కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2014
ఈ సంచికలో, సానుకూల దృక్పథాన్ని కలిగివుంటూనే స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి. వయసుపైబడిన తోటి క్రైస్తవుల పట్ల, బంధువుల పట్ల మనమెలా శ్రద్ధ చూపించవచ్చో నేర్చుకుంటాం
సత్యంలో లేని బంధువుల హృదయాల్ని చేరుకోండి
యేసు తన బంధువులతో వ్యవహరించిన విధానం నుండి ఏమి నేర్చుకోవచ్చు? వేరే మత నమ్మకాలున్న లేదా అసలు ఎలాంటి నమ్మకం లేని కుటుంబ సభ్యులకు సత్యం ఎలా తెలియజేయవచ్చు?
స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?
మనలోని స్వయంత్యాగ స్ఫూర్తిని నెమ్మదినెమ్మదిగా తగ్గించాలని చూసే ఓ శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఆ శత్రువు ఏమిటో, బైబిలు సహాయంతో ఆ శత్రువుతో ఎలా పోరాడవచ్చో ఈ ఆర్టికల్లో చూస్తాం.
సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
చాలామంది ఎందుకు ప్రతికూల వైఖరితో సతమతమవుతుంటారు? బైబిలు సహాయంతో సానుకూల దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ ఆర్టికల్లో చూడండి.
కుటుంబ ఆరాధన—మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?
వివిధ దేశాల్లో కుటుంబ ఆరాధనను ఎలా చేస్తున్నారో చూసి మీరు ప్రయత్నించగల పద్ధతుల గురించి ఆలోచించండి.
మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి
వృద్ధులను దేవుడు ఎలా చూస్తాడో పరిశీలించండి. వయసు పైబడుతున్న తల్లిదండ్రుల విషయంలో, ఎదిగిన పిల్లలకు ఏ బాధ్యతలు ఉన్నాయి? తమ మధ్య ఉన్న వయసుమళ్లిన వాళ్లను సంఘాలు ఎలా ఘనపర్చవచ్చు?
వయసుపైబడిన వాళ్ల బాగోగులు చూసుకోండి
వయసు పైబడుతున్న తల్లిదండ్రులూ ఎదిగిన పిల్లలూ, “దుర్దినములు” రాకముందే అవసరమైన ఏర్పాట్ల గురించి, చేయాల్సిన నిర్ణయాల గురించి చర్చించుకోవచ్చు. ఈ విషయంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చు?
మీ మాట—‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ఉందా?
నిజక్రైస్తవులు మాటమీద నిలబడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ప్రవర్తించకూడదు. మనం ముందుగా అనుకున్నదాన్ని రద్దు చేయాల్సి వస్తే? అపొస్తలుడైన పౌలు ఆదర్శం నుండి నేర్చుకోండి.