కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• మోసం చేయాలనే ఆలోచనను మనమెలా ఎదిరిస్తూ ఉండవచ్చు?

(1) యెహోవా పట్ల సరైన భయం ఉంటే (1 పేతు. 3:12), (2) బైబిలు సూత్రాల ప్రకారం శిక్షణ పొందిన మనస్సాక్షి ఉంటే, (3) సంతృప్తి కలిగివుండడానికి కృషి చేస్తే ఎదిరించవచ్చు.—4/15, 6-7 పేజీలు.

• దేవుని సేవకు ప్రాముఖ్యతనివ్వడం అంటే గంభీరంగా ఉండడం, సరదాగా సమయం గడపకుండా ఉండడం కాదని మనకు ఎలా తెలుసు?

యేసు మాదిరిని పరిశీలించవచ్చు. ఆయన ఇతరులతో సరదాగా సమయం గడుపుతూ, వాళ్ళతో భోజనం చేసేవాడు. ఆయన అతి గంభీరంగా లేదా కఠినంగా ఉండేవాడు కాదని మనకు తెలుసు. అందరూ, చివరికి పిల్లలు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారుకాదు.—4/15, 10వ పేజీ.

• రోమీయులు 11వ అధ్యాయంలోని ఒలీవ చెట్టు దేన్ని సూచిస్తుంది?

ఒలీవ చెట్టు అబ్రాహాము సంతానంలోని ద్వితీయ భాగమైన ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. ఆ అలంకారార్థ ఒలీవ చెట్టుకు యెహోవా వేరు లాంటివాడు, యేసు కాండం లాంటివాడు. సహజ యూదుల్లో చాలామంది యేసును నిరాకరించినప్పుడు విశ్వాసులుగా మారిన అన్యులు ఈ అలంకారార్థ ఒలీవ చెట్టుకు అంటుకట్టబడ్డారు. ఆ విధంగా అబ్రాహాము సంతానంలోని ద్వితీయ భాగంలో ఉండేవాళ్ళ సంఖ్య పూర్తయింది.—5/15, 22-25 పేజీలు.

• పరిపూర్ణ మానవుడైన యేసు నుండి వచ్చే పిల్లలు విమోచన క్రయధనంలో భాగమయ్యే అవకాశం ఉందా?

లేదు. పరిపూర్ణ మానవునిగా యేసు కోట్లాదిమంది పరిపూర్ణ పిల్లలకు తండ్రి అయ్యుండేవాడనేది నిజమే అయినా, యేసు నుండి వచ్చే పిల్లలు విమోచన క్రయధనంలో భాగమై ఉండేవాళ్ళు కాదు. యేసు పరిపూర్ణ జీవం మాత్రమే ఆదాము పరిపూర్ణ జీవానికి సరిసమానమైనది. (1 తిమో. 2:6)—6/15, 13వ పేజీ.

అపొస్తలుల కార్యములు 20:29, 30లో అబద్ధ బోధకుల గురించి చేయబడిన హెచ్చరికను లక్ష్యపెడుతున్నామని క్రైస్తవులు ఎలా చూపించవచ్చు?

అబద్ధ బోధకులను క్రైస్తవులు తమ ఇంట్లోకి రానివ్వరు, వాళ్ళను పలకరించరు. (రోమా. 16:17; 2 యోహా. 9-11) అంతేకాక క్రైస్తవులు వాళ్ళ పుస్తకాలను చదవరు, టీవీలో వాళ్ళ కార్యక్రమాలను చూడరు, వాళ్ళ బోధలున్న వెబ్‌సైట్లను చూడరు.—7/15, 15-16 పేజీలు.