కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తానంటున్నాడా?

దేవుడు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తానంటున్నాడా?

దేవుడు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తానంటున్నాడా?

‘మీరు ధనవంతులుగా ఉండాలని అంటే మీకు బోలెడన్ని కార్లు ఉండాలని, మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధిచెందాలని దేవుడు కోరుతున్నాడు. దేవునిపై విశ్వాసంతో మీ పర్సు తెరిచి ఇవ్వగలిగిందంతా ఆయనకివ్వండి.’

బ్రెజిల్‌లో కొన్ని మత గ్రూపులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని అక్కడి ఓ వార్తా పత్రిక రాసింది. చాలామంది అలాంటి ప్రకటనల్ని బలంగా నమ్ముతారు. క్రైస్తవులమని చెప్పుకునే ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అమెరికాలో జరిపిన ఓ సర్వే గురించి టైమ్‌ పత్రిక ఇలా చెబుతోంది: “ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లు మొత్తం 61% మంది నమ్ముతున్నారు. 31% మంది మీరు దేవునికి డబ్బిస్తే ఆయన మీకు సిరిసంపదలు కురిపిస్తాడని నమ్ముతున్నట్లు చెప్పారు.”

ప్రాస్పరిటీ థియోలజీ (దేవుడు ధనసంపదలిస్తాడు) అని తరచూ పిలవబడే ఇలాంటి నమ్మకాలు ముఖ్యంగా బ్రెజిల్‌లాంటి లాటిన్‌ అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. అలాంటి దేశాల్లో, దేవుడు సిరిసంపదలిస్తాడని నమ్మబలుకుతున్న చర్చీలకు ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. అయితే దేవుడు నిజంగా తన సేవకులకు సిరిసంపదలిస్తానంటున్నాడా? పూర్వకాల దేవుని సేవకులందరూ సంపన్నులేనా?

నిజమే హెబ్రీ లేఖనాల్లో మనం దేవుడు ఆశీర్వదించినవారు సుసంపన్నులుగా జీవించారని చదువుతాం. ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 8:18 లో, “నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. . . . మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే” అని ఉంది. ఈ మాటలు తాము దేవునికి లోబడితే, ఆయన తమను సంపన్నులను చేస్తాడని ఇశ్రాయేలీయులకు హామియిచ్చాయి.

మరి దేవుని సేవకుల్లోని వేర్వేరు వ్యక్తుల విషయమేమిటి? విశ్వాసియైన యోబు ఎంతో ధనవంతుడు, అయితే సాతాను ఆయనను కడు బీదవానిగా చేసిన తర్వాత, యోబు సంపదను యెహోవా “రెండంతలు అధికముగా” చేశాడు. (యోబు 1:3; 42:10) అబ్రాహాముకు కూడా విస్తారమైన ఆస్తివుంది. ఆయన “వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను” అని ఆదికాండము 13:2 చెబుతోంది. తూర్పుదేశాల నలుగురు రాజులు మూకుమ్మడిగా దాడిచేసి అబ్రాహాము అన్న కొడుకైన లోతును బంధించి తీసుకెళ్లినప్పుడు, అబ్రాహాము “తన కుటుంబం అంతటిని సమావేశపర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు.” (ఆదికాండము 14:14 ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆయుధాలు ఉపయోగించడంలో “శిక్షణ పొందిన” 318 మంది అబ్రాహాము కుటుంబంలో ఉన్నారంటే, ఆయన కుటుంబంలో చాలామందే ఉండేవారని తెలుస్తోంది. అంత పెద్ద కుటుంబాన్ని పోషించాడంటే ఆయనకు చాలా ఆస్తి, విస్తారమైన పశుసంపద ఉండేవని అర్థమౌతుంది.

నిజమే పూర్వకాలంలో జీవించిన నమ్మకమైన దేవుని సేవకులు చాలామంది ధనవంతులుగా ఉన్నారు. ఉదాహరణకు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను వంటివారు ఎంతో ధనవంతులు. అలాగని దేవుడు తనను సేవించే ప్రతీఒక్కరిని ధనవంతుల్ని చేస్తాడనా? అలాగే, ఎవరైనా పేదవారైనంత మాత్రాన వారికి దేవుని ఆశీర్వాదం లేదనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తర్వాతి ఆర్టికల్‌లో ఉన్నాయి. (w09 09/01)