మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
సమ్సోను బలం ఆయన జుట్టులో ఉందా?
సమ్సోను బలం ఆయన జుట్టులో లేదు. కానీ నాజీరుగా ఆయనకు యెహోవాతో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ఆ జుట్టు సూచించింది. దెలీలా ఆయన జుట్టును కత్తిరించినప్పుడు ఆ సంబంధం దెబ్బతింది.—4/15, 9వ పేజీ.
కొన్ని చిట్కాలు మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచినట్లే, ఏ మూడు చిట్కాలు మన అలంకార హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి?
(1) పోషణ. మన గుండెకు తగినంత పుష్టికరమైన ఆహారం అవసరమైనట్లే, మన అలంకార హృదయానికి తగినంత పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం అవసరం. (2) వ్యాయామం. పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటే మన ఆధ్యాత్మిక హృదయం మంచి స్థితిలో ఉంటుంది. (3) సహవాసం. మనపై నిజమైన శ్రద్ధ చూపించే తోటి విశ్వాసులతో సహవసించడం ద్వారా మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.—4/15, 16వ పేజీ.
అంత్యక్రియల ప్రసంగమిచ్చే సహోదరుడు కీర్తన 116:15ను చనిపోయిన వ్యక్తికి ఎందుకు అన్వయించకూడదు?
“యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది” అని ఆ లేఖనం చెబుతోంది. తన నమ్మకమైన సేవకుల్లోని ప్రతీ ఒక్కరి ప్రాణం యెహోవా దృష్టిలో చాలా విలువైనది. తన భక్తులు ఒక గుంపుగా ఉనికిలో లేకుండా పోయే పరిస్థితిని యెహోవా రానివ్వడు.—5/15, 22వ పేజీ.
కల్‌పోర్చర్లు అంటే ఎవరు?
ఇప్పుడు పయినీర్లుగా పిలువబడుతున్న వాళ్లను 1931కి ముందు “కల్‌పోర్చర్లు” అని పిలిచేవాళ్లు.—5/15, 31వ పేజీ.
దానియేలు 2:44లో ప్రస్తావించబడిన “ముందు చెప్పిన రాజ్యములన్నీ” అంటే ఏవి?
అవి దానియేలు వర్ణించిన ప్రతిమలోని వివిధ భాగాలతో సూచించబడిన రాజ్యాలను లేదా ప్రభుత్వాలను సూచిస్తున్నాయి.—6/15, 17వ పేజీ.
ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం బైబిలు ప్రవచనంలోని ఏడవ ప్రపంచాధిపత్యం ఎప్పుడైంది?
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు గమనార్హమైన రీతిలో కలిసి పనిచేసినప్పుడు ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం ఆవిర్భవించింది.—6/15, 19వ పేజీ.
ఏ సంఘటనలు నేరుగా హార్‌మెగిద్దోను యుద్ధానికి దారితీస్తాయి?
దేశాలు ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు’ అనే గమనార్హమైన ప్రకటన చేస్తాయి. (1 థెస్స. 5:3) ప్రభుత్వాలు అబద్ధ మతంపై దాడి చేస్తాయి. (ప్రక. 17:15-18) ఆ తర్వాత సత్యారాధకులపై దాడి జరుగుతుంది. అప్పుడు అంతం వస్తుంది.—7/1 9వ పేజీ.
తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును యెహోవా ఎందుకు అడిగాడు?
నిజానికి అబ్రాహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వకుండా దేవుడు ఆపాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ప్రాముఖ్యం. తనకు ఎంతో బాధ కలిగినా తన కుమారుడైన యేసును యెహోవా ఎలా బలిగా అర్పిస్తాడనే విషయాన్ని ఆ నాటకం చూపించింది.—7/1 20వ పేజీ.