కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

మన క్రైస్తవ యథార్థతను నిలుపుకోవడం ఎందుకు అంత ప్రాముఖ్యం?

యథార్థతను నిలుపుకుంటే మనం యెహోవాపట్ల ప్రేమతో ఆయన సర్వాధిపత్యానికి లోబడగలుగుతాం, సాతాను అబద్ధికుడని నిరూపించగలుగుతాం. అంతేకాక, మన యథార్థతనుబట్టే దేవుడు మనకు తీర్పుతీరుస్తాడు కాబట్టి అది మన భవిష్యత్తు నిరీక్షణకు ఎంతో అవసరం.​​—⁠12/15, 4-6 పేజీలు.

దేవుని సంకల్పంలో యేసు పాత్రను చూపించే కొన్ని బిరుదులు ఏమిటి?

అద్వితీయ కుమారుడు. వాక్యం. ఆమెన్‌. కొత్తనిబంధనకు మధ్యవర్తి. ప్రధానయాజకుడు. వాగ్దానం చేయబడిన సంతానం.​​—⁠12/15, 15వ పేజీ.

ఏలీయా వర్షం కోసం ప్రార్థిస్తుండగా సముద్రమువైపు చూడమని తన దాసుణ్ణి అడగడం ఎందుకు గమనార్హమైన విషయం? (1 రాజు. 18:​43-45)

ఏలీయాకు నీటి చక్రం గురించి తెలుసని చూపించాడు. సముద్రం మీద ఏర్పడే మబ్బులు దేశంవైపు కదిలివెళ్లి వర్షం కురుస్తుందని ఆయనకు తెలుసు. 4/1, 25-​26 పేజీలు.

మనం పరిచర్యలో మరింత ఆనందం పొందాలంటే ఏమి చేయాలి?

ఇతరులకు ఎంత సహాయం చేయగలమో ఆలోచించడం ద్వారా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకోవచ్చు. బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో మనం ప్రకటించవచ్చు. మన ప్రాంతంలోని ప్రజలు సువార్తపట్ల ఆసక్తి కనబరచకపోతే వారు ఇష్టపడే విషయాలకు అనుగుణంగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు.​​—⁠1/15, 8-​10 పేజీలు.

బైబిలు బోధలను తెలుసుకున్న తర్వాత ఒక క్రైస్తవుడు అంత్యక్రియల ఆచారాలను ఎలా పరిగణిస్తాడు? వాటిని ఎలా జరుపుతాడు?

ఒక క్రైస్తవుడు, చనిపోయిన ఆత్మీయుల గురించి విలపించినప్పటికీ మరణించినవారు ఏమీ తెలియని స్థితిలో ఉన్నారని ఆయనకు తెలుసు. అవిశ్వాసులైన బంధువులు విమర్శించినా చనిపోయినవారు బ్రతికున్నవారికి సహాయమైనా హానైనా చేయగలరనే నమ్మకాలకు సంబంధించిన ఆచారాలను ఒక క్రైస్తవుడు ఆచరించడు. అయితే కొంతమంది క్రైస్తవులు సమస్యలు తలెత్తకుండా ఉండేలా ముందుగానే తమ అంత్యక్రియలు ఎలా జరపాలో రాసి పెడతారు.​​—⁠2/15, 29-​31 పేజీలు.

“యాషారు గ్రంథం,” “యెహోవా యుద్ధముల గ్రంథం” అనే గ్రంథాలు కనుమరుగైన బైబిలు పుస్తకాలా? (యెహో. 10:13; సంఖ్యా. 21:⁠14)

కాదు. అవి బైబిలు కాలాల్లో అందుబాటులోవున్న ప్రేరేపితం కాని దస్తావేజులు అయుండొచ్చు. సమాచారం కోసం బైబిలు రచయితలు వాటిని పరిశీలించివుంటారు.​​—⁠3/15, 32వ పేజీ.