కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సాతాను పరలోకం నుండి ఎప్పుడు పడద్రోయబడ్డాడు?—ప్రక. 12:1-9.

సాతాను పరలోకం నుండి పడద్రోయబడిన సమయాన్ని బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథము ఖచ్చితంగా తెలియజేయకపోయినప్పటికీ, అతడు పరలోకం నుండి ఎప్పుడు పడద్రోయబడ్డాడో అంచనా వేయడానికి సహాయం చేసే సంఘటనల గురించి అది తెలియజేస్తోంది. ఆ సంఘటనల్లో మొదటిది, మెస్సీయ రాజ్య స్థాపన. అది జరిగిన తర్వాత ‘పరలోకంలో యుద్ధం జరిగింది,’ అందులో సాతాను గెలవలేకపోయాడు, చివరికతడు పరలోకం నుండి పడద్రోయబడ్డాడు.

“అన్యజనముల కాలములు” ముగిసి రాజ్యం స్థాపించబడిన సంవత్సరం 1914 అని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. * (లూకా 21:24) ఆ తర్వాత ఎంత వెంటనే పరలోకంలో యుద్ధం జరిగి, సాతాను పడద్రోయబడ్డాడు?

“కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయవలెనని ఆ ఘటసర్పము [సాతాను] స్త్రీ యెదుట నిలుచుండెను” అని ప్రకటన 12:4 చెబుతోంది. కొత్తగా స్థాపించబడిన రాజ్యాన్ని వెంటనే, సాధ్యమైతే అది స్థాపించబడగానే దాన్ని నాశనం చేయాలని సాతాను కోరుకున్నాడని ఆ లేఖనం చూపిస్తోంది. అయితే యెహోవా జోక్యం చేసుకోవడంతో సాతాను దుష్ట తలంపు నెరవేరకపోయినప్పటికీ కొత్తగా స్థాపించబడిన రాజ్యానికి హాని చేయాలని సాతాను దృఢంగా నిశ్చయించుకొని తీవ్రంగా కృషిచేశాడు. అందుకే రాజ్యానికి ఏ హానీ జరగకుండా “ఘటసర్పమును దాని దూతలను” పరలోకం నుండి పడద్రోయడంలో ‘మిఖాయేలు, అతని దూతలు’ ఏ మాత్రం సమయం వ్యర్థం చేసివుండరని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాతాను ఓడించబడి, పరలోకం నుండి పడద్రోయబడడం 1914లో రాజ్యం స్థాపించబడిన వెంటనే జరిగివుండవచ్చని చెప్పడం సహేతుకమైనదే.

పరిశీలించవలసిన మరో అంశం అభిషిక్త క్రైస్తవుల పునరుత్థానం, లేఖన సాక్ష్యాధారం సూచిస్తున్నట్లుగా, ఆ పునరుత్థానం రాజ్యం స్థాపించబడిన వెంటనే ప్రారంభమైంది. * (ప్రక. 20:6) యేసు ఘట సర్పముతోను, దాని దూతలతోను యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన అభిషిక్త సహోదరులు ఆయనతో పాటు ఉన్నట్లుగా చెప్పబడడం లేదు కాబట్టి క్రీస్తు సహోదరుల పునరుత్థానం ప్రారంభమయ్యే సమయానికి పరలోకంలో యుద్ధం జరగడం, సాతాను అతని దయ్యాలు పడద్రోయబడడం ముగిసిపోయి ఉండవచ్చు.

కాబట్టి సాతాను, అతని దయ్యాలు పరలోకం నుండి పడద్రోయబడిన సమయాన్ని బైబిలు ఖచ్చితంగా తెలియజేయడం లేదు. అయినప్పటికీ ఈ సంఘటన 1914లో పరలోకంలో యేసుక్రీస్తు సింహాసనాసీనుడైన వెంటనే జరిగిందని స్పష్టమౌతోంది.

[అధస్సూచీలు]

^ పేరా 4 బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 215-218 పేజీలు చూడండి.