కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

యేసు ఒక వడ్రంగిగా ఎలాంటి పని చేసివుంటాడు?

యేసును పెంచిన తండ్రి ఒక వడ్రంగి. యేసు కూడా వడ్రంగి పని నేర్చుకున్నాడు. ఆయన ‘దాదాపు ముప్పై ఏళ్ల’ వయసులో ప్రకటనా పని ప్రారంభించినప్పుడు ఆయన ‘వడ్లవాని కుమారుడు’ అనేకాదు ‘వడ్లవాడిగా’ కూడా అందరికీ తెలుసు.—లూకా 3:23; మత్తయి 13:55; మార్కు 6:3.

యేసు పుట్టిన ఊరిలో, ప్రజలకు వ్యవసాయానికి ఉపయోగపడే నాగలి, కాడి వంటివి ఎక్కువగా అవసరమైవుండవచ్చు. సాధారణంగా వీటిని కలపతో తయారు చేసేవారు. అప్పట్లో సాధారణంగా ఒక వడ్రంగి టేబుళ్లు, కుర్చీలు, స్టూళ్లు, పెట్టెలు, తలుపులు, కిటికీలు, చెక్క గడియలు, ధూలాలు వంటివి తయారు చేసేవాడు. అంతేకాదు, నిర్మాణ పనుల్లో కూడా వడ్రంగి పాత్ర ఉండేది.

ఒక ఉపమానంలో బాప్తిస్మమిచ్చే యోహాను గొడ్డలి గురించి ప్రస్తావించాడు, దీన్ని యేసు, ఇతర వడ్లవాళ్లు చెట్లను నరకడానికి ఉపయోగించి ఉండవచ్చు. ఆ నరికిన కొమ్మలను అక్కడే ధూలాలుగా చేసేవారు లేదా ఆ కొమ్మలను తమ ఇంటికి తీసుకెళ్లి వాటిని తయారు చేసేవారు. ఈ పనికి శారీరక బలం ఎంతో అవసరమయ్యేది. (మత్తయి 3:10) “వడ్రంగి కొలనూలు వేస్తాడు, ఆకారం వ్రాసి ఉలితో చక్క చేసి కంట్రోణీతో గుర్తుపెట్టి దాన్ని రూపొందిస్తాడు” అని చెప్తూ యెషయా తన కాలంలో వడ్లవాళ్లు వాడే ఇతర వస్తువుల గురించి ప్రస్తావించాడు. (యెషయా 44:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యానసహితం) బైబిలు కాలాల్లో లోహపు రంపాలు, రాతి సుత్తెలు, కంచు మేకులు ఉపయోగించేవారని పురావస్తుశాస్త్ర పరిశోధనలో తేలింది. (నిర్గమకాండము 21:6; యెషయా 10:15; యిర్మీయా 10:4) యేసు ఒక వడ్రంగిగా అలాంటివన్నీ ఉపయోగించి ఉంటాడని అనుకోవచ్చు. (w08 12/1)