కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యపు విత్తనాలు మారుమూల ప్రాంతాలకు చేరుకున్నాయి

సత్యపు విత్తనాలు మారుమూల ప్రాంతాలకు చేరుకున్నాయి

సత్యపు విత్తనాలు మారుమూల ప్రాంతాలకు చేరుకున్నాయి

రష్యాలోని టూవా రిపబ్లిక్‌, సైబీరియాకు పూర్తి దక్షిణానవుంది. దానికి తూర్పున, దక్షిణాన మంగోలియా దేశం ఉంది. టూవాలో చాలామంది ప్రజలు మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నారు కాబట్టి వారికి రాజ్య సందేశం అందడం కష్టం. అయితే, కొంతకాలం క్రితం టూవా రాజధాని కైజల్‌లో జరిగే సెమినార్‌కు హాజరుకావడానికి అనేక మారుమూల ప్రాంతాల నుండి కొంతమంది వచ్చారు. కైజల్‌లో మారియా అనే పయినీరు సహోదరి ఉంది. టూవా మారుమూల ప్రాంతాల నుండి కొంతమంది వచ్చారని తెలుసుకుని వారికి ప్రకటించే అరుదైన అవకాశం తనకు దొరికిందని అనుకుంది.

మారియా ఇలా చెబుతోంది: “నేను టీచరుగా పనిచేసే పాఠశాల ఒక సెమినార్‌ను నిర్వహించింది. దానిలో తాగుడుకూ, మాదకద్రవ్యాలకూ బానిసలైన వారికి చేసే చికిత్స మీద చర్చ జరిగింది. టూవాలోని మారుమూల ప్రాంతాల నుండి 50 మంది హాజరయ్యారు. వారిలో ఉపాధ్యాయులు, మానసిక శాస్త్రజ్ఞులు, శిశు సంక్షేమ అధికారులు, మరితరులు ఉన్నారు.” ఈ సెమినార్‌లో ప్రకటించే మంచి అవకాశం మారియాకు లభించినా, వారికి ప్రకటించడం అంత సులభమేమీ కాదు. దానికి కారణం ఆమె ఇలా చెబుతోంది: “స్వతహాగా నేను బిడియస్థురాలిని. ఇంటింటి పరిచర్యలో తప్ప వేరే ఎక్కడైనా ప్రకటించడం నాకు కష్టంగా ఉంటుంది. నాకు దొరికిన ఈ అవకాశాన్ని భయపడకుండా సద్వినియోగం చేసుకునే ధైర్యం ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాను.” అయితే, ఆమె వారికి సాక్ష్యం ఇవ్వగలిగిందా?

మారియా ఇంకా ఇలా అంటోంది: “‘మానసిక శాస్త్రజ్ఞులకు నచ్చుతుంది అనుకొన్న’ తేజరిల్లు! పత్రికను పాఠశాలకు తీసుకెళ్లాను. అందులో రకరకాల ఫోబియాల (రకరకాల భయాల) గురించి వివరించారు. సెమినార్‌కు హాజరైన ఒక టీచరు ఆ రోజు నా ఆఫీసుకు వచ్చింది. నేను ఆమెకు ఆ పత్రిక ఇస్తే ఆమె సంతోషంగా తీసుకుంది. ఆమె తనకూ ఒక ఫోబియా ఉందని చెప్పింది. ఆ తర్వాతి రోజు యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకం మొదటి సంపుటిని ఆమె కోసం తీసుకువెళ్లాను. దాన్ని కూడా ఆమె సంతోషంగా తీసుకుంది. ఆమె ఆ పత్రికను తీసుకోవడానికి ఎంతో ఇష్టపడింది కాబట్టి మిగతా టీచర్లు కూడా ఇష్టపడవచ్చని అనుకున్నాను. నేను యువత అడిగే ప్రశ్నలు అనే పుస్తకాలనూ ఇతర ప్రచురణలనూ ఒక అట్టపెట్టెలో పెట్టి పాఠశాలకు తీసుకెళ్లాను.” కొద్ది సేపట్లోనే అట్టపెట్టె అంతా ఖాళీ అయిపోయింది. మారియా ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను ఎవరికైతే యువత అడిగే ప్రశ్నలు పుస్తకాన్ని ఇచ్చానో ఆ టీచరుతో పనిచేసేవారు వచ్చి ‘ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతున్నాయి?’ అని అడిగారు.” వారు రావాల్సిన చోటుకే వచ్చారు!

ఆ రోజు శనివారం, సెమినార్‌ చివరి రోజు. మారియాకు ఆ రోజు సెలవు కాబట్టి తన ఆఫీసులో ఉన్న చాలా బల్లలమీద సాహిత్యాలను ఉంచి, “ప్రియమైన టీచర్లకు, మీరు ఈ సాహిత్యాలను మీ కోసం మీ స్నేహితుల కోసం తీసుకెళ్లవచ్చు. మీరు మీ పనిలో రాణించేందుకు, మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు ఈ చక్కని సాహిత్యాలు సహాయపడతాయి” అని బోర్డు మీద రాసింది. ఆ తర్వాత ఏమైంది? “నేను ఆ రోజు ఆఫీసుకు వెళ్లి చూస్తే బల్లలమీద కొన్ని సాహిత్యాలు మాత్రమే మిగిలాయి. నేను వెంటనే మరికొన్ని పుస్తకాలనూ పత్రికలనూ తీసుకొచ్చాను.” సెమినార్‌ ముగిసేసరికి మారియా 380 పత్రికలను, 173 పుస్తకాలను, 34 బ్రోషూర్‌లను ఇవ్వగలిగింది. సెమినార్‌కు హాజరైన వారు మారుమూల ప్రాంతంలోవున్న తమ ఇళ్లకూ పనిచేసే స్థలాలకూ తిరిగి వెళ్లినప్పుడు తమతో పాటు ఈ సాహిత్యాలను కూడా తీసుకెళ్ళారు. “సత్యపు విత్తనాలు టూవాలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను!” అని మారియా చెబుతోంది.—ప్రసం. 11:6.

[32వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రష్యా

టూవా రిపబ్లిక్‌