కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?

యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?

యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?

“నా నోటనుండి వచ్చు వచనము . . . నేను పంపిన కార్యమును సఫలముచేయును.” —యెష. 55:10, 11.

1. ప్రణాళికకు, సంకల్పానికి మధ్యవున్న తేడాను ఉదాహరణతో వివరించండి.

 కారులో ఓ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఊహించుకోండి. ఓ వ్యక్తి ఒకానొక గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఫలాని దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరో వ్యక్తికి గమ్యస్థానం స్పష్టంగా తెలుసు, అది చేరుకునేందుకు ఉన్న వివిధ దారులు కూడా తెలుసు. అవసరమైతే ఏ దారిలో వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. చెప్పాలంటే, ఆ ఇద్దరు వ్యక్తులు అనుసరించిన పద్ధతులు ప్రణాళికకు, సంకల్పానికి మధ్యవున్న తేడాను చూపిస్తున్నాయి. ఫలాని దారికి సంబంధించిన అన్ని వివరాలను సిద్ధంచేసుకోవడాన్ని ప్రణాళిక అనవచ్చు. ఓ నిర్దిష్టమైన దారిని ఎంచుకోకపోయినా లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని ఏ దారిలోనైనా ముందుకెళ్లడమే సంకల్పం.

2, 3. (ఎ) యెహోవా సంకల్పమేమిటి? ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు పరిస్థితిని ఎలా చక్కదిద్దాడు? (బి) యెహోవా తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో తెలుసుకొని, మనం దానికి అనుగుణంగా ఎందుకు నడుచుకోవాలి?

2 అలాగే, తన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో యెహోవాకు ఓ నిర్దిష్ట ప్రణాళికలేదు, కానీ కాలం గడిచేకొద్దీ నెరవేరే ఓ సంకల్పముంది. (ఎఫె. 3:8-11) అది మానవులకు, భూమికి సంబంధించినది. భూమిని పరదైసుగా మార్చి, అందులో పరిపూర్ణ మానవులు సుఖశాంతులతో నిరంతరం జీవించాలన్నదే ఆయన మొదటి సంకల్పం. (ఆది. 1:28) ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు యెహోవా వెంటనే స్పందించి తన సంకల్పం నెరవేరేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. (ఆదికాండము 3:15 చదవండి.) తన సూచనార్థక స్త్రీకి చెందిన ‘సంతానం’ లేదా కుమారుడు మానవులు పాపం చేసేలా ప్రలోభపెట్టిన సాతానును చివరకు నాశనం చేసి, అతడు చేసిన హానినంతా తీసివేస్తాడని యెహోవా నిర్ణయించాడు.—హెబ్రీ. 2:14; 1 యోహా. 3:8.

3 దేవుడు తన సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఈ విషయంలో పరలోకంలోవున్న లేదా భూమ్మీదున్న ఏ శక్తి ఆయనను ఆపలేదు. (యెష. 46:9-11) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే దాని వెనుక పరిశుద్ధాత్మ శక్తివుంది. ఎదురులేని ఆ శక్తి దేవుని సంకల్పం తప్పక ‘సఫలమయ్యేలా’ చేస్తుంది. (యెష. 55:10, 11) అందుకే, మనం దేవుడు తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో తెలుసుకొని, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆ సంకల్పం నెరవేరడంపైనే మన భవిష్యత్తు ఆధారపడివుంది. అంతేకాక, యెహోవా పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తాడో చూసినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. కాబట్టి, ఆయన తన సంకల్పం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను గతంలో ఎలా ఉపయోగించాడో, ఇప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాడో, భవిష్యత్తులో ఎలా ఉపయోగిస్తాడో చూద్దాం.

యెహోవా గతంలో పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించాడు?

4. యెహోవా తన సంకల్పాన్ని ఎలా క్రమక్రమంగా తెలియజేస్తూ వచ్చాడు?

4 ప్రాచీన కాలాల్లో యెహోవా క్రమక్రమంగా తన సంకల్పాన్ని తెలియజేస్తూ వచ్చాడు. వాగ్దానం చేయబడిన సంతానం ఎవరనేది మొదట్లో పరిశుద్ధ ‘మర్మంగా’ ఉండేది. (1 కొరిం. 2:7) దాదాపు రెండువేల సంవత్సరాల తర్వాతే యెహోవా ఆ సంతానం గురించి మళ్లీ మాట్లాడాడు. (ఆదికాండము 12:7; 22:15-18 చదవండి.) యెహోవా అబ్రాహాముకు గొప్ప నెరవేర్పు ఉన్న ఓ వాగ్దానం చేశాడు. “నీ సంతానమువలన” అనే మాటనుబట్టి, వాగ్దానం చేయబడిన సంతానం ఓ మానవునిగా అబ్రాహాము కుటుంబం నుండి వస్తాడని స్పష్టమైంది. సంతానం గురించి అబ్రాహాముకు వివరిస్తున్నప్పుడు సాతాను ఎంతో ఆసక్తిగా వినుంటాడు. అబ్రాహాము వంశాన్ని నాశనం చేసి లేదా దాన్ని భ్రష్టుపట్టించి దేవుని సంకల్పం నెరవేరకుండా చేయాలని ఆ శత్రువు ఎంతగానో కోరుకొనివుంటాడు. అదృశ్యమైన దేవుని పరిశుద్ధాత్మ పనిచేసింది కాబట్టి అలా జరిగే అవకాశమే లేదు. ఇంతకీ ఆ శక్తి ఎలా పనిచేసింది?

5, 6. సంతానం జన్మించే వంశంలో వివిధ వ్యక్తులను కాపాడడానికి యెహోవా తన ఆత్మను ఎలా ఉపయోగించాడు?

5 సంతానం జన్మించే వంశంలో వివిధ వ్యక్తులను కాపాడడానికి యెహోవా తన ఆత్మను ఉపయోగించాడు. “నేను నీకు కేడెము” అని యెహోవా అబ్రాముతో (అబ్రాహాముతో) అన్నాడు. (ఆది. 15:1) అవి వట్టి మాటలు కావు. ఉదాహరణకు, దాదాపు సా.శ.పూ. 1919లో అబ్రాహాము, శారాలు కొంతకాలం గెరారులో ఉన్నప్పుడు ఏమి జరిగిందో చూడండి. శారా అబ్రాహాము భార్య అని తెలియక గెరారు రాజైన అబీమెలెకు ఆమెను తన భార్యగా చేసుకోవడానికి శారాను తీసుకువెళ్లాడు. అబ్రాహాము శారాల ద్వారా సంతానం రాకుండా చేయాలని సాతాను వెనకవుండి కుట్ర పన్నాడా? దాని గురించి బైబిలు ఏమీ చెప్పడంలేదు కానీ యెహోవా జోక్యం చేసుకున్నాడని మాత్రం చెబుతోంది. శారాను ముట్టవద్దని దేవుడు ఓ కలలో అబీమెలెకును హెచ్చరించాడు.—ఆది. 20:1-18.

6 ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. యెహోవా అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని చాలా సందర్భాల్లో కాపాడాడు. (ఆది. 12:14-20; 14:13-20; 26:26-29) అందుకే అబ్రాహాము గురించి, ఆయన వంశీయుల గురించి కీర్తనకర్త ఇలా చెప్పగలిగాడు: “నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన [యెహోవా] ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.”—కీర్త. 105:14, 15.

7. యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏయే విధాలుగా కాపాడాడు?

7 వాగ్దానం చేయబడిన సంతానం ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం నుండి వస్తాడు కాబట్టి యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ జనాంగాన్ని కాపాడాడు. యెహోవా ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం సత్యారాధన కొనసాగేందుకు దోహదపడింది, యూదుల్ని ఆధ్యాత్మిక, నైతిక, శారీరక కల్మషం నుండి కాపాడింది. (నిర్గ. 31:18; 2 కొరిం. 3:3) న్యాయాధిపతుల కాలంలో, ఇశ్రాయేలీయులను తమ శత్రువుల నుండి విడిపించేందుకు యెహోవా ఆత్మ కొంతమంది పురుషులకు శక్తినిచ్చింది. (న్యాయా. 3:9, 10) అబ్రాహాము సంతానంలోని ప్రాథమిక భాగమైన యేసు పుట్టేంతవరకు ఆయనకు సంబంధించిన కొన్ని ప్రవచనాలు నెరవేరే స్థలాలను అంటే యెరూషలేమును, దానిలోని ఆలయాన్ని, బేత్లెహేమును ఆ శక్తే కాపాడివుంటుంది.

8. యేసు జీవితంలో, ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మ ఎంతగానో పనిచేసిందని ఏది చూపిస్తోంది?

8 యేసు జీవితంలో, ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మ ఎంతగానో పనిచేసింది. పరిశుద్ధాత్మ కన్యకయైన మరియమీద కమ్ముకొని అంతకుముందెన్నడూ జరగని, ఆ తర్వాతా ఎప్పుడూ జరగని ఓ కార్యం సాధ్యమయ్యేలా చేసింది. పరిశుద్ధాత్మ శక్తివల్ల మరణం వారసత్వంగా రాని పరిపూర్ణ కుమారుణ్ణి ఓ అపరిపూర్ణ స్త్రీ కన్నది. (లూకా 1:26-31, 34, 35) శిశువుగా ఉన్నప్పుడు యేసు చంపబడకుండా ఆ శక్తే ఆయనను రక్షించింది. (మత్త. 2:6-8, 12, 13) యేసుకు దాదాపు 30 ఏళ్లున్నప్పుడు దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించి, దావీదు సింహాసనానికి వారసునిగా నియమించాడు. అంతేకాదు, ప్రకటించే నియామకాన్ని కూడా ఇచ్చాడు. (లూకా 1:32, 33; 4:16-21) పరిశుద్ధాత్మ శక్తివల్ల యేసు రోగులను స్వస్థపరచడం, ప్రజలకు ఆహారం ఇవ్వడం, చనిపోయినవారిని లేపడం వంటి అద్భుతాలు చేశాడు. అంతటి గొప్ప కార్యాలు చేసి, భవిష్యత్తులో తన రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో రుచిచూపించాడు.

9, 10. (ఎ) మొదటి శతాబ్దపు యేసు శిష్యుల్లో పరిశుద్ధాత్మ పనిచేసిందని ఎలా చెప్పవచ్చు? (బి) మొదటి శతాబ్దంలో యెహోవా సంకల్పం నెరవేరే విధానంలో ఏ మార్పు చోటుచేసుకుంది?

9 సా.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి అబ్రాహాము సంతానంలోని ద్వితీయ భాగమైనవారిని అభిషేకించడానికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. ఇలా అభిషేకించబడినవారిలో చాలామంది అబ్రాహాము వంశీయులుకాదు. (రోమా. 8:15-17; గల. 3:29) మొదటి శతాబ్దపు యేసు శిష్యుల్లో పరిశుద్ధాత్మ పనిచేయడం స్పష్టంగా కనిపించింది. వారు ఆ శక్తివల్ల ఉత్సాహంగా ప్రకటించగలిగారు, గొప్ప కార్యాలు చేయగలిగారు. (అపొ. 1:8; 2:1-4; 1 కొరిం. 12:7-11) వారు అద్భుతమైన ఆత్మవరాలు పొందారనే వాస్తవం, యెహోవా తన సంకల్పాన్ని ఓ కొత్త విధానంలో నెరవేర్చనున్నాడని తెలియజేసింది. అప్పటివరకు యెరూషలేము దేవాలయం ఆరాధనా కేంద్రంగా ఉండేది. ఎన్నో శతాబ్దాల క్రితం యెహోవా ఏర్పరచిన ఆరాధనా పద్ధతిని ఆయన సేవకులు పాటించేవారు. కానీ యెహోవా ఆ ఆరాధనా ఏర్పాటును తీసివేసి కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘంపై తన అనుగ్రహాన్ని చూపించడం ఆరంభించాడు. అప్పటినుండి, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా ఆ అభిషిక్త సంఘాన్ని ఉపయోగిస్తున్నాడు.

10 తన సంకల్పం నెరవేరేలా చేసేందుకు ప్రాచీన కాలాల్లో యెహోవా తన పరిశుద్ధాత్మను అనేక విధాలుగా ఉపయోగించాడు. కొన్నిసార్లు ఆయన దాన్ని తన సేవకులను రక్షించడానికి, వారికి శక్తినివ్వడానికి, అభిషేకించడానికి ఉపయోగించాడు. మరి మన కాలం విషయమేమిటి? తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన ఇప్పుడు తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు? మనం పరిశుద్ధాత్మ నిర్దేశం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం వాటికి జవాబులు తెలుసుకోవాలి. నేడు యెహోవా నాలుగు విధాలుగా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడు. వాటిని మనం ఇప్పుడు చూద్దాం.

యెహోవా నేడు పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?

11. దేవుని ప్రజలు పరిశుభ్రంగా ఉండేందుకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తుందని ఏది చూపిస్తోంది? మీరు పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

11 మొదటిగా, దేవుని ప్రజలు పరిశుభ్రంగా ఉండేందుకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తోంది. యెహోవా చిత్త ప్రకారం నడుచుకొని ఆయన సంకల్పం నుండి ప్రయోజనం పొందేవారు నైతిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండాలి. (1 కొరింథీయులు 6:9-11 చదవండి.) కొంతమంది నిజక్రైస్తవులుగా మారకముందు జారత్వం, వ్యభిచారం, సలింగ సంయోగం వంటి అనైతిక కార్యాలకు పాల్పడ్డారు. పాప కార్యాలకు దారితీసే కోరికలు వారిలో బలంగా పాతుకుపోయి ఉండవచ్చు. (యాకో. 1:14, 15) అయినా అలాంటి వారు ‘కడుగబడ్డారు.’ అంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవితంలో కావాల్సిన మార్పులు చేసుకున్నారు. చెడు కోరికలను తీర్చుకోవాలనే క్షణికావేశాన్ని అధిగమించేందుకు దేవుణ్ణి ప్రేమించేవారికి ఏది సహాయం చేస్తుంది? “మన దేవుని ఆత్మ” సహాయం చేస్తుందని 1 కొరింథీయులు 6:11 చెబుతోంది. నైతిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండడం ద్వారా మీ జీవితంలో దాని నిర్దేశాన్ని పూర్తిగా పాటిస్తున్నారని చూపిస్తారు.

12. (ఎ) యెహెజ్కేలు దర్శనం ప్రకారం, యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు? (బి) ఆత్మ నిర్దేశానికి అనుగుణంగా పనిచేస్తున్నారని మీరెలా చూపించవచ్చు?

12 రెండవదిగా, తాను అనుకున్న దిశలో తన సంస్థను నడిపించడానికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడు. యెహెజ్కేలు దర్శనంలో యెహోవా పరలోక సంస్థ, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి వేగంగా దూసుకువెళ్తున్న పరలోక రథంగా చిత్రీకరించబడింది. ఏ శక్తితో ఆ రథం ఫలాని దిశలో పయనిస్తోంది? పరిశుద్ధాత్మ శక్తితోనే. (యెహె. 1:20, 21) యెహోవా సంస్థలో రెండు భాగాలున్నాయని మరచిపోకండి. ఒకటి పరలోకంలో ఉంది, మరొకటి భూమ్మీద ఉంది. పరలోక భాగాన్ని పరిశుద్ధాత్మ నడిపిస్తోంది కాబట్టి భూమ్మీదున్న భాగాన్ని కూడా ఆ శక్తే నడిపించాలి. యెహోవా భూసంస్థ ఇస్తున్న నిర్దేశానికి విధేయులుగా, నమ్మకంగా ఉండడం ద్వారా యెహోవా పరలోక రథంతోపాటు వెళ్తున్నారని, పరిశుద్ధాత్మకు అనుగుణంగా పనిచేస్తున్నారని మీరు చూపిస్తారు.—హెబ్రీ. 13:17.

13, 14. (ఎ) యేసు చెప్పిన “ఈ తరము” అనే మాట ఎవరిని సూచిస్తోంది? (బి) పరిశుద్ధాత్మ నిర్దేశంతోనే బైబిలు సత్యాలు వెలుగులోకి వస్తున్నాయని చూపించే ఓ ఉదాహరణ చెప్పండి. (“క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్న సత్యాలను మీరు గ్రహిస్తున్నారా?” అనే బాక్సు చూడండి)

13 మూడవదిగా, బైబిలు సత్యాలు వెలుగులోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తోంది. (సామె. 4:18) బైబిలు సత్యాలను క్రమక్రమంగా వెలుగులోకి తీసుకురావడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎంతోకాలం నుండి ఈ పత్రికను ప్రముఖంగా ఉపయోగిస్తున్నాడు. (మత్త. 24:45) ఉదాహరణకు, యేసు ఎవరిని ఉద్దేశించి “ఈ తరము” అనే మాట అన్నాడనేదాని గురించిన మన అవగాహననే తీసుకోండి. (మత్తయి 24:32-34 చదవండి.) యేసు ఏ తరము గురించి మాట్లాడాడు? యేసు ఆ మాటను దుష్టులను ఉద్దేశించి అనలేదు గానీ త్వరలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడే శిష్యులను ఉద్దేశించే అన్నాడని “క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?” అనే ఆర్టికల్‌ వివరించింది. a మొదటి శతాబ్దంలోని, మనకాలంలోని అభిషిక్తులు సూచనను చూడడం మాత్రమే కాదు, యేసు “ద్వారముదగ్గరనే యున్నాడ[నే]” సూచన భావాన్ని కూడా అర్థం చేసుకుంటారు.

14 ఈ వివరణను మనం ఎలా అర్థం చేసుకోవాలి? “ఈ తరము” అనే మాట ఖచ్చితంగా ఎంతకాలాన్ని సూచిస్తుందో మనకు తెలియకపోయినా, ఆ మాటకు సంబంధించిన వివిధ విషయాలను మనసులో ఉంచుకోవాలి. అది ఒకానొక కాలంలో జీవించే వివిధ వయసుల ప్రజలను సూచిస్తుంది. అది దీర్ఘకాలం ఉండదు, దానికొక ముగింపు ఉంటుంది. (నిర్గ. 1:6) అలాగైతే మనం “ఈ తరము” గురించి యేసు చెప్పిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? 1914లో సూచన కనిపిస్తున్నప్పుడు కొందరు అభిషిక్తులు దాన్ని చూశారు. వారు జీవించిన కాలంలోనే అభిషిక్తులైనవారు ఆ సూచన చూడకపోయినా మహాశ్రమల ప్రారంభాన్ని చూస్తారు. ఓ గుంపుగా వీరందరిని ఉద్దేశించే యేసు “తరము” అనే మాట అన్నాడు. ఆ తరానికి ఓ ఆరంభం ఉన్నట్లే, ఓ అంతం కూడా ఉంటుంది. ఆ సూచనలోని వివిధ అంశాలు నెరవేరడం చూస్తుంటే మహాశ్రమలు త్వరలో రానున్నాయని అర్థమౌతోంది. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మెలకువగా ఉండడం ద్వారా క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్న సత్యాలను మీరు గ్రహిస్తూ, పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటిస్తున్నారని చూపిస్తారు.—మార్కు 13:37.

15. సువార్త ప్రకటించేందుకు కావాల్సిన శక్తిని మనకు పరిశుద్ధాత్మ మాత్రమే ఇస్తుందని ఏది చూపిస్తోంది?

15 నాలుగవదిగా, పరిశుద్ధాత్మ సువార్త ప్రకటించేందుకు కావాల్సిన శక్తిని మనకు ఇస్తోంది. (అపొ. 1:8) ఇప్పటివరకు సువార్త భూవ్యాప్తంగా ఎలా ప్రకటించబడిందో మనకు దీన్నిబట్టి అర్థమౌతోంది. ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మీరు కూడా బిడియంతో లేదా భయంతో, ‘ఇంటింటికి వెళ్లి ప్రకటించడం నావల్ల కాదు!’ అని అనుకొనివుంటారు. అయితే, ఇప్పుడు మీరు ఈ పనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. b అనేకమంది నమ్మకమైన యెహోవాసాక్షులు వ్యతిరేకత లేదా హింస ఎదురైనా ప్రకటనా పనిలో కొనసాగారు. కాబట్టి పెద్దపెద్ద ఆటంకాలను అధిగమించి మన స్వశక్తితో చేయలేని వాటిని సహితం చేసేందుకు కావాల్సిన శక్తిని కేవలం దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. (మీకా 3:8; మత్త. 17:20) ప్రకటనా పనిలో పూర్తిగా పాల్గొనడం ద్వారా మీరు దాని నిర్దేశాన్ని పాటిస్తున్నారని చూపిస్తారు.

యెహోవా భవిష్యత్తులో పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తాడు?

16. మహాశ్రమలప్పుడు యెహోవా తన ప్రజలను కాపాడగలడనే నమ్మకంతో మనం ఎందుకు ఉండవచ్చు?

16 యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి భవిష్యత్తులో తన పరిశుద్ధాత్మను మరింత గొప్ప స్థాయిలో ఉపయోగిస్తాడు. ఆయన తన సేవకులను ఎలా రక్షించాడో ఆలోచించండి. మనం ముందు చూసినట్లు యెహోవా వివిధ వ్యక్తులనే కాక, ఇశ్రాయేలు జనాంగాన్నంతటినీ కాపాడడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. కాబట్టి, రాబోయే మహాశ్రమలప్పుడు తన ప్రజలను కాపాడడానికి ఆ గొప్ప శక్తినే ఉపయోగిస్తాడని మనం పూర్తిగా నమ్మవచ్చు. అప్పుడు ఆయన మనల్ని కాపాడే విధానం గురించి ఊహాగానాలు చేయాల్సిన అవసరంలేదు. అయితే, యెహోవాను ప్రేమించేవారు ఎక్కడున్నా ఆయన వారిని ఎప్పుడూ చూడగలడనే నమ్మకంతో, పరిశుద్ధాత్మ చేరుకోని స్థలమంటూ లేదనే నమ్మకంతో మనం భవిష్యత్తువైపు చూడవచ్చు.—2 దిన. 16:9; కీర్త. 139:7-12.

17. నూతనలోకంలో యెహోవా తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తాడు?

17 నూతనలోకంలో యెహోవా తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తాడు? పరిశుద్ధాత్మ శక్తితోనే కొత్త గ్రంథాలు తెరవబడతాయి. (ప్రక. 20:12) వాటిలో ఏముంటాయి? బహుశా, వెయ్యేండ్ల పరిపాలనలో మనం పాటించాల్సిన నియమాల వివరాలు ఉండవచ్చు. ఆ గ్రంథాల్లో ఏమున్నాయో చూడాలనుకుంటున్నారా? అలాగైతే, అత్యంత ఆసక్తితో ఆ నూతనలోకం కోసం ఎదురుచూద్దాం. భూమిపట్ల, దానిలో నివసించే మానవులపట్ల తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించినప్పుడు మనం అనుభవించే ఆశీర్వాదాలు మన ఊహకందవు!

18. మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు?

18 యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి విశ్వంలోనే అత్యంత గొప్ప శక్తిని ఉపయోగిస్తాడు కాబట్టి, ఆయన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడనే విషయాన్ని మనం ఎన్నడూ మరచిపోకుండా ఉందాం. ఆ సంకల్పం నెరవేరినప్పుడు మీరు కూడా ప్రయోజనం పొందుతారు. యెహోవా పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ, దాని నిర్దేశానికి అనుగుణంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉండండి. (లూకా 11:13) అలా చేస్తే యెహోవా మానవుల కోసం ఉద్దేశించినట్లే భూపరదైసులో నిత్యం జీవించే అవకాశం మీకు లభిస్తుంది.

[అధస్సూచీలు]

b బిడియాన్ని అధిగమించి, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రచారకురాలి ఉదాహరణ కోసం కావలికోట, సెప్టెంబరు 15, 1993, 19వ పేజీ చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• ప్రాచీన కాలాల్లో యెహోవా తన సంకల్పం నెరవేరేలా చేసేందుకు తన పరిశుద్ధాత్మను ఏయే విధాలుగా ఉపయోగించాడు?

• నేడు యెహోవా తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?

• భవిష్యత్తులో యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని బాక్సు]

క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్న సత్యాలను మీరు గ్రహిస్తున్నారా?

యెహోవా తన ప్రజల కోసం బైబిలు సత్యాలను వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నాడు. మన అవగాహనలో వచ్చిన మార్పుకు సంబంధించి కావలికోట పత్రికల్లో ప్రచురించబడిన కొన్ని విషయాలేమిటి?

▪ పులిసిన పిండి గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనం ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించి ఏ మంచి విషయాన్ని నేర్చుకుంటాం? (మత్త. 13:33)—జూలై 15, 2008, 19-20 పేజీలు.

▪ క్రైస్తవులకు పరలోక నిరీక్షణ కోసం ఇవ్వబడే పిలుపు ఎప్పుడు ఆగిపోతుంది?—మే 1, 2007, 30-31 పేజీలు.

▪ యెహోవాను ‘ఆత్మతో’ ఆరాధించడమంటే ఏమిటి? (యోహా. 4:24)—జూలై 15, 2002, 15వ పేజీ.

▪ గొప్పసమూహము మందిరంలోని ఏ భాగంలో సేవచేస్తున్నారు? (ప్రక. 7:15)—మే 1, 2002, 30-31 పేజీలు.

▪ గొర్రెలు, మేకలు ఎప్పుడు వేరుచేయబడతారు? (మత్త. 25:31-33)—అక్టోబరు 15, 1995, 18-28 పేజీలు.