కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

నీసాను 14న, పస్కా గొర్రెపిల్లను ఏ సమయంలో వధించాలి?

గొర్రెపిల్లను “సాయకాలమందు” లేదా “పొద్దుగ్రుంకే వేళ,” సూర్యుడు అస్తమించాక కొంచెం వెలుతురు ఉన్నప్పుడే వధించాలని కొన్ని బైబిలు అనువాదాలు చెబుతున్నాయి. (నిర్గ. 12:6)—12/15, 18-19 పేజీలు.

జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడానికి యౌవనులకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేయగలవు?

అవి: (1) దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. (మత్త. 6:19-34) (2) ఇతరులకు సేవచేయడంలో ఆనందాన్ని పొందండి. (అపొ. 20:35) (3) యౌవనంలోనే యెహోవాను సేవించడంలో ఆనందించండి. (ప్రసం. 12:1, 2)—1/15, 19-20 పేజీలు.

ఏ నలుగురు గుర్రపు రౌతులు 1914 నుండి స్వారీ మొదలుపెట్టారు?

తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న యేసు, సాతానును అతని దయ్యాలను పరలోకం నుండి పడేశాడు. ఎర్రని గుర్రం మీదున్న రౌతు యుద్ధాలకు ప్రతీకగా ఉన్నాడు. నల్లని గుర్రం మీదున్న రౌతు కరువును సూచిస్తున్నాడు. పాండుర వర్ణంగల గుర్రం మీదున్న రౌతు తెగులు వల్ల లక్షలమందిని మృత్యువాతకు గురిచేస్తున్నాడు. (ప్రక. 6:2-8)—1/1, 14-15 పేజీలు.

“గొర్రెపిల్ల వివాహం” ఎప్పుడు జరుగుతుంది? (ప్రక. 19:6, 7)

రాజైన యేసుక్రీస్తు విజయ పరంపర ముగిసిన తర్వాత; అంటే మహాబబులోను నాశనమైన తర్వాత, హార్‌మెగిద్దోను యుద్ధం ముగిశాక “గొర్రెపిల్ల వివాహం” జరుగుతుంది.—2/15, 10వ పేజీ.

యేసు కాలంలోని యూదులు మెస్సీయ కోసం ఎందుకు ‘కనిపెట్టుకునివున్నారు?’ (లూకా 3:15)

దానియేలు ప్రవచనాన్ని మనలాగే, మొదటి శతాబ్దపు యూదులు అర్థం చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పలేము. (దాని. 9:24-27) అయినా, కొంతమంది గొర్రెల కాపరులకు దేవదూతలు చెప్పిన మాటల్ని లేదా ఆలయంలో శిశువైన యేసును చూసినప్పుడు ప్రవక్త్రిని అన్నా చెప్పిన మాటల్ని యూదులు వినివుంటారు. జ్యోతిష్కులు కూడా “యూదుల రాజుగా పుట్టిన” వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చారు. (మత్త. 2:1, 2) అంతేకాక, క్రీస్తు త్వరలోనే రానున్నాడని బాప్తిస్మమిచ్చు యోహాను ఆ తర్వాత సూచించాడు.—2/15, 26-27 పేజీలు.

అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండకుండా మనం ఎలా జాగ్రత్తపడాలి? (2 కొరిం. 1:18)

కొన్నిసార్లు అనుకోని పరిస్థితులవల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మనకు సాధ్యం కాకపోవచ్చని ఒప్పుకోవాల్సిందే. అయితే మనం మాట ఇచ్చినా, ఒప్పందం చేసుకున్నా వాటికి కట్టుబడివుండడానికి చేయగలిగినదంతా చేయాలి.—3/15, 32వ పేజీ.

అశ్లీల చిత్రాలు చూడాలనే శోధనను మనమెలా ఎదిరించవచ్చు?

మూడు విషయాలు సహాయం చేస్తాయి, అవి: (1) అశ్లీల చిత్రం కంటపడితే, వెంటనే పక్కకు చూడండి. (2) మంచి విషయాల గురించి ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ మీ ఆలోచనలను కాపాడుకోండి. (3) అశ్లీల సన్నివేశాలు ఉండే సినిమాలకు, వెబ్‌సైట్లకు దూరంగా ఉంటూ మీ అడుగులను కాపాడుకోండి.—7/1, 9-11 పేజీలు.

వేరే దేశంలో డబ్బు సంపాదించడానికి తమ కుటుంబాన్ని విడిచిపెట్టే క్రైస్తవులు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సిరావచ్చు?

తల్లిదండ్రులు తమ కుటుంబానికి దూరంగా ఉంటే, వాళ్ల పిల్లలకు భావోద్వేగ, నైతిక ప్రమాదాలు ఎదురుకావచ్చు. పిల్లల మనసులో తల్లిదండ్రుల మీద కోపం ఏర్పడవచ్చు. తమ భర్తకు/భార్యకు దూరంగా ఉండేవాళ్లకు శారీరక శోధనలు కూడా ఎదురుకావచ్చు.—4/15, 19-20 పేజీలు.

పరిచర్యలో ప్రజలను కలుస్తున్నప్పుడు ఏ నాలుగు ప్రశ్నలను మనం మనసులో ఉంచుకోవాలి?

నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఎక్కడ మాట్లాడుతున్నాను? ఎప్పుడు మాట్లాడుతున్నాను? ఎలా మాట్లాడితే మంచిది?—5/15, 12-15 పేజీలు.

పొగ తాగడం ఎంత ప్రాణాంతకమైనది?

గడిచిన వందేళ్లలో 10 కోట్లమందిని అది పొట్టనబెట్టుకుంది. ప్రతీ సంవత్సరం దాదాపు 60 లక్షలమంది దానివల్ల చనిపోతున్నారు.—7/1, 3వ పేజీ.