కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కలిసికట్టుగా పనిచేస్తే ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు

కలిసికట్టుగా పనిచేస్తే ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు

కలిసికట్టుగా పనిచేస్తే ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు

యెహోవాను ప్రేమించి ఆయనను ఆరాధించే విధంగా ఒక కుటుంబం తయారవ్వాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయడం చాలా అవసరం. యెహోవా మొదటి దంపతులను సృష్టించినప్పుడు కలిసికట్టుగా పనిచేయడం ఎంత అవసరమో చూపించాడు. “సాటియైన సహకారిణిగా” హవ్వ ఆదాముతో కలిసి పనిచేయాలి. (ఆది. 2:18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) భార్యాభర్తలు భాగస్వాములుగా పనిచేస్తూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండాలి. (ప్రసం. 4:9-12) తల్లిదండ్రులూ, పిల్లలూ దేవుడు తమకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించాలంటే కూడా ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతైనా అవసరం.

కుటుంబ ఆరాధన

బెరీ, హైడీ దంపతులకు ఐదుగురు పిల్లలు. కుటుంబమంతా కలిసి క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తేనే ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తామని వారు గ్రహించారు. బెరీ ఇలా చెబుతున్నాడు: “కుటుంబ అధ్యయనంలో మా పిల్లలు భాగం వహించేలా అప్పుడప్పుడూ చిన్నచిన్న నియామకాలను ఇస్తుంటాను. తేజరిల్లు!లోని ఒక అర్టికల్‌ను చదివి, వాటిలోని విషయాలను కుటుంబానికి వివరించమని చెప్పేవాణ్ణి. ప్రకటనా పనిలో ఏమి మాట్లాడాలో ముందుగా పిల్లలతో ప్రాక్టీసు చేయించేవాళ్లం.” హైడీ కూడా ఇలా చెబుతోంది: “మాలో ప్రతీ ఒక్కరం కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకున్నాం. అయితే వాటిని ఎంతవరకూ సాధించాము అనే దాని గురించి తరచూ కుటుంబ అధ్యయనంలో చర్చించుకుంటాం.” వారంలో కొన్ని రోజులు టీవీ చూడకుండా ఉండడంవల్ల కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి చదవడానికి సమయం దొరుకుతుందని వారు చెబుతున్నారు.

సంఘ కూటాలు

మైక్‌, డానిజ్‌ దంపతులకు నలుగురు పిల్లలు. కలిసికట్టుగా పనిచేయడంవల్ల వీరు ఎలా ప్రయోజనం పొందారు? మైక్‌ ఇలా చెబుతున్నాడు: “కూటాలకు సమయానికి వెళ్లేలా మంచి ప్రణాళిక వేసుకున్నా కొన్నిసార్లు సమయానికి వెళ్లలేకపోయేవాళ్లం. కానీ ఒకరికొకరం సహాయం చేసుకున్నప్పుడే సమయానికి వెళ్లగలిగామని తెలుసుకున్నాం.” డానిజ్‌ ఇలా చెబుతోంది: “పిల్లలు ఎదిగేకొద్దీ ప్రతీ ఒక్కరికి చిన్నచిన్న పనులు అప్పగించేవాళ్లం. మా అమ్మాయి కిమ్‌ వంటింట్లో నాకు సహాయం చేసి, భోజనానికీ కావాల్సినవి సర్దిపెట్టేది.” వాళ్ల అబ్బాయి మైఖెల్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “మంగళవారం సాయంత్రాలు మా ఇంట్లో సంఘ కూటం జరిగేది కాబట్టి మేము గదిని ఊడ్చి, శుభ్రం చేసి కుర్చీలను సర్దిపెట్టేవాళ్లం.” వాళ్ల మరో అబ్బాయి మ్యాథ్యూ ఇలా చెబుతున్నాడు, “కూటాలు జరిగే రోజుల్లో మా నాన్నగారు త్వరగా ఇంటికి వచ్చి సిద్ధపడడంలో మాకు సహాయం చేసేవారు.” దానివల్ల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందారు?

కృషి వృథాకాదు

మైక్‌ ఇలా చెబుతున్నాడు: “1987లో డానిజ్‌, నేనూ పయినీరు సేవను మొదలుపెట్టాం. ఆ సమయంలో, మా ముగ్గురు అబ్బాయిలు మాతోనే ఉన్నారు. వారిలో ఇద్దరు మాలాగే పయినీరు సేవ మొదలుపెట్టారు. మిగిలిన మా పాప, బాబు బెతెల్‌ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే, యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేలా మేము 40 మందికి సహాయం చేయగలిగాం. వేరే దేశాలకు కూడా వెళ్లి నిర్మాణ పనుల్లో పాల్గొనే అవకాశం మా కుటుంబానికి లభించింది.”

కుటుంబంగా కలిసి పనిచేయడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు ఇంకా ఎలా సహకరించుకోవచ్చో ఆలోచించండి? కలిసికట్టుగా పనిచేయడంవల్ల మీ కుటుంబం మరింత ఆధ్యాత్మిక ప్రగతిని తప్పకుండా సాధిస్తుంది.

[28వ పేజీలోని చిత్రం]

ముందుగా సిద్ధపడితే ప్రకటనా పనిలో ప్రగతి సాధించవచ్చు