కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులతో వ్యవహరించడం గురించి ఆయనేమి బోధించాడు?

ఇతరులతో వ్యవహరించడం గురించి ఆయనేమి బోధించాడు?

యేసు ఏమి బోధించాడు?

ఇతరులతో వ్యవహరించడం గురించి ఆయనేమి బోధించాడు?

ఎందుకు దయ చూపించాలి?

ప్రజలు మీ పట్ల నిర్దయగా ప్రవర్తించినప్పుడు కూడా మీరు దయ చూపిస్తారా? మనం యేసును అనుకరించాలంటే, మనల్ని ద్వేషించేవారిపట్ల కూడా మనం దయచూపించాలి. యేసు ఇలా చెప్పాడు, ‘మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించుడి అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియైయున్నాడు.’​—లూకా 6:32-36; 10:25-37.

ఎందుకు క్షమించాలి?

మనం తప్పులు చేస్తే దేవుడు మనలను క్షమించాలని కోరుకుంటాం. దేవుని క్షమాపణ కోసం వేడుకోవడం సరైనదని యేసు బోధించాడు. (మత్తయి 6:12) అయితే, మనం ఇతరులను ఎంతవరకు క్షమిస్తామో దేవుడు మనల్ని అంతవరకే క్షమిస్తాడని కూడా యేసు చెప్పాడు. ఆయనిలా చెప్పాడు, “మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన​యెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.”​—మత్తయి 6:14, 15.

కుటుంబాలు ఎలా సంతోషంగా ఉండవచ్చు?

యేసు వివాహం చేసుకోకపోయినప్పటికీ, కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఎలా పొందవచ్చనే విషయంలో ఆయన నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. ఆయన తన మాటల ద్వారా, క్రియల ద్వారా మనం అనుసరించదగ్గ మాదిరినుంచాడు. క్రింద ఇవ్వబడిన ఈ మూడు విషయాలను పరిశీలించండి:

1. భర్త తన భార్యను సొంత శరీరంలా ప్రేమించాలి. యేసు భర్తలకు మాదిరినుంచాడు. ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.” ఎంతమేరకు ప్రేమించాలి? “నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను” అని ఆయన చెప్పాడు. (యోహాను 13:34) ఈ సూత్రాన్ని భర్తలకు అన్వయిస్తూ బైబిలు ఇలా చెబుతోంది, ‘పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై​యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించు​కొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించు​కొనును. ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.’​—ఎఫెసీయులు 5:25, 28, 29.

2. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. వివాహ భాగస్వామితో కాకుండా మరొకరితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లవుతుంది, అంతేకాక అది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. యేసు ఇలా చెప్పాడు, ‘ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జత​పరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు. వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను.’—మత్తయి 19:4-9.

3. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. యేసు పరిపూర్ణుడైనప్పటికీ పిల్లవానిగా ఉన్నప్పుడు అపరిపూర్ణులైన తన తల్లిదండ్రులకు లోబడివున్నాడు. యేసు పన్నెండేండ్ల వయసులో ఉన్నప్పుడు, “ఆయన వారితో [తన తల్లిదండ్రులతో] కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను” అని బైబిలు చెబుతోంది.—లూకా 2:51; ఎఫెసీయులు 6:1-3.

ఈ సూత్రాలను ఎందుకు ఆచరణలో పెట్టాలి?

యేసు, తాను తన శిష్యులకు నేర్పించిన పాఠాల గురించి ఇలా చెప్పాడు, “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.” (యోహాను 13:17) మనం నిజ క్రైస్తవులముగా ఉండాలంటే, ఇతరులతో వ్యవహరించడం గురించి యేసు మనకిచ్చిన ఉపదేశాన్ని అనుసరించాలి. ఆయన ఇలా చెప్పాడు, ‘మీరు ఒకరి​యెడల ఒకరు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’—యోహాను 13:35. (w 08 8/1)

మరింత సమాచారం కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని 14వ అధ్యాయం చూడండి.

[అధస్సూచి]

^ పేరా 14 యెహోవాసాక్షుల ప్రచురణ.

[24, 25వ పేజీలోని చిత్రం]

నిష్ప్రయోజకుడైన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానం దయ, క్షమ గుణాల ప్రాముఖ్యతను బోధిస్తుంది.—లూకా 15:11-32

[25వ పేజీలోని చిత్రం]

భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి