కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

వార్షిక సేవా రిపోర్టులోని సంఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రతీ సంవత్సరం, ఫిబ్రవరి నెల మన రాజ్య పరిచర్యలో వచ్చే సేవా రిపోర్టు కోసం మనం ఎంతగానో ఎదురుచూస్తాం. ప్రపంచవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించే, బోధించే పనిలో యెహోవాసాక్షులు ఒక గుంపుగా చేసిన పనిని చూసి మనం ఎంతో సంతోషిస్తాం. అయితే, ఆ రిపోర్టు నుండి అత్యధిక ప్రయోజనం పొందాలంటే అందులోని ఆయా పదాలను, సంఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు చూడండి.

సేవా సంవత్సరం. ఇది సెప్టెంబరు నెలలో మొదలై తర్వాతి సంవత్సరంలోని ఆగస్టు నెలలో ముగుస్తుంది. ఫిబ్రవరి మన రాజ్య పరిచర్యలో గత సేవా సంవత్సరానికి సంబంధించిన నివేదిక ఉంటుంది. కాబట్టి 2011 ఫిబ్రవరి మన రాజ్య పరిచర్యలో, 2009 సెప్టెంబరు 1న మొదలై 2010 ఆగస్టు 31న ముగిసిన 2010 సేవా సంవత్సరపు నివేదిక ఉంటుంది.

శిఖరాగ్ర ప్రచారకులు, సగటు ప్రచారకులు. బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షులు, అలాగే సువార్త ప్రకటించడానికి అర్హులైనవారు “ప్రచారకులు” అనే కోవకు వస్తారు. “శిఖరాగ్ర ప్రచారకులు” అనేది సేవా సంవత్సరంలోని ఏదైనా నెలలో రిపోర్టు చేసిన అత్యధిక ప్రచారకుల సంఖ్యను సూచిస్తోంది. ప్రచారకులు ఆలస్యంగా ఇచ్చే రిపోర్టులు అంటే గత నెలకు సంబంధించిన రిపోర్టులు కూడా దానిలో ఉండవచ్చు. అందువల్ల కొంతమంది ప్రచారకుల్ని రెండుసార్లు లెక్కించే అవకాశముంది. అయితే, పరిచర్య చేసినప్పటికీ రిపోర్టు ఇవ్వడం మరచిపోయిన వారు శిఖరాగ్ర ప్రచారకుల్లో ఉండరు. కాబట్టి, ప్రతీ ప్రచారకుడు/ప్రచారకురాలు ప్రతీనెల రిపోర్టు చేయడం చాలా ప్రాముఖ్యం. సేవా సంవత్సరంలోని అన్ని నెలల్లో రిపోర్టులిచ్చే వారిని “సగటు ప్రచారకులు” అని అంటారు.

మొత్తం గంటలు. యెహోవాసాక్షులు 160 కోట్ల కన్నా ఎక్కువ గంటలు పరిచర్యలో గడిపారని 2011 ఫిబ్రవరి మన రాజ్య పరిచర్య చూపిస్తోంది. అయితే మనం ఆరాధన కోసం వెచ్చించే సమయమంతా అందులోకి రాదు. ఉదాహరణకు, క్రమంగా కాపరి సందర్శనాలు చేసేందుకు, కూటాలకు హాజరయ్యేందుకు, వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేసేందుకు, ధ్యానించేందుకు వెచ్చించే సమయం అందులో లెక్కించబడదు.

ఖర్చు చేసిన మొత్తం. 2010 సేవా సంవత్సరంలో క్షేత్ర సేవా నియామకాల్లో ఉన్న ప్రత్యేక పయినీర్ల కోసం, మిషనరీల కోసం, ప్రయాణ పర్యవేక్షకుల కోసం యెహోవాసాక్షులు 155 మిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చు చేశారు. అయితే బైబిలు ఆధారిత ప్రచురణలను ముద్రించడానికి వెచ్చించిన, ప్రపంచవ్యాప్తంగావున్న బెతెల్‌ గృహాల్లో సేవచేస్తున్న 20,000 కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులను చూసుకోవడానికి వెచ్చించిన డబ్బు అందులోకి రాదు.

జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన వారి సంఖ్య. ఇది ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన బాప్తిస్మం పొందిన ప్రచారకుల సంఖ్య. అంటే భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవుల సంఖ్యను అది సూచిస్తోందా? అవునని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, మునుపటి మత నమ్మకాలను బట్టి లేదా మానసిక, భావోద్వేగ సమతుల్యత లోపించడాన్ని బట్టి లేదా అలాంటి అనేక కారణాలను బట్టి కొందరు తమకు పరలోక పిలుపు ఉందని తప్పుగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి, భూమ్మీద ఖచ్చితంగా ఎంతమంది అభిషిక్త క్రైస్తవులు ఉన్నారనేది తెలుసుకోవడం కుదరదు, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. అంతేకాక, జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన వారందరి పేర్లను పరిపాలక సభ తన దగ్గర ఉంచుకోదు. a

మహాశ్రమలకు సంబంధించిన నాశనకరమైన వాయువులు విడిచిపెట్టబడే సమయానికి మన దేవుని అభిషిక్త దాసుల్లో కొందరు ఇంకా భూమ్మీదే ఉంటారని మాత్రం మనకు తెలుసు. (ప్రక. 7:1-3) అప్పటివరకు ప్రకటనా బోధనా పనిలో అభిషిక్తులు నాయకత్వం వహిస్తారు. చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఆ పనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలు ఎంతగా కృషి చేస్తున్నారో వార్షిక సేవా రిపోర్టు చూపిస్తుంది.

[అధస్సూచి]