కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడుదల చేసి తీసుకొస్తున్నప్పుడు వారికి ముందుగా ఏ దూతను పంపించాడు? (నిర్గ. 23:20, 21)

‘యెహోవా నామము కలిగివున్న’ దేవదూత మరెవరో కాదు దేవుని మొదటి కుమారుడేనని తెలుస్తోంది. ఆయనే ఆ తర్వాత యేసుగా భూమ్మీదకు వచ్చాడు.—9/15, 21వ పేజీ.

• సత్యారాధనకు సంబంధించి దేవుడు అంగీకరించని కొన్ని సంజాయిషీలు ఏమిటి?

‘అది చాలా కష్టం. నాకు చేయాలని లేదు. నాకు అస్సలు సమయం లేదు. నాకు సామర్థ్యం లేదు. నన్ను బాధపెట్టారు.’ దేవుని నియమాలు పాటించకపోవడానికి ఇవి సరైన కారణాలు కావు.—10/15, 12-15 పేజీలు.

• మీకు, ఇతరులకు కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి ఏవి సహాయం చేస్తాయి?

ముందుగా సిద్ధపడండి. క్రమంగా కూటాలకు వెళ్లండి. సమయానికి వెళ్లండి. కూటంలో చర్చించే సమాచారానికి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకెళ్లండి. ఆటంకాలను నివారించండి. కూటాల్లో పాల్గొనండి. క్లుప్తంగా వ్యాఖ్యానించండి. మీ నియామకాల్ని నెరవేర్చండి. కార్యక్రమంలో పాల్గొన్నవారిని మెచ్చుకోండి. కూటం ముందు, కూటం తర్వాత ఇతరులతో సహవసించండి.—10/15, 22వ పేజీ.

• తోటివారి ఒత్తిడికి అహరోను లొంగిపోవడం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

మోషే తమ మధ్య లేనప్పుడు ఇశ్రాయేలీయులు తమ కోసం ఓ దేవుణ్ణి చేయమని అహరోనును ఒత్తిడి చేశారు. ఆయన ఆ ఒత్తిడికి లొంగిపోయి, వారు చెప్పినట్లే చేశాడు. దీన్నిబట్టి, తోటివారి ఒత్తిడి కేవలం యౌవనస్థులకు మాత్రమే పరిమితం కాదుగానీ సరైనది చేయాలని కోరుకునే పెద్దవారి మీద కూడా ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. కాబట్టి, మనం తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడిని ఎదిరించాలి.—11/15, 8వ పేజీ.