కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెద్ద మనసున్న చిన్న అమ్మాయి

పెద్ద మనసున్న చిన్న అమ్మాయి

పెద్ద మనసున్న చిన్న అమ్మాయి

బ్రెజిల్‌లో ఉంటున్న ఓ తొమ్మిదేళ్ల అమ్మాయి ఇటీవలే తాను దాచుకున్న డబ్బును 18 డాలర్లుగా (864 రూపాయలుగా), 25 డాలర్లుగా (1,200 రూపాయలుగా) రెండు భాగాలు చేసింది. సంఘ ఖర్చుల కోసం దానిలో చిన్న మొత్తాన్ని, అంటే 864 రూపాయలను స్థానిక రాజ్య మందిరంలోని చందా పెట్టెలో వేసింది. పెద్ద మొత్తాన్ని అంటే 1,200 రూపాయలను యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపించింది. ఆ డబ్బుతోపాటు ఓ చిన్న ఉత్తరాన్ని కూడా జత చేసింది. ఆ ఉత్తరంలో ఆ అమ్మాయి ఇలా రాసింది: “నేను ఈ డబ్బును ప్రపంచవ్యాప్త పనికోసం పంపిస్తున్నాను. సువార్త ప్రకటించడానికి, ప్రపంచవ్యాప్తంగావున్న చాలామంది సహోదర సహోదరీలకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. యెహోవా అంటే నాకెంతో ప్రేమ, అందుకే నేను దీనిని మీకు పంపిస్తున్నాను.”

రాజ్య ప్రకటనా పనిలో వ్యక్తిగతంగా తాను చేయగలిగినదంతా చేయడం ఎంత ప్రాముఖ్యమో ఆ అమ్మాయివాళ్ల అమ్మానాన్నలు ఆమెకు నేర్పించారు. తన ‘ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచాలని’ కూడా వారు ఆ అమ్మాయికి వివరించారు. (సామె. 3:9) ఆ చిన్న అమ్మాయిలాగే మనలో ప్రతీ ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మన పనికి ఉత్సాహంగా మనవంతు మద్దతునిద్దాం!