బోధలకూ, ఆయన మాదిరికీ అనుగుణంగా తమ జీవితాన్ని మలచుకుంటారనే విషయాన్ని యేసును అనుసరించమన్న ఆహ్వానాన్ని అంగీకరించేవారికి వివరిస్తాం. అలా మలచుకోవాలంటే ఏమి చేయాలో తెలుసుకునేందుకు యేసు గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు చర్చిద్దాం.
జ్ఞానం విషయంలో యేసు మాదిరిని అనుకరించండి
7 యేసు అనేక అద్భుతమైన లక్షణాలను కనబరిచాడు. కానీ ఈ ఆర్టికల్‌లో మనం నాలుగింటినే అంటే జ్ఞానం, వినయం, ఉత్సాహం, ప్రేమ గురించి చర్చిద్దాం. మొదటిగా, ఆయనకున్న జ్ఞానం గురించి అంటే పరిజ్ఞానాన్ని, అవగాహనను పరిస్థితికి తగ్గట్టు ఉపయోగించే ఆయన సామర్థ్యం గురించి పరిశీలిద్దాం. అపొస్తలుడైన పౌలు, ‘బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసులోనే గుప్తములైయున్నవి’ అని రాశాడు. (కొలొ. 2:3) యేసుకు అంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను” అని ఆయనే చెప్పాడు. (యోహా. 8:28) ఆయనకు ఆ జ్ఞానాన్నిచ్చింది యెహోవాయే కాబట్టి, యేసు అంత చక్కని నిర్ణయాలను ఎలా తీసుకోగలిగాడా అని మనం ఆశ్చర్యపోనవసరంలేదు.
8 ఉదాహరణకు, తన జీవితాన్ని ఎలా గడపాలనే విషయంలో ఆయన చక్కని నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుని చిత్తాన్ని చేయడం గురించే ఆలోచిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. రాజ్యానికి మొదటి స్థానమివ్వడానికి తన సమయాన్ని, శక్తిని జ్ఞానయుక్తంగా ధారపోశాడు. ‘కంటిని తేటగా’ ఉంచుకునేందుకు కృషిచేస్తూ మన శక్తిసామర్థ్యాలను వృథాచేసే అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం ద్వారా మనం యేసు మాదిరిని అనుసరిస్తాం. (మత్త. 6:22) చాలామంది క్రైస్తవులు పరిచర్యలో మరింత సమయం గడిపేలా తమ జీవితాన్ని నిరాడంబరంగా చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. కొందరు పయినీరు సేవను చేపట్టగలిగారు. మీరూ పయినీరు సేవ చేస్తుంటే అది ఎంతో మెచ్చుకోదగిన విషయం. ‘రాజ్యాన్ని మొదట వెదకడం’ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.—మత్త. 6:33.
యేసులా వినయాన్ని కనబరచండి
9 యేసు వ్యక్తిత్వంలోని రెండో అంశాన్ని మనం పరిశీలించనున్నాం. అది ఆయన వినయం. సాధారణంగా, అపరిపూర్ణ మానవులకు అధికారమిస్తే తామే గొప్పవారమన్నట్లు భావించడం మొదలుపెడతారు. అయితే, ఈ విషయంలో యేసు ఎంత భిన్నమైన వ్యక్తి! యెహోవా సంకల్పంలో ఆయనకు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర ఉన్నా ఇసుమంతైనా అహంకారాన్ని చూపించలేదు. ఆయనలా వినయాన్ని కనబరచాలని మనం ప్రోత్సహించబడ్డాం. “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలి. 2:5-7) ఆయన వినయాన్ని ఎలా చూపించాడు?
10 తన తండ్రితో పరలోకంలో నివసించే అద్భుతమైన అవకాశాన్ని యేసు చవిచూశాడు. అయినా ఆయన ఇష్టపూర్వకంగా ‘తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు.’ యెహోవా ఆయన జీవాన్ని యూదా కన్యక గర్భంలోకి మార్చాడు. ఆయన తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాడు. చివరకు ఒక పేద వండ్రంగివాని కుటుంబంలో నిస్సహాయ శిశువుగా పుట్టాడు. యోసేపు ఇంట్లో ఆయన లూకా 2:51, 52) ఆయన ఎంత అసాధారణ వినయాన్ని చూపించాడు!
తప్పటడుగులు వేసే పసివానిగా, బాలునిగా, అటు తర్వాత యౌవనస్థునిగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనలో ఏ పాపం లేకపోయినా, పెరిగి పెద్దవాడయ్యేంతవరకు పాపులైన మానవ తల్లిదండ్రులకు లోబడ్డాడు. (11 తక్కువైనవిగా అనిపించే నియామకాలను ఇష్టపూర్వకంగా చేయడానికి అంగీకరించినప్పుడు మనం యేసులాగే వినయాన్ని చూపిస్తాం. ఉదాహరణకు, సువార్త ప్రకటించడం గురించి ఆలోచించండి. ముఖ్యంగా ప్రజలు ఆసక్తి చూపించనప్పుడు, అపహసించినప్పుడు లేదా వ్యతిరేకించినప్పుడు ఆ పని తక్కువైనదిగా అనిపించవచ్చు. అయితే, ప్రకటనా పనిలో కొనసాగడం ద్వారా తనను అనుసరించమని యేసు ఇచ్చిన ఆహ్వానానికి ఇతరులు ప్రతిస్పందించేలా మనం సహాయం చేయగలుగుతాం. అలా మనం ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు సహాయం చేయగలుగుతాం. (2 తిమోతి 4:1-5 చదవండి.) మరో ఉదాహరణ, రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడంలో భాగంగా చెత్తబుట్టలను ఖాళీచేయడం, నేలను, బాత్రూమ్‌లను శుభ్రం చేయడం వంటి చిన్నచిన్న పనులు చేయాల్సిరావచ్చు! అయితే, మన ప్రాంతంలో స్వచ్ఛారాధనకు కేంద్రమైన రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం మనం దేవునికి చేసే పవిత్ర సేవలో భాగమని గుర్తిస్తాం. చిన్నవిగా కనిపించే పనులను కూడ ఇష్టపూర్వకంగా చేయడం ద్వారా మనం వినయాన్ని చూపిస్తూ క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తాం.
యేసులాగే ఉత్సాహాన్ని కనబరచండి
12 పరిచర్యలో యేసు చూపించిన ఉత్సాహం గురించి ఆలోచించండి. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు అనేక పనులు చేశాడు. ఆయన చిన్నప్పుడు తన తండ్రి యోసేపుతో కలిసి వండ్రంగి పనిచేసివుంటాడు. తన పరిచర్యలో ఆయన అనారోగ్యంతో ఉన్నవారిని బాగుచేయడం, చనిపోయినవారిని పునరుత్థానం చేయడంతోపాటు అనేక అద్భుతాలు చేశాడు. అయితే ఆయన ముఖ్యంగా వినడానికి ఇష్టపడేవారికి సువార్త ప్రకటించి, బోధించాడు. (మత్త. 4:23) ఆయన అనుచరులముగా మనమూ ఆ పని చేయాల్సివుంది. ఆయనను మనమెలా అనుకరించవచ్చు? యేసు ఏ ఉద్దేశాలతో ప్రకటనా పనిచేశాడో ఆ ఉద్దేశాలతోనే మనమూ ప్రకటించాలి.
13 అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవునిపట్ల ఉన్న ప్రేమతోనే యేసు ప్రకటనాపని చేశాడు, బోధించాడు. అంతేకాక తాను బోధించిన సత్యాలను ప్రేమించాడు. ఆ సత్యాలు ఆయనకు వెలకట్టలేని సంపదల్లాంటివి. వాటిని ఇతరులకు ప్రకటించడానికి ఉత్సాహాన్ని చూపించాడు. బోధకులముగా లేదా ఉపదేశకులముగా ఆ సత్యాల విషయంలో మనకూ అలాగే అనిపిస్తుంది. దేవుని వాక్యంనుండి మనం నేర్చుకున్న కొన్ని అమూల్యమైన సత్యాల గురించి ఒక్కసారి ఆలోచించండి! విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం గురించి, అది పరిష్కరించబడే విధానం గురించి మనకు మత్తయి 13:52 చదవండి.) ఎంతో ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా యెహోవా బోధించిన సత్యాలపట్ల మనకు ప్రేమవుందని ఇతరులకు చూపిస్తాం.
తెలుసు. మరణించినవారి స్థితి గురించి, దేవుడు నూతనలోకంలో తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి బైబిలు ఏమి బోధిస్తుందో మనకు బాగా తెలుసు. అలాంటి సత్యాలను మనం ఎంతోకాలం క్రితం నేర్చుకున్నా, ఈమధ్యనే నేర్చుకున్నా వాటి విలువ ఎన్నడూ తగ్గిపోదు. అవి నిజంగానే వెలకట్టలేని సంపదలు. (14 అంతేకాక, ఆయన ఎలా బోధించాడో గమనించండి. ఆయన తరచూ లేఖనాలను ఎత్తిచూపించాడు. ఆయన ఏదైనా ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నప్పుడు “వ్రాయబడియున్నది” అనే మాటను తరచూ ఉపయోగించేవాడు. (మత్త. 4:4; 21:13) సువార్తల్లో ఆయన చెప్పిన మాటలను చూస్తే ఆయన హెబ్రీ లేఖనాల్లో సగం కన్నా ఎక్కువ పుస్తకాల నుండి లేఖనాలను ఉల్లేఖించాడని లేదా ఉదహరించాడని తెలుస్తుంది. యేసులాగే మనం పరిచర్యలో ఎక్కువగా బైబిలును ఉపయోగిస్తాం, సాధ్యమైనప్పుడల్లా లేఖనాలను చూపించడానికి ప్రయత్నిస్తాం. అలా మనం మన సొంత అభిప్రాయాలను కాక దేవుని తలంపులను బోధిస్తున్నామని సహృదయులు తమంతట తామే గ్రహించేలా వారికి సహాయం చేస్తాం. బైబిలు లేఖనాలను చదివి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అన్వయించుకోవడంవల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడడానికి ఎవరైనా ఇష్టపడితే మనం ఎంత సంతోషిస్తాం! అలాంటి వారు యేసును అనుసరించమనే ఆహ్వానాన్ని అంగీకరిస్తే మన ఆనందానికి అవధులుండవు.
యేసును అనుసరించాలంటే ఇతరులను ప్రేమించాలి
15 చివరగా మన హృదయాన్ని ఎంతో స్పృశించే యేసు వ్యక్తిత్వంలోని మరో లక్షణాన్ని చర్చిద్దాం. అది తోటి మానవులపట్ల ఆయన చూపించిన ప్రేమ. అందుకే, “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరిం. 5:14) మానవులపట్ల, వ్యక్తిగతంగా మనలో ప్రతీ ఒక్కరిపట్ల ఆయనకున్న ప్రేమ గురించి ఆలోచిస్తే అది మన హృదయాన్ని స్పృశించి, ఆయన మాదిరిని అనుసరించాలనిపిస్తుంది.
16 యేసు ఇతరులపట్ల ఎలా ప్రేమను చూపించాడు? మానవుల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సుముఖత చూపించడం ద్వారా తాను వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించాడు. (యోహా. 15:13) అయితే, పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు ఆయన ఇతర విధాలుగా కూడ ప్రేమ కనబరిచాడు. ఉదాహరణకు, ఆయన బాధపడుతున్నవారిపట్ల కనికరాన్ని చూపించాడు. లాజరు మరణించినప్పుడు మరియ, ఆమెతోపాటు ఉన్నవారు ఏడ్వడాన్ని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. లాజరును పునరుత్థానం చేయబోతున్నప్పటికీ ఎంతగా కలవరపడ్డాడంటే ఆయన ‘కన్నీళ్లు విడిచాడు.’—యోహా. 11:32-35.
17 యేసు తన పరిచర్య ప్రారంభంలో ఒక కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, ‘నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు’ అని వేడుకున్నాడు. అప్పుడు యేసు ఏమి చేశాడు? “ఆయన కనికరప[డ్డాడు]” అని మార్కు సువార్త చెబుతుంది. ఆ తర్వాత ఆయన ఓ అసాధారణమైన పని చేశాడు. ఆయన “చెయ్యిచాపి వానిని ముట్టి—నాకిష్టమే; మార్కు 1:40-42.
నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.” మోషే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగులు అపవిత్రులు కాబట్టి, యేసు ఆ వ్యక్తిని ముట్టకుండానే బాగుచేయగలిగేవాడు. అయినా, యేసు ఆ కుష్ఠరోగిని బాగుచేస్తున్నప్పుడు మరో వ్యక్తి స్పర్శ ఎలా ఉంటుందో చూడనిచ్చాడు. బహుశా చాలా ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి ఆ కుష్ఠరోగిని అలా ముట్టుకొనివుంటాడు. వాత్సల్యంతో యేసు ఆయనపట్ల ఎంత కనికరాన్ని చూపించాడు!—18 యేసు అనుచరులముగా, ‘ఒకరి సుఖదుఃఖములలో మరొకరు పాలుపంచుకోవడం’ ద్వారా ప్రేమ చూపించాలని మనం ఆజ్ఞాపించబడ్డాం. (1 పేతు. 3:8) దీర్ఘకాల రోగాలతో లేదా ఎంతో మానసిక కృంగుదలతో బాధపడుతున్న తోటి విశ్వాసుల బాధలను అర్థం చేసుకోవడం మనకు కష్టమనిపించవచ్చు. ముఖ్యంగా మనకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకానప్పుడు అలా అనిపించవచ్చు. యేసు ఏనాడూ అనారోగ్యంతో బాధపడనప్పటికీ అనారోగ్యంతో ఉన్నవారిపట్ల సహానుభూతిని చూపించాడు. ఆయన సహానుభూతిని మనం ఎలా అలవర్చుకోవచ్చు? బాధలో ఉన్నవారు తమ గోడును మనకు చెబుతున్నప్పుడు ఓపికతో వినడం ద్వారా మనం అలా చేయవచ్చు. ‘నేను వారి పరిస్థితిలో ఉంటే నాకెలా అనిపించి ఉండేది?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇతరుల బాధలను అర్థం చేసుకోగలిగినప్పుడే మనం ఎంతో చక్కగా ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచగలుగుతాం.’ (1 థెస్స. 5:14) అలా మనం యేసును అనుసరించగలుగుతాం.
19 యేసు మాటల నుండి చేతల నుండి ఆయన గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయో! మనం ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా ఆయనను అనుకరించాలనుకుంటాం. అంతేకాక ఇతరులు ఆయనను అనుకరించేలా సహాయం చేయడానికి మరి ఎక్కువగా కృషిచేయాలనిపిస్తుంది. దీన్నంతటినిబట్టి, మెస్సీయ రాజును ఇప్పుడూ, ఎల్లప్పుడూ అనుసరించడంలో ఆనందాన్ని పొందుదాం!
మీరు వివరించగలరా?
• యేసులా మనం జ్ఞానాన్ని ఎలా కనబరచవచ్చు?
• మనం ఏయే విధాలుగా వినయాన్ని చూపించవచ్చు?
• పరిచర్యపట్ల ఉత్సాహాన్ని మనమెలా అలవర్చుకోవచ్చు?
• ఇతరులపట్ల ప్రేమను చూపించే విషయంలో ఏయే విధాలుగా మనం యేసును అనుకరించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) యేసు ప్రేమతో ఏ ఆహ్వానాన్నిచ్చాడు? (బి) యేసు ఆహ్వానానికి మీరు ఎలా స్పందించారు?
3. యేసును అనుసరించకుండా కొట్టుకొనిపోయే పరిస్థితి రాకూడదంటే మనం ఏమి చేయాలి?
4, 5. మనపై నాయకునిగా ఉండేందుకు యేసు ఎందుకు అర్హుడు?
6. యేసును అనుసరించాలంటే ఏమి చేయాలి?
7, 8. (ఎ) జ్ఞానమంటే ఏమిటి, యేసుకు ఎందుకు విస్తారమైన జ్ఞానముంది? (బి) యేసు జ్ఞానాన్ని ఎలా చూపించాడు? ఆయనను మనమెలా అనుకరించవచ్చు?
9, 10. యేసు వినయాన్ని ఎలా చూపించాడు?
11. యేసులాగే మనం ఏయే విధాలుగా వినయాన్ని కనబరచవచ్చు?
12, 13. (ఎ) యేసు ఉత్సాహాన్ని ఎలా చూపించాడు, దాన్ని చూపించడానికి ఆయనను ఏది ప్రోత్సహించింది? (బి) పరిచర్యలో ఉత్సాహంగా ప్రకటించడానికి మనల్ని ఏది ప్రోత్సహిస్తోంది?
14. యేసు బోధనా పద్ధతిని మనమెలా అనుకరించవచ్చు?
15. యేసుకున్న విశిష్ఠమైన ఒక లక్షణమేమిటి? దాని గురించి ఆలోచిస్తే మనకు ఏమి చేయాలనిపిస్తుంది?
16, 17. ఇతరులపట్ల తనకున్న ప్రేమను యేసు ఏయే విధాలుగా చూపించాడు?
18. మనం ఎలా ‘ఒకరి సుఖదుఃఖములో ఒకరు పాలుపంచుకోవచ్చు’?
19. యేసు మాదిరిని పరిశీలించిన తర్వాత మనకు ఏమి చేయాలనిపిస్తుంది?
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
క్రీస్తును అనుకరించేందుకు సహాయం చేసే ఓ పుస్తకం
2007 జిల్లా సమావేశ కార్యక్రమంలో ‘వచ్చి నన్ను అనుసరించండి’ (ఆంగ్లం) అనే 192 పేజీల పుస్తకం విడుదల చేయబడింది. యేసు గురించి, ప్రాముఖ్యంగా ఆయన లక్షణాల గురించి, కార్యాల గురించి ఆలోచించేందుకు ఈ పుస్తకం క్రైస్తవులకు సహాయం చేస్తుంది. రెండు ప్రారంభపు అధ్యాయాల తర్వాత మొదటి భాగం వినయం, ధైర్యం, జ్ఞానం, విధేయత, సహనం వంటి యేసు విశిష్టమైన లక్షణాలను క్లుప్తంగా వివరిస్తుంది.
ఆ తర్వాత ఓ బోధకునిగా, సువార్త ప్రకటించే ప్రచారకునిగా యేసు చేసిన కార్యాల గురించి, ఆయన మహోన్నత ప్రేమను చూపించిన కొన్ని విధానాల గురించి మిగతా భాగాలు వివరిస్తాయి. క్రైస్తవులు యేసును అనుకరించేందుకు సహాయం చేసే విధంగా ఈ పుస్తకంలోని సమాచారం రాయబడింది.
మనల్ని మనం పరిశీలించుకుని, ‘నేను నిజంగా యేసును అనుసరిస్తున్నానా? ఆయనను మరింత ఎక్కువగా ఎలా అనుసరించవచ్చు?’ వంటి ప్రశ్నల గురించి ఆలోచించేందుకు ఈ పుస్తకం మనల్ని ప్రోత్సహిస్తుందనీ, ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగలవారందరు’ క్రీస్తు అనుచరులయ్యేందుకు కూడ ఇది సహాయం చేస్తుందనీ మేము నమ్ముతున్నాం.—అపొ. 13:48, NW.
[4వ పేజీలోని చిత్రం]
భూమ్మీదకు వచ్చి మానవ శిశువుగా జన్మించేందుకు యేసు అంగీకరించాడు. అలా రావడానికి ఆయనకు ఏ లక్షణం అవసరమైంది?
[6వ పేజీలోని చిత్రం]
పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేందుకు మనల్ని ఏది ప్రోత్సహిస్తోంది?