కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2014
45వ కీర్తనలో ఉన్న ఉత్తేజకరమైన సంఘటనలను ఈ సంచిక వివరిస్తుంది. యెహోవా దేవుడు మన దాతగా, సంరక్షునిగా, సాటిలేని స్నేహితునిలా ఎలా ఉన్నాడో అర్థం చేసుకుని, ఆయన పట్ల కృతజ్ఞత పెంచుకోవడానికి కూడా ఈ సంచిక సహాయం చేస్తుంది.
మహిమాన్విత రాజైన క్రీస్తును స్తుతించండి!
45వ కీర్తనలోని ఉత్తేజకరమైన సంఘటనలు నేడు మనకు ఎందుకు ప్రాముఖ్యమైనవి?
గొర్రెపిల్ల వివాహం విషయంలో ఆనందించండి!
పెళ్లికూతురు ఎవరు? ఆమెను పెళ్లికోసం క్రీస్తు ఎలా సిద్ధం చేస్తూ వచ్చాడు? ఆ పెళ్లివల్ల కలిగే సంతోషంలో ఎవరు పాలుపంచుకుంటారు?
సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది
ఆ విధవరాలి విశ్వాసాన్ని ఎంతగానో బలపర్చిన సంఘటనల్లో, ఆమె కుమారుని పునరుత్థానం ఒకటి. ఆమె నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
యెహోవా—మన దాత, సంరక్షకుడు
మన పరలోక తండ్రైన యెహోవా మీద కృతజ్ఞత చూపించండి. గొప్ప దాతగా, సంరక్షకునిగా దేవునితో మీకున్న బంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చో తెలుసుకోండి.
యెహోవా మన సాటిలేని స్నేహితుడు
యెహోవాకు సన్నిహిత స్నేహితులైన అబ్రాహాము, గిద్యోను మాదిరులను పరిశీలించండి. యెహోవాకు స్నేహితులవ్వాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి?
పాఠకుల ప్రశ్న
మొదటి శతాబ్దంలోని యూదులు మెస్సీయ కోసం ‘కనిపెట్టుకొని’ ఉండడానికి ఏ ఆధారం ఉంది?
‘యెహోవా ప్రసన్నతను చూడండి’
సత్యారాధన కోసం యెహోవా చేసిన ఏర్పాటు విషయంలో ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఎంతో కృతజ్ఞత చూపించాడు. నేడు మనమెలా సత్యారాధనలో ఆనందించవచ్చు?
ఆనాటి జ్ఞాపకాలు
100 ఏళ్ల విశ్వాస గాథ
బైబిలు దేవుని వాక్యమని ప్రజల్లో విశ్వాసం కలిగించే ఉద్దేశంతో రూపొందించిన ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్ ప్రదర్శనకు ఈ సంవత్సరంతో వందేళ్లు.