యిర్మీయాను అనుకరించమని మిషనరీలు ప్రోత్సహించబడ్డారు
125వ గిలియడ్ తరగతి స్నాతకోత్సవం
యిర్మీయాను అనుకరించమని మిషనరీలు ప్రోత్సహించబడ్డారు
“ఈ గిలియడ్ తరగతి చరిత్రలోనే ఓ మైలురాయి” అని పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్ అన్నాడు. 2008, సెప్టెంబర్ 13న జరిగిన ద వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 125వ స్నాతకోత్సవానికి హాజరైన 6,156 మందిని ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నాడు. ఈ తరగతిలోని 56 మంది పట్టభద్రులతో కలిపి, గిలియడ్ పాఠశాల ఇప్పటి వరకు 8,000 కన్నా ఎక్కువమంది మిషనరీలను “భూదిగంతముల వరకు” పంపించింది.—అపొ. 1:8.
స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సహోదరుడు జాక్సన్ “విశ్వసనీయత చూపించడం వల్ల మీ పరిచర్య మెరుగుపడుతుందా?” అనే ప్రశ్న వేశాడు. ఆయన ఆ తర్వాత, విశ్వసనీయతను పెంచే ఈ నాలుగు విషయాలను చెప్పాడు. సరైన ఆలోచన విధానం అవసరమని, మంచి మాదిరిని ఉంచాలని, కేవలం దేవుని వాక్యాన్నే ఉపయోగిస్తూ బోధించాలని, యెహోవా నామాన్ని ఇతరులకు తెలియజేయడానికే ప్రాముఖ్యతనివ్వాలని వారికి చెప్పాడు.
బోధనా కమిటీలో సేవ చేస్తున్న డేవిడ్ షేఫర్, “మీరు సమస్తాన్ని గ్రహిస్తారా?” అనే అంశంపై మాట్లాడాడు. యెహోవాను వెదుకుతూ, వినయంతో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ గుర్తిస్తే మంచి మిషనరీలుగా ఉండేందుకు కావాల్సిన ‘సమస్తాన్ని గ్రహిస్తారు’ అనే అభయాన్ని ఆయన గిలియడ్ తరగతి విద్యార్థులకు ఇచ్చాడు.—సామె. 28:5; మత్త. 24:45.
ఆ తర్వాత పరిపాలక సభ సభ్యుడైన జాన్ ఇ. బార్ “దేవుని ప్రేమ నుండి ఏదీ మిమ్మల్ని వేరుచేయనివ్వకండి” అన్న అంశంపై మాట్లాడాడు. కొత్త మిషనరీలు ఎదుర్కొనే సమస్యల విషయంలో గిలియడ్ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉండే భయాలను తొలగిస్తూ ఒక ప్రేమగల తండ్రిలా ప్రోత్సహించాడు. “దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మనం భద్రంగా, సంతోషంగా ఉంటాం” అని ఆయన వివరించాడు. దేవుని నుండి మిషనరీలు దూరమైతే తప్ప వారిని వేరే ఏది కూడా ఆయన ప్రేమ నుండి వేరు చేయలేదు.
దైవపరిపాలనా పాఠశాలల విభాగానికి చెందిన సామ్ రాబర్సన్ “అత్యంత శ్రేష్టమైన దానిని” ధరించమని శ్రోతలను ప్రోత్సహించాడు. యేసు చేసిన కార్యాలను అధ్యయనం చేస్తూ, వాటిని తమ జీవితంలో అన్వయించుకోవడం ద్వారా గిలియడ్ పట్టభద్రులు ‘యేసుక్రీస్తును ధరించవచ్చు.’ (రోమా. 13:14) ఆ తర్వాత, దైవపరిపాలనా పాఠశాలల విభాగానికి పైవిచారణకర్తగా పనిచేస్తున్న విలియమ్ సామ్యుల్సన్ ఒక వ్యక్తి ఏమి చేస్తే గౌరవం పొందేందుకు అర్హుడవుతాడో చెప్పాడు. ఓ వ్యక్తి మానవుల గౌరవం పొందితే సరిపోదు గానీ దేవుడే ఆయనను గౌరవం పొందేందుకు అర్హునిగా దృష్టించాలి.
మైఖెల్ బర్నెట్ అనే గిలియడ్ ఉపదేశకుడు, పరిచర్యలో ఎదురైన అనుభవాలను తెలియజేయమని కొంతమంది విద్యార్థులను అడిగాడు. న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో గిలియడ్ పాఠశాల జరుగుతున్న కాలంలో అనేకసార్లు పనిచేయబడిన ప్రాంతంలోనే చాలామంది విద్యార్థులు ప్రకటనా పనిచేశారు. అయితే, అలాంటి ప్రాంతంలో కూడా వారు ఆసక్తిగలవారిని కనుగొన్నారు. సమావేశ కార్యాలయానికి చెందిన జెరల్డ్ గ్రిజెల్, బ్రాంచి కమిటీ పాఠశాలకు హాజరైన ముగ్గురు సహోదరులను ఇంటర్వ్యూ చేశాడు. తమ విదేశీ నియామకాలకు సిద్ధపడడానికి వారి మాటలు పట్టభద్రులకు సహాయం చేశాయి.
గిలియడ్ పాఠశాల 42వ తరగతి పట్టభద్రుడూ, పరిపాలక యిర్మీ. 1:7, 8) కొత్త మిషనరీలను కూడా దేవుడు అలాగే బలపరుస్తాడు. “మీకు ఎవరితోనైనా సమస్య ఉంటే, ఆ వ్యక్తిలో మీరు ఇష్టపడే పది లక్షణాలను రాసుకోండి. ఒకవేళ అలా రాయలేకపోతే వారి గురించి మీకు అంతగా తెలియదని అర్థం” అని సహోదరుడు స్ప్లేన్ చెప్పాడు.
సభ సభ్యుడూ అయిన డేవిడ్ స్ప్లేన్ “యిర్మీయాను అనుకరించండి” అనే ప్రసంగాన్నిచ్చాడు. యిర్మీయా తనకివ్వబడిన నియామకం విషయంలో భయపడినా, యెహోవా ఆయనను బలపరిచాడు. (యిర్మీయా స్వయంత్యాగాన్ని చూపించాడు. ఆయన, తన సేవను ఆపేయాలని అనుకున్నప్పుడు దేవునికి ప్రార్థించాడు. అప్పుడు, యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు. (యిర్మీ. 20:11) “మీరు నిరుత్సాహపడితే, ప్రార్థనలో యెహోవాకు ఆ విషయాన్ని తెలియజేయండి. ఆయన మీకు ఎలా సహాయం చేస్తాడో చూసి మీరు ఆశ్చర్యపోతారు” అని సహోదరుడు స్ప్లేన్ అన్నాడు.
తమ విశ్వసనీయతను పెంచుకునే అనేక మార్గాలను పట్టభద్రులు నేర్చుకున్నారని అధ్యక్షుడు స్నాతకోత్సవ కార్యక్రమ ముగింపులో శ్రోతలకు గుర్తుచేశాడు. మిషనరీలను నమ్మవచ్చని ప్రజలు గుర్తించినప్పుడు వారిచ్చే సాక్ష్యం మరింత శక్తివంతంగా ఉంటుంది.—యెష. 43:8-12.
[22వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
విద్యార్థులు 6 దేశాల నుండి వచ్చారు
21 దేశాలకు పంపించబడ్డారు
56 మంది హాజరయ్యారు
వారి సగటు వయసు 32.9
17.4 సంవత్సరాలు సత్యంలో ఉన్నారు
సగటున 13 సంవత్సరాలు పూర్తికాల సేవలో ఉన్నారు
[23వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 125వ తరగతి పట్టభద్రుల పేర్లు
ఈ కింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమవైపు నుండి కుడివైపుకు ఇవ్వబడ్డాయి.
(1) హాజ్సన్, ఎ.; వాల్, ఎ.; బీరెన్స్, కె.; హార్ట్‌లానో, ఎమ్.; న్యూమన్, ఎల్.; డికాసో, ఎ. (2) జెన్గ్‌కన్జ్, జె.; జెర్జిమ్స్‌కి, టి.; మెండిస్, ఎన్.; కరోనా, వి.; కానలీటా, ఎల్. (3) ఫ్రైయర్, హెచ్.; సవీజ్, ఎమ్.; టిడ్వెల్, కె.; ఎరిక్సన్, ఎన్.; డిక్, ఇ.; మ్యాక్‌బెత్, ఆర్. (4) పెరేజ్, ఎల్.; ప్యూస్, ఎల్.; స్కిడ్మోర్, ఎ.; యంగ్, బి.; మ్యాక్‌బ్రైడ్, ఎన్.; రోండన్, పి.; గుడ్‌మన్, ఇ. (5) బీరెన్స్, ఎమ్.; ఫర్గాసన్, జె.; పీర్సన్, ఎన్.; చాప్‌మ్యాన్, ఎల్.; వొర్డల్, జె.; కెనలీట, ఎమ్. (6) పెరేజ్, పి.; డి కాసో, డి.; యంగ్, టి.; రోండన్, డి.; గుడ్‌మన్, జి.; జెన్గ్‌కన్జ్, ఎమ్.; డిక్, జి. (7) కరోనా, ఎమ్.; వాల్, ఆర్.; ప్యూస్, ఎస్.; మెండిస్, ఎఫ్.; జెర్జిమ్స్‌కి, ఎస్.; సవీజ్, టి. (8) న్యూమన్, సి.; ఫర్గాసన్, డి.; స్కిడ్మోర్, డి.; ఎరిక్సన్, టి.; మ్యాక్‌బ్రైడ్, జె.; పీర్సన్, ఎమ్.; చాప్‌మ్యాన్, ఎమ్. (9) హాజ్సన్, కె.; వొర్డల్, ఎ.; మ్యాక్‌బెత్, ఎ.; టిడ్వెల్, టి.; ఫ్రైయర్, జె.; హార్ట్‌లానో, జె.