పాఠకుల ప్రశ్న
పాఠకుల ప్రశ్న
ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం బైబిలు ప్రవచనంలోని ఏడవ ప్రపంచాధిపత్యం ఎప్పుడైంది?
▪ రాజైన నెబుకద్నెజరు కలలో చూసిన ఒక పెద్ద లోహపు ప్రతిమ ప్రపంచాధిపత్యాలన్నిటినీ సూచించలేదు. (దాని. 2:31-45) అది దానియేలు కాలం నుండి పరిపాలన చేస్తూ, దేవుని ప్రజలను వ్యతిరేకించిన ఐదు ప్రపంచాధిపత్యాలకు మాత్రమే సూచనగా ఉంది.
లోహపు ప్రతిమ గురించి దానియేలు ఇచ్చిన వివరణ ప్రకారం ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం రోమా సామ్రాజ్యాన్ని జయించి కాదుగానీ దానిలో నుండే పుట్టుకొస్తుంది. ప్రతిమలో కాళ్లు మొదలుకొని పాదాలు, వేళ్ల వరకు ఇనుము ఉందని దానియేలు వివరించాడు. (పాదాలూ వేళ్లూ ఇనుము, మట్టితో మిళితమైవున్నాయి.) a ఆ వివరణ, ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం ఇనుప కాళ్లనుండి పుట్టుకొస్తుందని సూచిస్తుంది. సరిగ్గా ఆ వివరణలో ఉన్నట్లుగానే జరిగింది. రోమా సామ్రాజ్యంలో ఒకప్పుడు చిన్న భాగంగా ఉన్న బ్రిటన్ 18వ శతాబ్దం చివరి భాగంలో శక్తివంతమైన రాజ్యంగా తయారవడం మొదలయ్యింది. కొంతకాలానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించినా బైబిలు ప్రవచనంలోని ఏడవ ప్రపంచాధిపత్యం అప్పటికింకా రూపొందలేదు. ఎందుకంటే అప్పటికి బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోలేదు. అయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆ రెండిటి మధ్య అలాంటి సంబంధం ఏర్పడింది.
ఆ సమయానికి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో తమ ప్రధాన కార్యాలయం ఉండడం వల్ల “రాజ్య కుమారులు” అమెరికాలోనే ఎక్కువగా సేవ చేస్తున్నారు. (మత్త. 13:36-43, అధస్సూచి) అభిషిక్త తరగతికి చెందిన వాళ్లు బ్రిటీష్ సామ్రాజ్యపు పరిపాలన కిందవున్న దేశాల్లో కూడా అప్పుడు ఉత్సాహంగా ప్రకటనాపని చేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్, అమెరికా రాజ్యాలు ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుని, రెండూ కలిసి తమ రాజకీయ శత్రువులతో తలపడ్డాయి. అంతేగాక ఆ యుద్ధం కారణంగా పెరిగిన దేశాభిమానం వల్ల ఆ రాజ్యాలు దేవుని “స్త్రీ” సంతానంలో భాగంగా ఉన్న వాళ్లపై ద్వేషాన్ని వెళ్లగ్రక్కుతూ వాళ్ల ప్రచురణలను నిషేధించాయి, ప్రకటనాపనికి నాయకత్వం వహిస్తున్న వాళ్లను జైళ్లలో పెట్టించాయి.—ప్రక. 12:17.
18వ శతాబ్దం చివరి భాగంలో అంటే బ్రిటన్ ప్రసిద్ధికెక్కుతున్న కొత్తలో అది బైబిలు ప్రవచనం సూచించిన ఏడవ ప్రపంచాధిపత్యంగా ఇంకా రూపొందలేదు. కానీ అది ప్రభువు దినం ఆరంభంలో ప్రపంచాధిపత్యంగా ఏర్పడింది. b
[అధస్సూచీలు]
a ఇనుముతో మిళితమైయున్న మట్టి దేన్ని సూచిస్తుంది? అది ఇనుము లాంటి ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం కిందవున్న ప్రజల్ని సూచిస్తుంది. కాలం గడుస్తుండగా ఈ మట్టి లాంటి ప్రజల వల్ల, ఆ ప్రపంచాధిపత్యం ఉండాలనుకున్నంత శక్తివంతంగా ఉండలేకపోయింది.
b ఈ వివరణ, దానియేలు ప్రవచనం (ఆంగ్లం) పుస్తకంలో 57వ పేజీ 24వ పేరాలో అలాగే 56, 139 పేజీల్లోని చార్టుల్లో ఉన్న సమాచారాన్ని సవరిస్తోంది.
[19వ పేజీలోని చిత్రం]
1918 జూన్‌లో వాచ్‌టవర్ ప్రధాన కార్యాలయంలోని ఎనిమిది మంది సహోదరులను జైల్లో పెట్టారు