కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు యేసు ఆయనను కాపాడాడు. ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (మత్త. 14:28-31)

మన సహోదరుడు/సహోదరి విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు మనం గమనిస్తే మరింత విశ్వాసాన్ని పెంపొందించుకునేలా ఆయనకు/ఆమెకు మనం చేయందించవచ్చు.—9/15, 8వ పేజీ.

• మనల్ని విమోచించడానికి యెహోవా ఏ త్యాగం చేశాడు?

తన కుమారుడు యాతనపెట్టబడినా, హేళనచేయబడినా యెహోవా వాటిని సహించాడు. అబ్రాహాము వేదనను అనుభవించాల్సి వచ్చినా తన కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడు. అలాగే యెహోవా వేదనను అనుభవించాల్సి వచ్చినా తన కుమారుడు అపరాధిగా చంపబడేందుకు అనుమతించాడు.—9/15, 28-29 పేజీలు.

• ‘ఇల్లు కట్టుకునే’ విషయంలో సామెతలు 24:27 నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి దానితోపాటు వచ్చే బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడాలి. అంటే, కుటుంబాన్ని పోషించడానికి, ఆధ్యాత్మిక విషయాల్లో కుటుంబానికి నాయకత్వం వహించడానికి ఆయన సిద్ధపడాలి.—10/15, 12వ పేజీ.

• మర్యాద చూపించే విషయంలో యెహోవా, యేసు ఎలా మంచి మాదిరి ఉంచారు?

యెహోవా విశ్వ సర్వాధిపతి అయినప్పటికీ మానవులతో చాలా దయగా, మర్యాదగా వ్యవహరిస్తాడు. అబ్రాహాముకు, మోషేకు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు దయచేసి చేయండి అని అర్థమిచ్చే హెబ్రీ పదాన్ని ఉపయోగించాడు. (ఆది. 13:14; నిర్గ. 4:6) దేవుడు మానవులు మాట్లాడుతున్నప్పుడు కూడా వింటాడు. (ఆది. 18:23-32) యేసు కూడా తోటి మానవులతో మర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తన చుట్టూవున్న వారికి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండేవాడు. వారిని తరచూ పేరుపెట్టి మరీ పిలిచేవాడు.—11/15, 25వ పేజీ.