కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సరళమైన ఆంగ్లంలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రారంభిస్తున్నాం

సరళమైన ఆంగ్లంలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రారంభిస్తున్నాం

సరళమైన ఆంగ్లంలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రారంభిస్తున్నాం

ఈ సంచిక మొదలుకొని ఒక సంవత్సరం పాటు ప్రతీనెల కావలికోట అధ్యయన ప్రతితోపాటు సరళమైన ఆంగ్ల ప్రతిని కూడా ప్రచురిస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ సంవత్సరంపాటు పరీక్షిస్తాం. అందులో అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి, పత్రికలో ఇంకా స్థలం ఉంటే ఎంపిక చేయబడిన ఇతర ఆర్టికల్స్‌ కూడా ఉంటాయి. చాలామంది యెహోవాసాక్షుల ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక అవసరాన్ని ఈ ప్రతి తీరుస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకు?

కెన్యా, ఘానా, నైజీరియా, పాపువా న్యూగిని, ఫిజి, లైబీరియా, సాలమన్‌ దీవులు వంటి దేశాల్లో మన సహోదరులు సాధారణంగా ఆంగ్ల భాష మాట్లాడతారు. వారు ఇతర స్థానిక భాషలను లేదా స్వదేశీ భాషలను మాట్లాడినా సంఘ కూటాల్లో, పరిచర్యలో ఎక్కువగా ఆంగ్ల భాషనే ఉపయోగిస్తారు. అయితే, వారు మాట్లాడే ఆంగ్ల భాష మన ప్రచురణల్లోని ఆంగ్ల భాష కంటే ఎంతో సరళంగా ఉంటుంది. అంతేకాక, కొంతమంది యెహోవాసాక్షులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. వారికి ఆంగ్ల భాష అంతగా రాకపోయినా అక్కడ ఆ భాషలోనే మాట్లాడాల్సి వస్తుంది. అంతేకాక, వారు తమ మాతృ భాషలో కూటాలకు హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు.

ప్రతీవారం కావలికోట అధ్యయనంలో మనం పరిశీలించే ఆర్టికల్స్‌ మనకు సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, హాజరయ్యే వారందరూ ఆ సమాచారం నుండి పూర్తిగా ప్రయోజనం పొందేలా సులభంగా అర్థమయ్యే పదాలను, సరళమైన వ్యాకరణాన్ని, సరళమైన వాక్య నిర్మాణాలను ఈ కొత్త ప్రతి ఉపయోగిస్తుంది. దీని కవర్‌ కూడా వేరుగా ఉంటుంది. ఇందులోని ఉపశీర్షికలు, పేరాలు, పునఃసమీక్ష ప్రశ్నలు, చిత్రాలు అధ్యయన ప్రతిలో ఉన్నట్టే ఉంటాయి. కాబట్టి, ఏ ప్రతిని ఉపయోగించైనా కావలికోట అధ్యయనంలో భాగం వహించవచ్చు. ఈ రెండు ప్రతుల్లోని పదాల్లో ఉన్న తేడాను చూడడానికి ఈ సంచికలోని మొదటి అధ్యయన ఆర్టికల్‌, 2వ పేరా నుండి తీసుకోబడిన ఉదాహరణను కింద చూడండి.

ఈ కొత్త ఏర్పాటు వల్ల, “నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయచేయుము” అని యెహోవాకు ప్రార్థించిన ఎంతోమంది విన్నపాలకు జవాబు దొరుకుతుందని మేము నమ్ముతున్నాం. (కీర్త. 119:73) ఆంగ్ల భాష అంతగా రానివారు, ఆ భాష మాట్లాడే కొంతమంది చిన్న పిల్లలు ప్రతీవారం జరిగే కావలికోట అధ్యయనానికి ఇంకా బాగా సిద్ధపడేందుకు ఇది సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ‘సహోదరుల పట్ల ప్రేమతో’ ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా అందజేయడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుణ్ణి ఉపయోగిస్తున్నందుకు యెహోవాకు ఎన్నో కృతజ్ఞతలు.—1 పేతు. 2:17; మత్త. 24:45.

యెహోవాసాక్షుల పరిపాలక సభ