కావలికోట—అధ్యయన ప్రతి మే 2014

పరిచర్యలో కష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు మనం ఏ మూడు పద్ధతులు ఉపయోగించి, ప్రజలను ఒప్పించే సమాధానాలు ఇవ్వవచ్చో ఈ సంచికలో పరిశీలిస్తాం. మనం యెహోవా సంస్థకు నమ్మకంగా కట్టుబడివుండడం ఎందుకు ప్రాముఖ్యం?

‘దేవుని చిత్తం చేయడమే నాకు ఆహారం’

రాజైన దావీదు, అపొస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని ఆసక్తిగా చేశారు. మన ప్రాంతంలో సవాళ్లు ఉన్నా, పరిచర్యలో మన ఉత్సాహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

“ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో” తెలుసుకోండి

క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు, మనం లేఖనాలమీద సమర్థవంతంగా ఎలా తర్కించవచ్చు? ప్రజలను ఒప్పించే సమాధానాలు ఇవ్వడానికి ఉపయోగించగల మూడు పద్ధతులను పరిశీలించండి.

పరిచర్యలో బంగారు సూత్రాన్ని పాటించండి

పరిచర్యలో కలిసే ప్రతీ ఒక్కరితో మనం ఎలా వ్యవహరించాలి? మత్తయి 7:12⁠లోని యేసు మాటలు మన పరిచర్యమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

జీవిత కథ

యెహోవా నాకు నిజంగా సహాయం చేశాడు

బిడియాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని అధిగమించేలా యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో కెన్నథ్‌ లిటిల్‌ చెబుతున్నాడు. జీవితాంతం ధైర్యంగా ఆయన చేసిన కృషిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో తెలుసుకోండి.

యెహోవా సంస్థీకరణగల దేవుడు

ప్రాచీన ఇశ్రాయేలీయులకు, అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవత్వానికి సంబంధించిన వృత్తాంతాలు, నేడు భూమ్మీదున్న యెహోవా సేవకులు సంస్థీకరించబడి ఉంటారని ఎలా చూపిస్తున్నాయి?

యెహోవా సంస్థతో కలిసి మీరు ముందుకు సాగుతున్నారా?

సాతాను దుష్టలోకం త్వరలోనే అంతం కానుంది. నేడు భూమ్మీద యెహోవా ఉపయోగిస్తున్న సంస్థను మనం యథార్థంగా అంటిపెట్టుకుని ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

ఆనాటి జ్ఞాపకాలు

“ఎంతో కోతపని జరగాల్సి ఉంది”

బ్రెజిల్‌లో 7,60,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు బైబిలు సత్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ప్రకటనాపని ఎలా మొదలైంది?