కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడమెలా?
రవి: * మా అమ్మానాన్నలు నన్ను దేనికైనా శిక్షించే ముందు, అసలు నేనెలాంటి పరిస్థితుల్లో అలా చేశానో, ఎందుకలా చేశానో అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించేవారు. ఇప్పుడు నేను మా అమ్మాయిల విషయంలో కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తాను. నా భార్య అలేక్య పుట్టిపెరిగిన పరిస్థితులు వేరు. వాళ్ళ అమ్మనాన్నలు వెనుకాముందూ ఆలోచించేవారు కాదు. ఆమె ఏదైనా పొరపాటు చేస్తే ఆమె ఏ పరిస్థితుల్లో అలా చేసిందో తెలుసుకోకుండానే శిక్షించేవారట! అందుకే అనుకుంటా, తను కూడా కొన్నిసార్లు మా పిల్లలతో అలాగే కఠినంగా ఉంటుందని నాకనిపిస్తుంది.
జన: నాకు ఐదేళ్ళునప్పుడు మా నాన్న మమ్మల్ని దిక్కులేని వాళ్ళను చేసి వెళ్ళిపోయాడు. నన్నూ మా ముగ్గురి చెల్లెళ్ళను అసలు పట్టించుకునేవాడు కాదు. మా అమ్మ మమ్మల్ని పోషించడానికి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసేది. అప్పుడు మా చెల్లెల్ని నేనే చూసుకోవాల్సివచ్చింది. అంత చిన్నవయసులో వాళ్ళను ఓ తల్లిలా చూసుకోవాల్సిరావడంతో నా బాల్యమంతా ఏ ఆటపాటల్లేకుండానే గడిచిపోయింది. ఇప్పటికీ సరదాగా ఉండడమంటే ఏంటో నాకు తెలీదు. నా పిల్లలెప్పుడైనా తప్పుచేస్తే వాళ్లు చేసిన తప్పుల గురించి విపరీతంగా ఆలోచించి బాధపడతాను. వాళ్లు అసలెందుకు అలా చేశారో, ఏ ఉద్దేశంతో అలా చేశారో తెలుసుకోవాలని అనుకుంటాను. నా భర్త అశోక్ నాలా కాదు, ఏదైనా జరిగితే దాన్ని పట్టుకుని ఊరికే సాగదీయడు. మా మామగారు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు, ఖచ్చితంగా కూడా ఉండేవారు. భార్యను కూడా బాగా చూసుకునేవారు. పిల్లలతో సమస్య వస్తే మావారు వెంటనే పరిష్కరిస్తారు. అసలేం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి సమస్యను పరిష్కరించిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించరు.
రవి, సంజన చెప్పిదాన్ని బట్టి తెలిసేదేంటంటే, చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీతో ప్రవర్తించినట్లే మీరూ మీ పిల్లలతో ప్రవర్తిస్తారు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు వాతావరణాల్లో పెరిగివుంటే పిల్లల క్రమశిక్షణ విషయంలో కూడా ఇద్దరూ వేర్వేరుగా ఆలోచిస్తారు. దానివల్ల కొన్నిసార్లు భార్యభర్తల మధ్య సమస్యలొస్తాయి.
అలసటవల్ల సమస్యలింకా ఎక్కువవుతాయి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం అంత సులువైన పని కాదనీ, సమయమంతా దానికే పోతుందనీ వాళ్ళు పుట్టిన కొన్నాళ్ళకే తల్లిదండ్రులు తెలుసుకుంటారు. అరుణ, వినోద్లకు ఇద్దరు పిల్లలున్నారు. అరుణ ఇలా అంటోంది, “నా కూతుళ్ళంటే నాకు ప్రాణం. కానీ వాళ్ళతో వచ్చిన చిక్కల్లా, పడుకోమన్న సమయానికి పడుకునేవాళ్ళు కాదు, పడుకోవాల్సిన సమయంలో లేచికూర్చునేవాళ్ళు. మాట్లాడుతుంటే మధ్యలో కలుగజేసుకునేవాళ్ళు. వాళ్ళ బట్టలు, బూట్లు, బొమ్మలు ఎక్కడబడితే అక్కడ పడేసేవాళ్ళు. ఫ్రిజ్లోనుండి తీసినవి తిరిగి లోపల పెట్టేవాళ్ళు కాదు.”
రెండవ కాన్పు తర్వాత కిరణ్ భార్య మనసికంగా కృంగిపోయింది. కిరణ్, “నేను ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయేవాన్ని, దానికి తోడు మధ్యరాత్రి వరకు మా చిన్న పాపతోనే సరిపోయేది. అందుకే మా పెద్దమ్మాయిని అంతకుముందులా మంచి క్రమశిక్షణలో పెట్టలేకపోయాను. చెల్లెల్ని చూసుకున్నంత బాగా తనను చూడడం లేదని అసూయపడేది” అని చెప్పాడు.
భార్యాభర్తలు అలసిపోయి ఉన్నప్పుడు పిల్లల క్రమశిక్షణ విషయంలో వాదించుకుంటే, ఆ చిన్నచిన్న వాదనలే చిలికిచిలికి గాలివాన అవుతుంది. అవి ఓ కొలిక్కి రాకపోతే భార్యాభర్తల మధ్య అడ్డుగోడల్లా మారతాయి, పిల్లలు దాన్ని అలుసుగా తీసుకుని అమ్మ దగ్గర అమ్మవైపు, నాన్న దగ్గర నాన్నవైపు మాట్లాడుతూ వాళ్ళకు కావల్సింది చేయించుకుంటారు. పిల్లల్ని మంచి క్రమశిక్షణలో పెడుతూనే, ఇద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండడానికి బైబిల్లోని ఏ సూత్రాలు భార్యాభర్తలకు సహాయం చేస్తాయి?
భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడపాలి
పిల్లలు పుట్టకముందే కాదు, వాళ్ళు ఒక ఇంటివాళ్ళయ్యాక కూడా భార్యాభర్తలిద్దరూ కలిసే ఉండాలి. వివాహబంధం గురించి మాట్లాడుతూ బైబిలు, ‘దేవుడు జతపరచినవాళ్ళని మనుషులు వేరుచేయకూడదు’ అని చెబుతుంది. (మత్తయి 19:6) కానీ దానికి ముందు వచనం చూపిస్తున్నట్లుగా, చివరకు పిల్లలకు కూడా వాళ్ళవాళ్ళ సొంత కుటుంబాలు ఉండాలని దేవుడు అనుకున్నాడు. (మత్తయి 19:5) కుటుంబం అన్నాక పిల్లల్ని పెంచాలి కానీ పెళ్లి చేసుకునేది పిల్లల్ని కని పెంచడానికి మాత్రమే కాదు. నిజమే, పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి సమయం కేటాయించాలి, అయితే వారిని సరిగా పెంచాలంటే ముందు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలనే విషయం మర్చిపోకూడదు.
భార్యాభర్తలు ఓవైపు పిల్లల్ని పెంచుతూనే అన్యోన్యంగా ఉండాలంటే ఏమి చేయాలి? వీలైతే మీరిద్దరే ఏకాంతంగా గడపడానికి క్రమంగా సమయాన్ని కేటాయించండి. అలా చేస్తే కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చించుకోవచ్చు, ఒకరితోఒకరు సంతోషంగా గడపొచ్చు. నిజమే ఏకాంతంగా గడపడానికి సమయం పక్కనపెట్టడం కష్టం. మొదట్లో చెప్పుకున్న రవి భార్య అలేక్య ఇలా అంది, “నేనూ, మావారు మాట్లాడుకోవడానికి సమయం దొరికింది అనుకున్నప్పుడే మా చిన్నపాప ఏదో ఒకటి చేస్తుంది. లేదంటే ఆరేళ్ళ పెద్దపాప ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లు గోలచేస్తూ కలర్ పెన్సిళ్ళు కనబడ్డం లేదనో, మరింకేదో లేదనో గొడవపెడుతుంది.”
ముందు చెప్పుకున్న, అరుణ, వినోద్‌లు వాళ్ళ పిల్లలెప్పుడూ ఒకే సమయానికి పడుకోవాలని నిర్ణయించారు. అలా వాళ్ళిద్దరికీ కొంత సమయం దొరికేది. “అనుకున్న సమయానికల్లా లైట్లు ఆపేస్తామని, ఆ తర్వాత పడుకోవాలని మా పిల్లలకు తెలుసు. వాళ్ళకలా అలవాటు చేయడం వల్ల మేము ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి సమయం దొరికేది” అని అరుణ అంటోంది.
ఫలానా సమయానికి ఖచ్చితంగా పడుకోవాలనే పద్ధతిని పిల్లలకు అలవాటు చేస్తే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడానికి కాస్త సమయం ఉంటుంది. అంతేకాదు, పిల్లలు ‘తమ గురించి ఉన్నదానికంటే గొప్పగా భావించరు.’ (రోమీయులు 12:3, ఈజీ-టు-రీడ్ వర్షన్) కుటుంబంలో వాళ్ళకి విలువున్నా వాళ్లు చెప్పినట్లే కుటుంబం నడవదని పిల్లలు ఆ తర్వాత తెలుసుకుంటారు. అలాగే కుటుంబ పద్ధతుల ప్రకారం వాళ్ళుండాలి గానీ తాము కోరినట్లు కుటుంబ పద్ధతులు మారవని అర్థంచేసుకుంటారు.
ఇలా చేసిచూడండి: నిద్రపోవడానికి ఓ సమయం నిర్ణయించి పిల్లలెప్పుడూ అదే సమయానికి పడుకోవాలని గట్టిగా చెప్పండి. మంచి నీళ్ళు తాగాలనో, ఇంకేదో చేయాలనో సాకులు చెప్తే ఒక్కసారికి ఒప్పుకోవచ్చు. కానీ చెప్పిన సమయానికి పడుకోకుండా అలా ఎత్తులు వేస్తూపోతుంటే మాత్రం ఒప్పుకోకండి. ఐదు నిమిషాలు ఆలస్యంగా పడుకుంటామని మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు మీకు ఒప్పుకోవాలనిపిస్తే ఐదు నిమిషాలకు అలారం పెట్టండి. అలారం మోగగానే ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా మీ పిల్లల్ని పడుకోమని చెప్పండి. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుండాలి.—మత్తయి 5:37.
మీరిద్దరూ ఒకే మాటమీద ఉండండి
‘నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు నీ తల్లి చెప్పే బోధని తోసివేయకు’ అనే ఓ జ్ఞానవంతమైన సామెత బైబిల్లో ఉంది. (సామెతలు 1:8) అమ్మానాన్నలిద్దరికీ పిల్లల మీద అధికారం ఉంటుందని ఈ వచనం చూపిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన వాతావరణంలో పెరిగినా పిల్లల్ని సరిచేసే విషయంలో వారి ఆలోచనలు వేర్వేరుగా ఉండొచ్చు. అంతేకాదు, కుటుంబంగా వాళ్ళు పెట్టుకున్న నియమాల్లో ఏది ఎలాంటి పరిస్థితుల్లో పాటించాలనే విషయంలో కూడా వారిద్దరూ ఒకేలా ఆలోచించకపోవచ్చు. అలాంటప్పుడు భార్యాభర్తలు ఏమి చేస్తే మంచిది?
పైన ప్రస్తావించిన రవి, “మా పిల్లలముందు మాది చేరోమాటగా ఉండడం మంచిదికాదని నాకనిపించింది” అని అన్నాడు. అయితే, ఇద్దరూ ఒకే మాటపై ఉండడం చెప్పినంత సులువేం కాదని ఆయనే అంటున్నాడు. ఆయనింకా మాట్లాడుతూ, “పిల్లలు ఏదైనా ఇట్టే పట్టేస్తారు. మేమిద్దరం ఒకే మాటమీద లేమని బైటికి చెప్పకపోయినా మేము ఏమనుకుంటున్నామో మా అమ్మాయి ఇట్టే పసిగట్టేస్తుంది” అని చెప్పాడు.
రవి, అలేక్య ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారు? అలేక్య దాని గురించి చెబుతూ, “మావారు మా అమ్మాయిని సరిచేస్తున్న పద్ధతి నాకెప్పుడైనా నచ్చకపోతే, వెంటనే ఏమీ చెప్పను. మా అమ్మాయి అక్కడ నుండి దూరం వెళ్ళేంతవరకు 1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 6:1-3) రవి ఏమంటున్నాడంటే, “కుటుంబమంతా ఉన్నప్పుడు పిల్లల్ని సరిచేసే బాధ్యత సాధారణంగా నేనే తీసుకుంటాను. కానీ జరిగినదాని గురించి అలేక్యకే బాగా తెలిసుంటే సరిచేసే బాధ్యతను తనకే అప్పగించి వెనకుండి సహాయం చేస్తాను. తను చెప్పినదాంట్లో నాకు ఏమైనా నచ్చకపోతే, తనతో ఆ తర్వాత మాట్లాడతాను.”
ఆగి, ఆ తర్వాత ఆయనతో మాట్లాడతాను. మా మధ్యవున్న అభిప్రాయబేధాలను అలుసుగా తీసుకుని మాతో ఆటలాడుకోవచ్చని మా అమ్మాయికి అనిపించేలా ప్రవర్తించడం నాకిష్టంలేదు. మేమిద్దరం ఒక మాట మీద లేమని మా అమ్మాయి గ్రహిస్తే, కుటుంబంలో ప్రతీ ఒక్కరూ యెహోవా ఏర్పాటును గౌరవించాలనీ, నేను వాళ్ళ నాన్నకు మనస్ఫూర్తిగా లోబడతాననీ, అలాగే తను కూడా తల్లిదండ్రుల మాట వినాలనీ చెప్తాను.” (పిల్లలకి క్రమశిక్షణనిచ్చే విషయంలో భార్యాభర్తల అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటే వారిద్దరికి మనస్పర్ధలొస్తాయి, దాంతో పిల్లలకు తల్లిదండ్రులంటే గౌరవం లేకుండాపోతుంది. అలా జరగకూడదంటే ఏమి చేయాలి?
ఇలా చేసి చూడండి: ప్రతీవారం ఓ సమయం నిర్ణయించుకుని పిల్లల క్రమశిక్షణ గురించి, అలాగే మీకేమైనా అభిప్రాయబేధాలుంటే వాటి గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోండి. మీ భర్త లేదా భార్య అభిప్రాయాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి, మీ పిల్లలు మీకు మాత్రమే కాదు మీ భర్త లేదా భార్యకు కూడా పిల్లలేనని మరిచిపోకండి.
ఒకరినొకరు బాగా అర్థంచేసుకోండి
పిల్లలకి మంచి దారి నేర్పించడం కష్టమే. దానివల్ల మనం పూర్తిగా అలసిపోతున్నామని కొన్నిసార్లు అనిపిస్తుంది. పిల్లలు పుట్టకముందు మీరెలా ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళో వాళ్ళు ఒక ఇంటివాళ్లయ్యాక కూడా మీరలాగే ఒకరికొకరు తోడుగా మిగులుతారు. పిల్లల్ని పెంచి పెద్దచేసేసరికి మీరిద్దరూ ఇంకా దగ్గరౌతారా లేదా ఒకరికొకరు దూరమౌతారా? అది, ప్రసంగి 4:9, 10లో ఉన్న సూత్రాన్ని మీరెంతవరకు పాటిస్తారన్న దాన్నిబట్టి ఉంటుంది. అక్కడ ‘ఇద్దరి కష్టంతో ఉభయులకు మంచిఫలం కలుగుతుంది. కాబట్టి ఒంటిగా ఉండడంకన్నా ఇద్దరు కూడి ఉండడం మేలు. ఒకరు పడిపోయినా ఒకడు తనతోటివాడిని లేవదీస్తాడు’ అని ఉంది.
తల్లిదండ్రులిద్దరూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటే మంచి ఫలితాలొస్తాయి. మనం ముందు చెప్పుకున్న సంజన, “నా భర్తలో చాలా మంచి లక్షణాలున్నాయని నాకు తెలుసు, అయితే మేమిద్దరం కలిసి పిల్లల్ని పెంచుతున్ననప్పుడు ఆయనలో ఓ కొత్త వ్యక్తిని చూశాను. పిల్లల్ని ఆయనెంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకునేవాడు. అది చూసి నాకు ఆయనంటే గౌరవం, ప్రేమా పెరిగాయి” అని తన మనసులో మాట చెప్పింది. రవి భార్య గురించి చెప్తూ “తనిప్పుడు పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటుందో చూసి తనంటే ప్రేమా, గౌరవం ఇంకెక్కువయ్యాయి” అని అన్నాడు.
మీ భార్య లేదా భర్తతో సమయం గడుపుతూ, పిల్లల్ని పెంచడంలో ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటే మీ పిల్లలతోపాటే మీ మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. మీ పిల్లలకు మీరొక ఆదర్శంగా ఉండడానికి మీరవన్నీ చేస్తే చాలా మంచిది. (w09 2/1)
^ పేరా 3 పేర్లు మార్చబడ్డాయి.
మీరిలా ప్రశ్నించుకోండి . . .
-
పిల్లలు పక్కన లేకుండా నా భర్తతో లేదా భార్యతో నేను వారంలో ఎంత సమయం గడుపుతున్నాను?
-
నా భర్త లేదా భార్య పిల్లల్ని సరిదిద్దుతుంటే నేనెలా సహాయం చేస్తాను?