కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి సేవించడానికి ఇంకా వయసు మించిపోలేదు

దేవుణ్ణి సేవించడానికి ఇంకా వయసు మించిపోలేదు

దేవుణ్ణి సేవించడానికి ఇంకా వయసు మించిపోలేదు

దక్షిణ స్పెయిన్‌లోని మలగ అనే నగరంలో 2009 డిసెంబరు 19న ఆన్నా అనే స్త్రీ, అదే పేరున్న ఆమె కూతురు బాప్తిస్మం తీసుకున్నారు. 2009వ సంవత్సరం, స్పెయిన్‌లో బాప్తిస్మం తీసుకున్న 2,352 మందిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే, ఈ తల్లీకూతుళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, తల్లి ఆన్నాకు 107 ఏళ్లు, కూతురు ఆన్నాకు 83 ఏళ్లు.

యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకోవడానికి వారిని ఏది నడిపించింది? 1970ల తొలి భాగంలో, వీళ్ల పక్కింట్లో ఉండే ఒక సాక్షి వాళ్లింట్లో జరిగే సంఘ పుస్తక పఠనానికి రమ్మని కూతుర్ని పిలుస్తుండేది. ఆన్నా దానికి అప్పుడప్పుడు హాజరయ్యేది. అయితే, తాను చేసే ఉద్యోగం వల్ల ఆమె ఎక్కువ ప్రగతి సాధించలేకపోయింది.

దాదాపు పది సంవత్సరాల తర్వాత, కూతురు ఆన్నా పిల్లల్లో కొంతమంది బైబిలు అధ్యయనం ఆరంభించి కొంతకాలానికి యెహోవా సేవకులయ్యారు. వారిలో ఒకరైన మారీ కార్మెన్‌ చివరకు తన తల్లిలో బైబిలు సత్యాల పట్ల తిరిగి ఆసక్తిని కలిగించి, బైబిలు అధ్యయనానికి ఒప్పించగలిగింది. ఆ తర్వాత, మారీ కార్మెన్‌ వాళ్ల అమ్మమ్మ ఆన్నా కూడా బైబిలు పట్ల ఆసక్తి చూపించింది. చివరకు ఈ కుటుంబంలోని పదిమంది బాప్తిస్మం తీసుకున్నారు.

తమ బాప్తిస్మం రోజున ఇద్దరు ఆన్నాలు చాలా సంతోషించారు. “తనను తెలుసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వడం ద్వారా యెహోవా నాపట్ల ఎంతో మంచితనాన్ని చూపించాడు” అని 107 ఏళ్ల ఆన్నా చెప్పింది. “పరదైసు వచ్చేలోపే నేను యెహోవా చిత్తం చేస్తూ రాజ్య సువార్తను ప్రకటించడంలో చేయగలిగినదంతా చేయడం ద్వారా ఆయనను సేవించాలనుకుంటున్నాను” అని ఆమె కూతురు చెప్పింది.

విధవరాళ్లైన ఈ తల్లీకూతుళ్లకు కూటాలకు హాజరవడమంటే చాలా ఇష్టం. “వారు క్రమం తప్పకుండా ప్రతీ కూటానికి హాజరౌతారు. కావలికోట అధ్యయనంలో వ్యాఖ్యానించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు” అని వారి సంఘంలోని ఓ పెద్ద చెప్పాడు.

నమ్మకస్థులైన వీరి మాదిరిని చూస్తే, “దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచు [ఉండిన]” అన్న అనే విధవరాలు గుర్తుకొస్తుంది. అలా సేవ చేయడంవల్ల, పసివాడిగావున్న యేసును చూసే గొప్ప అవకాశం ఆమెకు దొరికింది. (లూకా 2:36-38) యెహోవాను సేవించేందుకు 84 ఏళ్ల అన్నకు వయసు ఇంకా మించిపోలేదు. ఈ ఇద్దరు ఆన్నాల విషయంలో కూడా అదే నిజం.

మీ బంధువుల్లో ఎవరైనా బైబిలు సందేశాన్ని వినాలనుకుంటున్నారా? లేదా పరిచర్య చేస్తున్నప్పుడు ఆసక్తిగల వృద్ధులను మీరు కలుసుకున్నారా? అలాంటివారు ఈ అనుభవంలోని తల్లీకూతుళ్లలా తయారుకావచ్చు, ఎందుకంటే సత్యదేవుడైన యెహోవాను సేవించడానికి వారికి ఇంకా వయసు మించిపోలేదు.

[25వ పేజీలోని బ్లర్బ్‌]

“యెహోవా నాపట్ల ఎంతో మంచితనాన్ని చూపించాడు”

[25వ పేజీలోని బ్లర్బ్‌]

‘పరదైసు వచ్చేలోపే నేను యెహోవాను సేవించాలనుకుంటున్నాను’