కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

క్రైస్తవ కూటాల్లో, సమావేశాల్లో బైబిలు ప్రసంగాలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్నప్పుడు సహోదరీలు ముసుగు వేసుకోవాలా?

సాధారణంగా, ఒక క్రైస్తవ స్త్రీ సంఘంలో తన భర్త లేక ఒక సహోదరుడు నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలి. ఇది అపొస్తలుడైన పౌలు చెప్పిన సూత్రానికి అనుగుణంగా ఉంది. ఆయన ఇలా రాశాడు: “ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును” ఎందుకంటే, “స్త్రీకి శిరస్సు పురుషుడు.” (1 కొరిం. 11:3-10) అలాంటి సందర్భాల్లో ఒక సహోదరి నిరాడంబరంగా, తగిన రీతిలో ముసుగు వేసుకున్నప్పుడు ఆమె క్రైస్తవ సంఘంలోని దైవిక ఏర్పాటుకు లోబడివుందని చూపిస్తుంది.—1 తిమో. 2:11, 12. *

ఒక సహోదరుడు ఇస్తున్న ప్రసంగాన్ని ఒక సహోదరి సంజ్ఞా బాషలోకి అనువదిస్తుంటే అప్పుడేమిటి? నిజమే, ఆ సహోదరి ప్రసంగీకుడు చెబుతున్నదాన్నే ప్రేక్షకులకు వివరిస్తుంది. అంటే ఆమె ఆ సహోదరుడు చెబుతున్నదాన్నే వివరిస్తుంది గానీ తాను సొంతగా ఏమీ బోధించడం లేదు. అయితే, సంజ్ఞా భాషలోకి అనువదించడానికి, మాట్లాడుకోగల ఒక భాష నుండి మరో భాషలోకి అనువదించడానికి చాలా తేడావుంది. మాట్లాడుకోగల భాషల్లో ప్రేక్షకులు ప్రసంగీకుణ్ణి చూస్తూనే అనువదించేవారు చెప్పేది వినగలరు. అలాగే సాధారణంగా మాట్లాడుకోగల భాషలోకి అనువదించే సహోదరీలు, సంజ్ఞా భాషలోకి అనువదించే సహోదరీల్లా ప్రసంగీకునికన్నా ప్రముఖంగా కనిపించే స్థానంలో ఉండరు. కొన్నిసార్లు, వారు కూర్చొని కూడా అనువదిస్తారు. ఒకవేళ ఆమె నిలబడి అనువదిస్తుంటే ప్రేక్షకులవైపు కాకుండా ప్రసంగీకుని వైపు చూస్తూ అనువదిస్తుంది. కాబట్టి, మాట్లాడుకోగల భాషలోకి అనువదించే సహోదరి ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులను బట్టి చూస్తే, ప్రసంగాలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్నప్పుడు, అనువదించే వ్యక్తి పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తినే పెద్ద తెరమీద ప్రముఖంగా చూపిస్తారు గానీ ప్రసంగీకుణ్ణి కాదు, కొన్నిసందర్భాల్లో ప్రసంగీకుడు ప్రేక్షకులందరికీ కనిపించకపోవచ్చు. అందువల్ల సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్న సహోదరి అనువాదకురాలిగానే తన పాత్రను నిర్వహిస్తోందనడానికి సూచనగా ముసుగు వేసుకోవాలి.

దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలోని భాగాలను, ప్రదర్శనలను, సంఘ బైబిలు అధ్యయనంలో, సేవా కూటంలో, కావలికోట పఠనంలో ఇచ్చే వ్యాఖ్యానాలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్నప్పుడు ఈ కొత్త నిర్దేశాన్ని ఎలా అనుసరించాలి? ఇలాంటి సందర్భాల్లో సంజ్ఞా భాషలోకి అనువదించే సహోదరి కూడా ముసుగు వేసుకోవాలా? ఆమె ఆ కూటాన్ని నిర్వహించడంలేదని హాజరైనవారందరికీ ఇట్టే అర్థమౌతుంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ప్రేక్షకులు ఇచ్చే వ్యాఖ్యానాలను, సహోదరీలు ఇచ్చే ప్రసంగాలను లేదా ప్రదర్శనలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్నప్పడు ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, సంఘ కూటాల్లో సహోదరుల ప్రసంగాలను, కావలికోట పఠన నిర్వాహకుని లేదా బైబిలు అధ్యయన నిర్వాహకుని వ్యాఖ్యానాలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తున్నప్పుడు లేక పాటలు పాడడంలో సారథ్యం వహిస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలి. కూటం జరిగే సమయంలో సహోదరులు, సహోదరీలు, పిల్లలు, సంఘ పెద్దలు చెప్పేది ఒక సహోదరి సంజ్ఞా భాషలోకి అనువదించాల్సి ఉండవచ్చు. అలాంటప్పుడు కూటం జరిగేంతసేపు ఆమె ముసుగు వేసుకుని ఉండడమే మంచిది.

[అధస్సూచి]

^ పేరా 3 క్రైస్తవ స్త్రీలు ఏయే సందర్భాల్లో ముసుగు వేసుకోవాలి అనే దాని గురించి మరిన్ని వివరాల కోసం ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలోని 239-242 పేజీలు చూడండి.