కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని, బోధనా పని

భూవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని, బోధనా పని

భూవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని, బోధనా పని

కరపత్రాలతో సిద్ధంగా ఉన్నాడు.  ఆస్ట్రేలియాలో ఉంటున్న నేథన్‌ అనే అబ్బాయికి 12 ఏళ్ళు. ఆయన బైబిలు కరపత్రాలను తన బ్యాగులో పెట్టుకొని స్కూలుకు వెళ్తాడు, అక్కడ తన ​స్నేహితులకు క్రమంగా సాక్ష్యమిస్తాడు. ఒకరోజు ఆయన స్కూలు నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఒక ఇంటి ముందు ఒక పెద్దావిడ నిలబడి ఉండడం చూశాడు. ఆమె ​ఈయనను చూస్తూ చిరునవ్వు నవ్వింది. దాంతో నేథన్‌ కూడా చిరునవ్వు చిందించి ఆమెకు ఒక కరపత్రాన్ని ఇచ్చాడు. ​అప్పుడామె తన భర్త మూడేళ్ళ క్రితం చనిపోయాడని చెప్పింది. వెంటనే నేథన్‌, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? అనే కరపత్రాన్ని తన బ్యాగులో నుండి తీసిచ్చాడు. ఆమె భర్త పునరుత్థానం చేయబడినప్పుడు, పరదైసులో ఆయనను తిరిగి చూడవచ్చని నేథన్‌ చెప్పడంతో ఆమె కళ్ళలో నీళ్ళు ​తిరిగాయి. “కానీ, బాధలు ఎప్పుడు అంతమౌతాయి?” అని ఆమె అడిగింది. దానికి నేథన్‌, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి! అనే కరపత్రాన్ని తన బ్యాగులో నుండి తీసిచ్చాడు. అప్పుడామె ఇంకా ఏమేమి నమ్ముతావని నేథన్‌ను అడిగింది. ఈసారి కూడా నేథన్‌ వెంటనే, యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు? అనే మరో కరపత్రాన్ని తన బ్యాగులో నుండి తీసిచ్చాడు. ఆ తర్వాత నేథన్‌ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్నివారాల ​తర్వాత నేథన్‌ మళ్ళీ ఆమె తన ఇంటి ముందు నిలబడి ఉండడం చూశాడు. ఆమె నేథన్‌ను పిలిచి కౌగలించుకుంది. “ఏమి జరిగిందో తెలుసా నేథన్‌? నువ్వు ఆ కరపత్రాలు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇద్దరు సాక్షులు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నాతో బైబిలు ​అధ్యయనం చేస్తున్నారు” అని చెప్పింది.