కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• బంగారు దూడను చేసినందుకు అహరోనును దేవుడు ఎందుకు శిక్షించలేదు?

అహరోను విగ్రహారాధన విషయంలో దేవుడు ఇచ్చిన నియమాన్ని ఉల్లంఘించాడు. (నిర్గ. 20:3-5) అయితే, మోషే అహరోను కోసం ప్రార్థించాడు. ఆయన చేసిన ప్రార్థన ‘చాలా ప్రభావాన్ని చూపించింది.’ (యాకో. 5:16, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.) అహరోను యెహోవాను నమ్మకంగా సేవించిన వ్యక్తి. ప్రజల ఒత్తిడికి లొంగిపోయి ఆయన ఓ బంగారు దూడను చేసినప్పటికీ, ఆ తర్వాత లేవీ కుమారులతో కలిసి యెహోవా పక్షాన స్థిరంగా నిలబడడం ద్వారా తన హృదయంలో ప్రజలకున్న ఉద్దేశం లేదని చూపించాడు. (నిర్గ. 32:25-29)—5/15, 21వ పేజీ.

• భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా?

తప్పు చేయని వ్యక్తి బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నించినట్లైతే అవతలి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఓదార్పు, ప్రోత్సాహం అవసరమనే విషయం దేవునికి తెలుసని గుర్తుంచుకోండి. తోటి క్రైస్తవుల ద్వారా ఆయన ఓదార్పును ఇవ్వవచ్చు.—6/15, 30-31 పేజీలు.

• చదవడం పట్ల మీ పిల్లల్లో కోరికను ఎలా పెంచవచ్చు?

ప్రేమగల వాతావరణం, తల్లిదండ్రుల మాదిరి పిల్లల్లో చదవాలన్న కోరికను పెంచుతుంది. అంతేకాక, వారికి పుస్తకాలు ఇవ్వండి. బిగ్గరగా చదవండి. భాగం వహించమని ప్రోత్సహించండి, చదివిన వాటిని చర్చించండి. మీ పిల్లలను చదవమనండి, ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి.—7/15, 26వ పేజీ.