కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు

ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు

మన సృష్టికర్త స్వేచ్ఛాచిత్తం అనే వెలకట్టలేని బహుమానాన్ని ఇచ్చి మనల్ని గౌరవించాడు. దాన్ని నిస్వార్థంగా ఉపయోగిస్తూ సత్యారాధనను వృద్ధి చేసేవాళ్లను, తన పరిశుద్ధ నామాన్ని పవిత్రపరుస్తూ తన గొప్ప సంకల్పానికి మద్దతిచ్చేవాళ్లను ఆయన ఎంతో దీవిస్తాడు. భయపెట్టో, బలవంతపెట్టో తనకు లోబడేలా చేయాలని యెహోవా కోరుకోడు. బదులుగా నిజమైన ప్రేమతో, మనసునిండా కృతజ్ఞతతో ఇష్టపూర్వకంగా చూపించే భక్తికే ఆయన విలువిస్తాడు.

ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు, తనను ఆరాధించడం కోసం ఓ గుడారాన్ని కట్టమని యెహోవా ఆజ్ఞాపించాడు. “యెహోవాకు మీలో మీరు కానుక పోగు చెయ్యండి. అంటే ఇష్టమున్న వారెవరైనా యెహోవాకోసం కానుక తేవాలి” అని ఆయన చెప్పాడు. (నిర్గ. 35:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆ కానుకలను దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తగిన విధంగా ఉపయోగిస్తారు. కాబట్టి ప్రతీ ఇశ్రాయేలీయుడు తన శక్తి కొలది స్వచ్ఛందంగా ఏదైనా, ఎంతైనా ఇవ్వవచ్చు. దానికి వాళ్లెలా స్పందించారు?

“ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు” స్వచ్ఛందంగా అర్పణలు తెచ్చారు. ప్రతీ ఒక్కరు “మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.” స్త్రీలు, పురుషులు ఇష్టపూర్వకంగా యెహోవా పనికోసం ముక్కరలను, చెవిపోగులను, ఉంగరాలను, బంగారం, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్ర, రత్నములు, సుగంధద్రవ్యము, తైలము తెచ్చారు. అలా యెహోవా పనికోసం “వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది.”—నిర్గ. 35:21-24, 27-29; 36:6.

అయితే, స్వచ్ఛారాధనకు మద్దతుగా ప్రజలు తెచ్చిన కానుకలు కాదుగానీ, వాళ్లు ఇష్టపూర్వకంగా ఇవ్వడమే యెహోవాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వాళ్లు తమ సమయాన్ని, శక్తిని కూడా ధారపోశారు. “వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికారు” అని లేఖనాలు చెబుతున్నాయి. నిజానికి, “ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.” అంతేకాదు, యెహోవా బెసలేలుకు “విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును ప్రజ్ఞ వివేక జ్ఞానములు” ఇచ్చాడు. నిజానికి యెహోవా, తాను ఆజ్ఞాపించిన పనులన్నిటినీ చేయడానికి కావాల్సిన నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు ఇచ్చాడు.—నిర్గ. 35:25, 26, 30-35.

అర్పణలు తెమ్మని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, “ఇష్టమున్న” ప్రతీ ఒక్కరు సత్యారాధనకు మద్దతిస్తారనే పూర్తి నమ్మకం ఆయనకు ఉంది. అలాంటి వాళ్లకు నిర్దేశాన్ని, అంతులేని ఆనందాన్ని ఇచ్చి యెహోవా వాళ్లను విస్తారంగా ఆశీర్వదించాడు. తన సేవకులు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చినప్పుడు యెహోవా వాళ్లను ఆశీర్వదించి, తన చిత్తం నెరవేరడానికి అవసరమయ్యే వనరులకుగానీ నైపుణ్యాలకుగానీ కొదువ లేకుండా చూసుకుంటాడు. ఆ విషయాన్ని ఆయన ఇశ్రాయేలీయుల కాలంలో నిరూపించాడు. (కీర్త. 34:9) మీరు యెహోవాను నిస్వార్థంగా సేవిస్తూ, ఇష్టపూర్వకంగా ముందుకొచ్చినప్పుడు మిమ్మల్ని కూడా తప్పకుండా దీవిస్తాడు.

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశ పాస్‌పోర్టు ఉన్నవాళ్లు jwindiagift.org వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ రాబడి అంతటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.