వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది
అది సా.శ. 49వ సంవత్సరం. సహోదరుల మధ్య “స్తంభములుగా ఎంచబడిన” పేతురు, యాకోబు, యోహానులు ఒక ప్రాముఖ్యమైన పనిని అపొస్తలుడైన పౌలుకు, ఆయన సహవాసియైన బర్నబాకు అప్పగించారు. అన్యులకు సువార్త ప్రకటిస్తూనే, బీద క్రైస్తవుల అవసరాల పట్ల కూడా శ్రద్ధ చూపించమని వాళ్లకు చెప్పారు. (గల. 2:8-10) ఆ పనిని వాళ్లు ఎలా పూర్తిచేశారు?
పౌలు రాసిన పత్రికలు చదివితే ఆయన ఆ పని విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అర్థమౌతుంది. ఉదాహరణకు, కొరింథులోని క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు: “పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.”—1 కొరిం. 16:1-3.
విరాళాలను సేకరించడానికి గల కారణాన్ని పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మళ్లీ చెప్పాడు. “అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు” పనికొస్తుందని పౌలు అన్నాడు.—2 కొరిం. 8:12-15.
పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు సుమారు సా.శ. 56లో పత్రిక రాసే సమయానికి విరాళాలను సేకరించే పని దాదాపు పూర్తి అయిపోయింది. “అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును, అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.” (రోమా. 15:25, 26) ఆ తర్వాత కొద్దికాలానికే పౌలు తనకు అప్పగించిన పనిని పూర్తిచేశాడు. యెరూషలేముకు వచ్చాక బంధింపబడిన పౌలు రోమా అధిపతియైన ఫేలిక్సుతో అన్న మాటల్లో ఆ విషయం స్పష్టమౌతుంది. “నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని” అని పౌలు అన్నాడు.—అపొ. 24:17.
పౌలు మాసిదోనియలోని సహోదరుల గురించి అన్న మాటలు చదివితే తొలి క్రైస్తవులు చందాలు ఇచ్చే విషయంలో చూపించిన స్ఫూర్తి గురించి తెలుస్తుంది. విరాళాలను ఇచ్చే అవకాశం ఇవ్వమని అక్కడివాళ్లు ‘మనఃపూర్వకముగా మమ్మును వేడుకున్నారు’ అని పౌలు రాశాడు. వాళ్లను ఆదర్శంగా తీసుకోమని కొరింథులోని క్రైస్తవులను పౌలు ప్రోత్సహించాడు. ఆయన ఇలా అన్నాడు, “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” ఉదారంగా విరాళాలిచ్చేలా సంఘాలను ఏది పురికొల్పింది? వాళ్లు కేవలం “పరిశుద్ధుల అక్కరలకు సహాయము” చేయాలని మాత్రమే కాదుగానీ సమృద్ధిగా ‘దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని’ అలా ఇచ్చారు. (2 కొరిం. 8:4; 9:7, 12) మనం కూడా ఆ ఉద్దేశాలతోనే విరాళాలు ఇస్తాం. నిస్వార్థంగా విరాళాలు ఇస్తూ మనం చూపించే మంచి స్ఫూర్తిని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఆయనిచ్చే ‘ఆశీర్వాదాలు ఐశ్వర్యమిస్తాయి’—సామె. 10:22.
ప్రపంచవ్యాప్త పని కోసం కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు
పౌలు కాలంలోలాగే నేడు చాలామంది కొంత డబ్బును దాచిపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు. (1 కొరిం. 16:2) ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. మీరు కూడా డబ్బు రూపంలో విరాళాలను నేరుగా మీ దేశంలో యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు పంపించవచ్చు. a ఈ కింది పద్ధతుల్లో మీరు విరాళాల్ని నేరుగా పంపించవచ్చు:
బేషరతుగా ఇచ్చే విరాళాలు
డబ్బు, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు.
ఇలాంటి వాటిని పంపిస్తున్నప్పుడు మీరే వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.
షరతుపై విరాళాలు ఇచ్చే ఏర్పాటు
దాత తనకు కావాల్సినప్పుడు తిరిగి తీసుకునే షరతు మీద డబ్బు రూపంలో ఇచ్చే విరాళాలు.
షరతు మీదే విరాళమిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.
దానధర్మ ప్రణాళిక b
ప్రపంచవ్యాప్త రాజ్య పనికోసం డబ్బును, ఇతర విలువైన వస్తువులను ఇవ్వడంతో పాటు కింద ఉన్న ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. మీరు ఎలాంటి పద్ధతి ఉపయోగించి విరాళమివ్వాలనుకున్నా ముందుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి, మీ దేశంలో ఎలాంటి పద్ధతుల్లో విరాళమిచ్చే సౌలభ్యం ఉందో తెలుసుకోండి. పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి, ఏ పద్ధతిలో విరాళమిస్తే బాగుంటుందో నిర్ణయించుకునే ముందు అర్హుడైన లాయరును లేదా పన్ను సలహాదారుణ్ణి సంప్రదించండి.
భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్/పెన్షన్ పథకానికి లబ్ధిదారుగా యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరును సూచించవచ్చు.
బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, డిపాజిట్‌సర్టిఫికెట్లు లేదా వ్యక్తిగత రిటైర్‌మెంట్‌ఖాతాలు మరణం తర్వాత యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు చెందేలా చేయవచ్చు లేదా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి లబ్ధిదారుయైన మన సంస్థకు అందేలా చేయవచ్చు.
షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు లేదా మరణానంతరం ఆ సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.
స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆయన/ఆమె జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి వారి తదనంతరం అవి విరాళంగా ఇవ్వబడే ఏర్పాటు చేయవచ్చు.
వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళం ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరున వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో ఆ సంస్థను లబ్ధిదారుగా సూచించవచ్చు. ఈ ఏర్పాటు వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.
“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలంటే దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవాళ్ళ సహాయం కోసం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక అనే బ్రోషురు ఆంగ్లంలో, స్పానిష్‌లో రూపొందించబడింది. c బ్రతికుండగా లేదా మరణం తర్వాత వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. మీ దేశంలోని పన్ను నిబంధనలు, తదితర చట్టాలను బట్టి ఈ బ్రోషురులో ఉన్న సమాచారం మీ పరిస్థితికి పూర్తిగా సరిపోకపోవచ్చు. కాబట్టి, ఆ బ్రోషురును చదివిన తర్వాత మీరు మీ లాయర్లను లేదా పన్ను సలహాదారులను సంప్రదించాలి. చాలామంది దానధర్మ ప్రణాళికలో విరాళమివ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనం మతపరంగా, మానవతా దృష్టితో చేస్తున్న పనికి మద్దతునివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందగలిగారు. ఆ బ్రోషురు మీ దేశంలో అందుబాటులో ఉంటే, మీ సంఘ కార్యదర్శిని అడిగి ఒక కాపీ తీసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నంబరుకు ఫోన్ చేయండి లేదా కింద ఇచ్చిన చిరునామాకు ఉత్తరం రాయండి. లేదా మీ దేశంలోని యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించండి.
[అధస్సూచీలు]
a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.
b తుది నిర్ణయం తీసుకునే ముందు మీరు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.
c త్వరలోనే భారతదేశంలో “దానధర్మ ప్రణాళిక పత్రం” అనే పేరుతో ఓ డాక్యుమెంట్ అస్సామీ, ఆంగ్లం, కన్నడ, కొంకణి, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.
Jehovah’s Witnesses of India
Post Box 6440,
Yelahanka,
Bangalore 560 064
Karnataka.
Telephone: (080) 28468072