కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు” అని యేసు ఎందుకు చెప్పాడు?

“ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు” అని యేసు ఎందుకు చెప్పాడు?

“ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు” అని యేసు ఎందుకు చెప్పాడు?

బైబిలు కాలాల్లో సాధారణంగా జంతు చర్మాలతో చేయబడిన సిద్దెలలో లేదా తిత్తులలో ద్రాక్షారసాన్ని నిలువచేసేవారు. (యెహో. 9:13) అలాంటి తిత్తులను, మేకలు లేదా మేక పిల్లలు వంటి పెంపుడు జంతువుల పూర్తి చర్మాలతో తయారుచేసేవారు. ఒక తిత్తిని తయారు చేయాలంటే ముందుగా, చనిపోయిన జంతువు తలను, కాళ్లను శరీరం నుండి వేరు చేసి కళేబరం పైనున్న చర్మాన్ని జాగ్రత్తగా ఒలిచేవారు. తర్వాత, ఆ జంతు చర్మాన్ని లెదర్‌గా మార్చి, దేన్నైనా పోయడానికి వీలుగా దాని మెడ దగ్గర లేదా ఒక కాలు దగ్గరున్న రంధ్రాన్ని వదిలేసి మిగిలిన భాగాన్నంతా కుట్టేసేవారు, దాని మూతిని తీగతో కట్టి లేదా బిరడా (స్టాపర్‌) పెట్టి మూసేవారు.

సమయం గడిచేకొద్దీ ఆ చర్మం గట్టి పడి, దాని సాగే గుణాన్ని కోల్పోయేది. కాబట్టి పులుస్తున్న కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులలో నిలువచేయడం సరైనది కాదు. ఎందుకంటే, అలా పులిసే ప్రక్రియలో అప్పటికే గట్టి పడిన పాత తిత్తులు పిగిలే అవకాశం ఉంది. అయితే, కొత్త తిత్తులు ఎక్కువ సాగుతాయి కాబట్టి, కొత్త ద్రాక్షారసం పులవడం వల్ల కలిగే ఒత్తిడిని అవి తట్టుకోగలుగుతాయి. అందుకే యేసు, తన కాలంలోనివారికి బాగా తెలిసిన వాస్తవాన్నే చెప్పాడు. ఎవరైనా పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని “పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను” అని ఆయన చెప్పాడు.​—లూకా 5:37, 38.