కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొప్ప దావీదుగా, గొప్ప సొలొమోనుగా—యేసు పాత్రను గుర్తించండి

గొప్ప దావీదుగా, గొప్ప సొలొమోనుగా—యేసు పాత్రను గుర్తించండి

గొప్ప దావీదుగా, గొప్ప సొలొమోనుగా​​—⁠యేసు పాత్రను గుర్తించండి

“ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”​—⁠మత్త. 12:⁠42.

ప్రవక్త అయిన సమూయేలుకు ఆయన రాజులా కనిపించలేదు. ఓ మామూలు గొర్రెల కాపరిగానే కనిపించాడు. అదీగాక, ఆయన పుట్టిన బేత్లెహేము కూడా పెద్ద పేరున్న పట్టణమేమీ కాదు. అది ‘యూదావారి కుటుంబములలో స్వల్పమైన గ్రామమని’ చెప్పబడింది. (మీకా 5:⁠2) అయినా, చిన్న పట్టణం నుండి వచ్చిన ఈ మామూలు యువకుణ్ణి ప్రవక్తయైన సమూయేలు ఇశ్రాయేలీయుల భావి రాజుగా అభిషేకించనున్నాడు.

2 యెష్షయి, అభిషేకించమని సమూయేలు ముందుకు తీసుకొచ్చిన మొదటి కుమారుడు దావీదు కాదు, అలాగని ఆయన రెండవవాడూ లేదా మూడవ వాడూ కాదు. యెష్షయి ఎనిమిదిమంది కుమారుల్లో దావీదు చివరివాడు. అంతేకాక, ఇశ్రాయేలు ప్రజలకు భావి రాజును అభిషేకించడానికి సమూయేలు ఆ విశ్వాసంగల వ్యక్తి ఇంటికి వెళ్లినప్పుడు దావీదు లేడు. అయితే మిగతావాళ్లు ఏమనుకున్నా యెహోవా మాత్రం దావీదునే ఎంపికచేసుకున్నాడు.​—⁠1 సమూ. 16:​1-10.

3 సమూయేలు చూడలేనిదాన్ని యెహోవా చూశాడు. దేవునికి దావీదు హృదయ పరిస్థితి తెలుసు కాబట్టి, ఆయన దాన్ని చూసి ఎంతో ఇష్టపడ్డాడు. దేవుడు పైరూపానికి ప్రాముఖ్యతనివ్వడు కానీ అంతరంగానికి ప్రాముఖ్యతనిస్తాడు. (1 సమూయేలు 16:7 చదవండి.) అందుకే, యెష్షయి ఏడుగురు కుమారుల్లో ఎవ్వరినీ యెహోవా ఎన్నుకోలేదని సమూయేలు తెలుసుకున్నప్పుడు గొర్రెలను మేపడానికి వెళ్లిన ఆయన చిన్నకుమారుణ్ణి రప్పించమని చెప్పాడు. అప్పుడు ఇలా జరిగిందని బైబిలు చెబుతోంది: “అతడు [యెష్షయి] వాని [దావీదు] పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే​—⁠నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను.”​—⁠1 సమూ. 16:​12, 13.

క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్న దావీదు

4 దావీదులాగే యేసు కూడా బేత్లెహేములోనే పుట్టాడు. దావీదు పుట్టిన 1,100 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. చాలామందికి యేసు రాజులా కనిపించలేదు. భావి రాజు గురించి చాలామంది ఇశ్రాయేలీయులు ఊహించుకున్న లక్షణాలేవీ ఆయనలో కనిపించలేదు. అయినా, దావీదును ఎన్నుకున్నట్లే యెహోవా యేసునే ఎన్నుకున్నాడు. దావీదులాగే ఆయన యెహోవాకు ఎంతో ప్రియుడు. * (లూకా 3:22) యేసుమీద కూడా ‘యెహోవా ఆత్మ పనిచేస్తూ వచ్చింది.’

5 దావీదుకూ యేసుకూ మధ్య ఇంకా ఎన్నో పోలికలు ఉన్నాయి. ఉదాహరణకు, దావీదు సలహాదారుడైన అహీతోపెలు దావీదుకు నమ్మకద్రోహం చేసినట్లే, యేసు అపొస్తలుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసుకు నమ్మకద్రోహం చేశాడు. (కీర్త. 41:9; యోహా. 13:18) యెహోవా ఆరాధనా స్థలం విషయంలో వారిద్దరూ ఎంతో ఉత్సాహం చూపించారు. (కీర్త. 27:4; 69:9; యోహా. 2:17) అంతేకాక, యేసు దావీదు వారసుడు. యేసు పుట్టకముందు దేవదూత ఆయన తల్లితో ఇలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.” (లూకా 1:32; మత్త. 1:⁠1) మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ యేసు విషయంలో నెరవేరతాయి కాబట్టి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన మెస్సీయ రాజు, గొప్ప దావీదు ఆయనే.​—⁠యోహా. 7:⁠42.

కాపరి అయిన రాజును అనుకరించండి

6 యేసు కాపరి కూడా. మంచి కాపరికి ఎలాంటి లక్షణాలుంటాయి? ఆయన నమ్మకస్థునిగా ఉంటూ, మందను ధైర్యంగా చూసుకుంటాడు. అంతేకాక, వాటిని మేపుతూ ప్రమాదాల నుండి కాపాడతాడు. (కీర్త. 23:​2-4) చిన్నప్పుడు దావీదు కాపరిగా పనిచేశాడు. తన తండ్రి గొర్రెలను ఎంతో బాగా చూసుకున్నాడు. గొర్రెల మంద ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన ధైర్యాన్ని కనబరిచాడు. సింహము, ఎలుగుబంటి నుండి గొర్రెలను రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు.​—⁠1 సమూ. 17:​34, 35.

7 దావీదు గొర్రెలను మేపుతూ పొలాల్లో, గుట్టల్లో ఎన్నో సంవత్సరాలు గడపడంవల్ల ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి సంబంధించిన పెద్ద పెద్ద బాధ్యతలను, విధులను చేపట్టేందుకు కావాల్సిన శిక్షణ లభించింది. * (కీర్త. 78:​70, 71) యేసు తన క్రియల ద్వారా తానూ ఓ ఆదర్శవంతమైన కాపరినని చూపించాడు. ‘చిన్నమందను,’ ‘వేరే గొర్రెలను’ కాస్తుండగా యెహోవా ఆయనకు కావాల్సిన బలాన్ని, నిర్దేశాన్ని ఇస్తాడు. (లూకా 12:32; యోహా. 10:16) అలా తానొక మంచి కాపరినని యేసు నిరూపించుకున్నాడు. ఆయనకు తన మందలోని గొర్రెలు ఎంత బాగా తెలుసంటే వాటిని పేరుపేరునా పిలుస్తాడు. ఆయన తన గొర్రెలను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే భూమ్మీదున్నప్పుడు వాటి కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. (యోహా. 10:​3, 11, 14, 15) ఓ మంచి కాపరిగా యేసు, దావీదు ఎన్నడూ చేయలేనిది చేశాడు. ఆయన విమోచన క్రయధన బలివల్లే మరణం నుండి విముక్తిపొందే అవకాశం మానవులకు లభించింది. పరలోకంలో అమర్త్యమైన జీవితంవైపు తన ‘చిన్నమందను’ నడిపిస్తుండగా, తోడేళ్లలాంటి వ్యక్తులులేని నూతనలోకంలోకి తన ‘వేరేగొర్రెలను’ నిత్యజీవానికి నడిపిస్తుండగా ఏదీ ఆయనను ఆపలేదు.​—⁠యోహాను 10:​27-29 చదవండి.

జయిస్తున్న రాజును అనుసరించండి

8 దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలున్న దేశాన్ని కాపాడడానికి ధైర్యంగా యుద్ధాలు చేశాడు. అంతేకాక, “దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.” దావీదు పరిపాలనలో ఆ దేశ సరిహద్దులు ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు విస్తరించాయి. (2 సమూ. 8:​1-14) యెహోవా సహాయంతో దావీదు అత్యంత శక్తివంతమైన రాజయ్యాడు. బైబిలు ఇలా చెబుతోంది: “దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనులకందరికి కలుగజేసెను.”​—⁠1 దిన. 14:⁠17.

9 రాజైన దావీదులాగే భూమ్మీదున్నప్పుడు యేసు కూడా ధైర్యాన్ని కనబరిచాడు. దేవుని రాజ్యానికి నియమిత రాజుగా ఆయన దయ్యాలమీద తన అధికారాన్ని చూపించి వాటి బారినుండి ప్రజలను విడిపించాడు. (మార్కు 5:​2, 6-13; లూకా 4:36) ప్రధాన శత్రువైన అపవాది అయిన సాతాను కూడా ఆయనను ఏమీ చేయలేకపోయాడు. యేసు యెహోవా సహాయంతో సాతాను అధీనంలో ఉన్న లోకాన్ని జయించాడు.​—⁠యోహా. 14:30; 16:33; 1 యోహా. 5:⁠19.

10 యేసు చనిపోయి, పునరుత్థానం చేయబడి పరలోకానికి వెళ్లిన దాదాపు 60 సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనం కలిగింది. యేసు పరలోకంలో యోధుడైన రాజుగా ఉండడాన్ని ఆయన ఆ దర్శనంలో చూశాడు. దాని గురించి యోహాను ఇలా రాశాడు: “ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.” (ప్రక. 6:⁠2) తెల్లని గుర్రంమీద స్వారీ చేస్తున్నది యేసే. 1914లో ఆయన పరలోకంలో రాజుగా నియమించబడినప్పుడు, ‘ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడింది.’ ఆ తర్వాత ‘ఆయన జయిస్తూ వెళ్లాడు.’ అవును, దావీదులాగే యేసు కూడా జయిస్తున్న రాజు. దేవుని రాజ్యానికి రాజుగా నియమించబడిన కొద్దికాలానికే ఆయన సాతానుతో జరిగిన యుద్ధంలో విజయం సాధించి సాతానును అతని దయ్యాలను భూమ్మీదకు పడద్రోశాడు. (ప్రక. 12:​7-9) సాతాను దుష్ట విధానాన్ని పూర్తిగా నాశనం చేసేంతవరకు యేసు ‘జయిస్తూ’ తన స్వారీని కొనసాగిస్తాడు.​—⁠ప్రకటన 19:​11, 19-21 చదవండి.

11 అయితే, దావీదులాగే యేసు కనికరంగల రాజు కాబట్టి, ఆయన హార్‌మెగిద్దోనులో ‘గొప్పసమూహాన్ని’ కాపాడతాడు. (ప్రక. 7:​9, 14) అంతేకాక, యేసు తన తోటివారసులైన 1,44,000 మందితో కలిసి పరిపాలిస్తున్నప్పుడు “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము” జరుగుతుంది. (అపొ. 24:​14, 15) భూమ్మీద పునరుత్థానం చేయబడేవారికి నిరంతరం జీవించే గొప్ప అవకాశముంటుంది. వారికి ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచివుంది! కాబట్టి మనమందరం ‘మేలు చేస్తూ’ ఉండాలనే కృతనిశ్చయంతో ఉందాం. అలా చేస్తే గొప్ప దావీదు పరిపాలనలో సంతోషాన్ని అనుభవించే నీతిమంతులతో భూమి నిండుకున్నప్పుడు మనం సజీవంగావుంటాం.​—⁠కీర్త. 37:​27-29.

జ్ఞానం కోసం సొలొమోను చేసిన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు

12 దావీదు కుమారుడైన సొలొమోను కూడా యేసుకు ముంగుర్తుగా ఉన్నాడు. * సొలొమోను రాజైనప్పుడు యెహోవా ఆయనకు కలలో కనిపించి, ఏమి కోరుకుంటే అది ఇస్తానని అన్నాడు. సొలొమోను మరింత సంపద కోసం, బలం కోసం లేదా దీర్ఘాయుష్షు కోసం కోరుకునే అవకాశమున్నా ఆయన నిస్వార్థంగా యెహోవాను ఇలా వేడుకున్నాడు: “ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్క పెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.” (2 దిన. 1:​7-10) యెహోవా సొలొమోను ప్రార్థనకు జవాబిచ్చాడు.​—⁠2 దినవృత్తాంతములు 1:​11, 12 చదవండి.

13 సొలొమోను యెహోవాకు నమ్మకంగా ఉన్నంతకాలం జ్ఞానంతో మాట్లాడడంలో ఆయన సమకాలీనులెవ్వరూ ఆయనకు సాటి రాలేదు. సొలొమోను “మూడు వేల సామెతలు” చెప్పాడు. (1 రాజు. 4:​30, 32, 34) వాటిలో చాలా సామెతలు రాయబడ్డాయి. జ్ఞానాన్ని వెదికేవారు ఇప్పటికీ వాటిని ఎంతో విలువైనవిగా ఎంచుతారు. ‘గూఢార్థముగల మాటలతో’ సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి షేబ దేశపు రాణి 2,400 కి.మీ. ప్రయాణించి వచ్చింది. సొలొమోను చెప్పిన జవాబులను బట్టి, ఆ రాజ్యంలోవున్న సిరిసంపదలను బట్టి ఆమె ముగ్ధురాలైంది. (1 రాజు. 10:​1-9) అంత జ్ఞానం సొలొమోనుకు ఎక్కడి నుండి వచ్చిందో బైబిలు చెబుతోంది: “అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.”​—⁠1 రాజు. 10:⁠24.

జ్ఞానవంతుడైన రాజును అనుసరించండి

14 జ్ఞానం విషయంలో కేవలం ఒకే ఒక వ్యక్తి సొలొమోనును మించిపోయాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తే. తాను ‘సొలొమోనుకన్నా గొప్పవాడిని’ అని ఆయనే స్వయంగా చెప్పాడు. (మత్త. 12:42) యేసు “నిత్యజీవపు మాటలు” మాట్లాడాడు. (యోహా. 6:68) ఉదాహరణకు, సొలొమోను చెప్పిన కొన్ని సామెతల్లోని సూత్రాలను యేసు తన కొండమీది ప్రసంగంలో మరింత స్పష్టంగా వివరించాడు. యెహోవా ఆరాధకులకు సంతోషాన్ని తీసుకొచ్చే అనేక విషయాలను సొలొమోను వివరించాడు. (సామె. 3:13; 8:​32, 33; 14:21; 16:20) యెహోవా ఆరాధనకు సంబంధించిన, దేవుని వాగ్దానాల నెరవేర్పుకు సంబంధించిన విషయాల్లోనే నిజమైన సంతోషం పొందవచ్చని యేసు నొక్కిచెప్పాడు. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది” అని ఆయన అన్నాడు. (మత్త. 5:⁠3) యేసు బోధల్లోని సూత్రాలను పాటించేవారు “జీవపు ఊట” అయిన యెహోవాకు దగ్గరౌతారు. (కీర్త. 36:9; సామె. 22:11; మత్త. 5:⁠8) క్రీస్తు ‘దేవుని జ్ఞానానికి’ ప్రతిరూపం. (1 కొరిం. 1:​24, 30) మెస్సీయ రాజుగా యేసుక్రీస్తుకు “జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ” ఉంది.​—⁠యెష. 11:⁠2.

15 గొప్ప సొలొమోను అనుచరులముగా మనం దైవిక జ్ఞానం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు? యెహోవా జ్ఞానం ఆయన వాక్యమైన బైబిల్లో తెలియజేయబడింది కాబట్టి మనం దాన్ని కనుగొనేందుకు బైబిలును, ముఖ్యంగా దానిలోని యేసు మాటలను శ్రద్ధగా అధ్యయనం చేసి ధ్యానించడానికి కృషి చేయాలి. (సామె. 2:​1-5) అంతేకాక, జ్ఞానం కోసం దేవుణ్ణి పట్టుదలతో వేడుకోవాలి. మనం సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని దేవుని వాక్యం అభయమిస్తోంది. (యాకో. 1:⁠5) దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుని వాక్యంలో అమూల్యమైన జ్ఞానాన్ని కనుగొంటాం. దానివల్ల సమస్యలను అధిగమించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (లూకా 11:13) ‘సమావేశపర్చేవాడు’ అని కూడ సొలొమోను పిలవబడ్డాడు. ‘ఆయన జనులకు జ్ఞానము బోధిస్తూ వచ్చాడు.’ (ప్రసం. 12:​9, 10, NW) క్రైస్తవ సంఘానికి శిరస్సుగా యేసు కూడా ప్రజల్ని సమవేశపర్చేవాడే. (యోహా. 10:16; కొలొ. 1:18) కాబట్టి, క్రమంగా ‘బోధించబడే’ సంఘ కూటాలకు మనం హాజరుకావాలి.

16 సొలొమోను రాజు తన పరిపాలనలో ఎన్నో పనులు చేయించాడు. దేశమంతటా నిర్మాణకార్యక్రమాలను చేపట్టాడు. రాజభవనాలను, రహదార్లను, నీటి పథకాలను, గోదాములను, రథముల పట్టణాలను, రౌతుల పట్టణాలను కట్టించాడు. (1 రాజు. 9:​17-19) ఆయన రాజ్యంలోనివారంతా ఆ నిర్మాణ పనుల నుండి ప్రయోజనం పొందారు. యేసు కూడా నిర్మాణకుడే. ఆయన “బండమీద” తన సంఘాన్ని కట్టాడు. (మత్త. 16:18) నూతనలోకంలో కూడా ఆయన నిర్మాణ పనులను చేపడతాడు.​—⁠యెష. 65:​21, 22.

సమాధానకర్త అయిన రాజును అనుసరించండి

17 సొలొమోను అనే పేరు “సమాధానం” అనే మూల పదం నుండి వచ్చింది. సొలొమోను రాజు యెరూషలేము నుండి పరిపాలించాడు, యెరూషలేము అనే మాటకు “రెండు విధాలుగా సమాధానం కలిగివున్న పట్టణం” అనే అర్థం ఉంది. ఆయన 40 సంవత్సరాల పరిపాలనలో ఇశ్రాయేలీయులు ముందెన్నడూ లేనంత సమాధానాన్ని చవిచూశారు. ఆ సంవత్సరాల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజు. 4:25) సొలొమోనుకు అంత జ్ఞానమున్నా తన ప్రజలను అనారోగ్యం నుండి, పాపమరణాల బంధకాల నుండి విడిపించలేకపోయాడు. అయితే, గొప్ప సొలొమోను తన ప్రజలను వాటన్నిటి నుండి విడిపిస్తాడు.​—⁠రోమీయులు 8:​19-21 చదవండి.

18 మన కాలంలో కూడా క్రైస్తవ సంఘాల్లో మనం సమాధానకర పరిస్థితులను అనుభవిస్తున్నాం. అవును, మనం నిజమైన ఆధ్యాత్మిక పరదైసును ఆస్వాదిస్తున్నాం. దేవునితో, పొరుగువారితో మనం సమాధానాన్ని కలిగివున్నాం. మనం ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితుల గురించి యెషయా ఏమి ప్రవచించాడో గమనించండి: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెష. 2:​3, 4) దేవుని పరిశుద్ధాత్మకు అనుగుణంగా ప్రవర్తిస్తే మనం ఆధ్యాత్మిక పరదైసుకు వన్నెతెస్తాం.

19 అయితే, భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుంది. యేసు పరిపాలనలో విధేయులైన మానవులు మునుపెన్నడూ లేనంత సమాధానాన్ని ఆస్వాదిస్తారు. వారు పరిపూర్ణతకు చేరేంతవరకు ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి’ క్రమంగా ‘విడిపించబడతారు.’ (రోమా. 8:​20, 21) వెయ్యేండ్ల పరిపాలనాంతంలో జరిగే అంతిమ పరీక్షలో నెగ్గిన తర్వాత, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్త. 37:11; ప్రక. 20:​7-10) నిజంగానే, మన ఊహకందని రీతిలో క్రీస్తుయేసు పరిపాలన సొలొమోను పరిపాలనకన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది!

20 మోషే, దావీదు, సొలొమోను నాయకత్వంలో ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు. అయితే, క్రీస్తు పరిపాలనలో మనం వారికన్నా మరింత సంతోషంగా ఉంటాం. (1 రాజు. 8:66) గొప్ప మోషే, గొప్ప దావీదు, గొప్ప సొలొమోను అయిన తన అద్వితీయ కూమారుణ్ణి మన కోసం పంపించినందుకు మన కృతజ్ఞతలన్నీ యెహోవాకు చెల్లిద్దాం!

[అధస్సూచి]

^ పేరా 7 దావీదు అనే మాటకు “ప్రియుడు” అనే అర్థముంది. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఆ తర్వాత రూపాంతరం చెందినప్పుడు యెహోవా పరలోకం నుండి మాట్లాడుతూ యేసును “నా ప్రియ కుమారుడు” అని పిలిచాడు.​—⁠మత్త. 3:17; 17:⁠5.

^ పేరా 11 అదే సమయంలో, కాపరి మీద నమ్మకముంచే గొర్రెలా దావీదు తయారయ్యాడు. ఆయన మహాగొప్ప కాపరి అయిన యెహోవా కాపుదలను, నిర్దేశాన్ని కోరాడు. ఆయన పూర్తి నమ్మకంతో “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అని అన్నాడు. (కీర్త. 23:⁠1) “దేవుని గొఱ్ఱెపిల్ల” అనే పేరు యేసుకు కూడా ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను ఆ విధంగా సంబోధించాడు.​—⁠యోహా. 1:⁠29.

^ పేరా 18 ఆసక్తికరంగా, సొలొమోనుకు యదీద్యా అనే రెండో పేరు ఉంది. ఆ పేరుకు “యెహోవాకు ప్రియుడు” అని అర్థం.​—⁠2 సమూ. 12:​24, 25.

మీరు వివరించగలరా?

• యేసు ఏ విధంగా దావీదుకన్నా గొప్పవాడు?

• యేసు ఏ విధంగా సొలొమోనుకన్నా గొప్పవాడు?

• గొప్ప దావీదూ గొప్ప సొలొమోనూ అయిన యేసును మీరు ఎందుకు గౌరవిస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. దావీదును రాజుగా అభిషేకించమని యెహోవా సమూయేలును నిర్దేశించడం చూసి కొందరు ఎందుకు ఆశ్చర్యపోయుంటారు?

3. (ఎ) ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నప్పుడు యెహోవా దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు? (బి) దావీదును అభిషేకించిన తర్వాత ఏమి జరిగింది?

4, 5. (ఎ) దావీదుకూ యేసుకూ మధ్యవున్న కొన్ని పోలికలు చెప్పండి. (బి) యేసు గొప్ప దావీదని ఎందుకు చెప్పవచ్చు?

6. ఏయే విధాలుగా దావీదు మంచి కాపరి?

7. (ఎ) రాజుగా బాధ్యతలు చేపట్టడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? (బి) యేసు తానొక మంచి కాపరినని ఎలా నిరూపించుకున్నాడు?

8. దావీదు జయిస్తున్న రాజు అని ఎందుకు చెప్పవచ్చు?

9. యేసు దేవుని రాజ్యానికి నియమిత రాజుగా ఎలా జయించాడో వివరించండి.

10, 11. పరలోకంలో యోధుడైన రాజుగా యేసు ఎలాంటి పాత్ర నిర్వర్తిస్తున్నాడు?

12. సొలొమోను దేని కోసం ప్రార్థించాడు?

13. జ్ఞానం విషయంలో తన సమకాలీనులు ఎవరూ సొలొమోనుకు సాటి రాలేదని ఎలా చెప్పవచ్చు? అంత జ్ఞానం ఆయనకు ఎక్కడ నుండి వచ్చింది?

14. యేసు ఏయే విధాలుగా ‘సొలొమోనుకన్నా గొప్పవాడు’?

15. దైవిక జ్ఞానం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

16. యేసుకూ సొలొమోనుకూ మధ్య ఏ పోలికలున్నాయి?

17. (ఎ) సొలొమోను పరిపాలనకున్న ప్రత్యేకత ఏమిటి? (బి) సొలొమోను ఏమి చేయలేకపోయాడు?

18. క్రైస్తవ సంఘంలో మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఆస్వాదిస్తున్నాం?

19, 20. మనం సంతోషించడానికి ఏ కారణాలున్నాయి?

[31వ పేజీలోని చిత్రం]

సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం గొప్ప సొలొమోనుకున్న జ్ఞానానికి ముంగుర్తుగా ఉంది

[32వ పేజీలోని చిత్రం]

మన ఊహకందని రీతిలో యేసు పరిపాలన సొలొమోను, దావీదుల పరిపాలనకన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది!