కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

సొలొమోను జీవితం మనకు ఏ విధంగా ఒక హెచ్చరికగా పనిచేస్తుంది?

దేవుడు సొలొమోను రాజును ఆశీర్వదించాడు, ఆయనను ఉపయోగించుకున్నాడు. అయితే, ఆయన తన పరిపాలనా కాలంలో దేవుని ఉపదేశాల్ని పాటించడం మానేశాడు. ఆయన అన్యుడైన ఫరో కూతురును వివాహం చేసుకున్నాడు, ఇంకా చాలామంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ల వల్ల అబద్ధ ఆరాధన చేసే స్థితికి దిగజారాడు. తప్పుడు ఆలోచనలు లేదా వైఖరులు మెల్లగా మన మనసుల్లోకి రాకుండా చూసుకోవాలి. (ద్వితీ. 7:1-4; 17:17; 1 రాజు. 11:4-8)—12/15, 10-12 పేజీలు.

మొదటి శతాబ్దం నుండి అన్ని కాలాల్లోనూ ఈ భూమ్మీద కొంతమంది నిజమైన అభిషిక్త క్రైస్తవులు ఉండేవుంటారని ఎలా చెప్పవచ్చు?

‘గోధుమలు, గురుగుల’ గురించిన ఉపమానంలో “మంచి విత్తనములు రాజ్యకుమారులు” అని యేసు చెప్పాడు. (మత్త. 13:24-30, 38, అధస్సూచి.) కోతకాలం వరకు గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతాయి. కాబట్టి, ఎవరు గోధుమల తరగతికి చెందినవాళ్లనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, మన కాలం వరకూ అన్ని కాలాల్లోనూ ఆ తరగతికి చెందిన వాళ్లు కొంతమంది ఉండేవుంటారు.—1/15, 7వ పేజీ.

అసూయపడే స్వభావాన్ని ఎలా తీసేసుకోవచ్చు?

ఈ చిట్కాలను పాటించవచ్చు: సహోదర ప్రేమను అలవర్చుకోండి, దేవుని ప్రజలతో సహవసించండి, మంచి చేయడానికి కృషి చేయండి, ‘సంతోషించే వాళ్లతో కలిసి సంతోషించండి.’ (రోమా. 12:15)—2/15, 16-17 పేజీలు.

సలహా ఇస్తున్నప్పుడు ఏ సూత్రాలను మనసులో ఉంచుకోవాలి?

వాళ్లు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోండి. అనాలోచితంగా సలహాలు ఇవ్వకండి. వినయంతో దేవుని వాక్యాన్ని అన్వయించండి. మీ దగ్గరున్న బైబిలు ప్రచురణలను ఉపయోగించండి. ఇతరులు ఏమి చేయాలనేది మీరు నిర్ణయించకండి.—3/15, 7-9 పేజీలు.