కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• మెస్సీయ ఎందుకు మరణించాల్సి వచ్చింది?

ఒక పరిపూర్ణ మానవుడు తీవ్ర పరీక్షలు ఎదురైనా తన దైవభక్తిని కాపాడుకోగలడని యేసు తన మరణం ద్వారా నిరూపించాడు. అంతేకాక, ఆయన ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపానికి పరిహారం చెల్లించి నిత్యజీవం పొందే అవకాశాన్ని కూడా కల్పించాడు.—12/15, 22-23 పేజీలు.

• పిల్లలు మనసువిప్పి మాట్లాడాలంటే ఏమి చేయాలి?

కేవలం వారితో మాట్లాడడమే కాదు, వారిని ప్రశ్నలు అడుగుతూ వారు చెబుతున్న విషయాలను ఓపిగ్గా వినాలి. భోజనం చేస్తున్నప్పుడు అలా మాట్లాడుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందని చాలామంది గుర్తించారు.—1/15, 18-19 పేజీలు.

• ఏ పరిస్థితిలో మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు?

బాప్తిస్మం తీసుకునే సమయానికి ఓ వ్యక్తి రహస్యంగా తప్పుచేస్తూ లేక లేఖన విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఆయన ఒకవేళ అప్పటికే యుక్తరీతిలో బాప్తిస్మం తీసుకొని ఉంటే అతను ఆ తప్పును బట్టి లేదా ప్రవర్తనను బట్టి బహిష్కరించబడి ఉండేవాడు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ బాప్తిస్మం తీసుకోవచ్చు.—2/15, 22వ పేజీ.

• యేసు చెప్పిన గోధుమలు గురుగుల ఉపమానంలో మంచి విత్తనాన్ని విత్తడం లేక నాటడం దేన్ని సూచిస్తుంది?

మనుష్యకుమారుడైన యేసు తన భూపరిచర్యలో పొలాన్ని సిద్ధం చేశాడు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవులు దేవుని రాజ్య కుమారులుగా అభిషేకించబడినప్పటి నుండి మంచి విత్తనం విత్తబడింది.—3/15, 20వ పేజీ.

• యేసు ఉపమానంలోని సూచనార్థక గోధుమలు యెహోవా కొట్టులోకి ఎలా తీసుకురాబడ్డారు? (మత్త. 13:30)

ఈ యుగసమాప్తి కాలంలో ఆ ఉపమాన నెరవేర్పు కొంతకాలం కొనసాగింది. గోధుమల్ని సూచిస్తున్న రాజ్యకుమారుల్లో చనిపోయినవారు ఇప్పటికే పరలోక బహుమానాన్ని పొందారు. ఇంకా భూమ్మీద జీవిస్తున్నవారు వ్యవస్థీకరించబడిన క్రైస్తవ సంఘంలో భాగంగా ఉన్నారు.—3/15, 22వ పేజీ.

• బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికను ఎవరు నిర్ణయించారు?

ఏదో ఒక చర్చి కౌన్సిల్‌ లేదా ఓ మతనాయకుడు దాన్ని నిర్ణయించలేదు కానీ, నిజక్రైస్తవులు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో ఏ పుస్తకాలు నిజంగా దైవ ప్రేరేపితమైనవో గుర్తించారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ‘నానావిధాలైన కృపావరాలు’ అనుగ్రహించబడ్డాయి. ఆ వరాల సహాయంతో వారు ఏవి దైవ ప్రేరేపితమైనవో గుర్తించారు. (1 కొరిం. 12:4)—4/1, 28వ పేజీ.