కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

యేసు నిజంగా జీవించాడని చెప్పడానికి బైబిలు కాకుండా ఇంకా ఏ ఆధారాలున్నాయి?

దాదాపు యేసు జీవించిన కాలంలోనే జీవించిన చరిత్రకారులు ఎంతోమంది ఆయన గురించి నిర్దిష్టంగా ప్రస్తావించారు. చక్రవర్తుల పాలన క్రిందవున్న రోమ్‌ చరిత్రను రాసిన కొర్నేలియస్‌ టాసిటస్‌ వాళ్లలో ఒకరు. ఆయన సా.శ. 64లో రోమ్‌ను బూడిద చేసిన అగ్ని ప్రమాదం గురించి రాస్తూ, నీరో చక్రవర్తే దానికి కారణమనే పుకారు పుట్టిందనీ, కానీ అతను క్రైస్తవులని సామన్యప్రజలు పిలిచిన వాళ్ల మీదకు ఆ నింద వచ్చేలా చేయడానికి ప్రయత్నించాడనీ రాశాడు. “టైబీరియస్‌ పరిపాలిస్తున్నకాలంలో, పొంటియస్‌ పైలట్‌ అనే రాజప్రతినిధి మరణశిక్ష విధించడంతో చనిపోయిన క్రైస్టస్‌ అనే వ్యక్తి పేరు నుండి వాళ్లకు ఆ పేరు వచ్చింది” అని ఆయన అన్నాడు.—అన్నల్స్‌, XV, 44.

యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ కూడా యేసు గురించి ప్రస్తావించాడు. సా.శ. 62లో యూదయకు అధిపతిగా ఉన్న ఫేస్తు అనే రోమా అధికారి చనిపోయిన దగ్గర నుండి అతని తర్వాత ఆ అధికారాన్ని చేపట్టిన ఆల్బీనస్‌ వచ్చేంత వరకు జరిగిన సంఘటనల గురించి చెబుతూ, అప్పట్లో ప్రధాన యాజకుడైన అననస్‌ (అన్న) చేసిన దాని గురించి జోసిఫస్‌ ఇలా రాశాడు: “యూదుల మహాసభలోని న్యాయాధిపతుల్ని సమావేశపర్చి వాళ్ల దగ్గరకు క్రీస్తు అని పిలువబడిన యేసు తమ్ముడైన యాకోబును, మరికొంతమందిని తీసుకొచ్చాడు.”—జూయిష్‌ ఆంటిక్విటీస్‌, XX, 200 (ix, 1). (w10-E 04/01)

క్రీస్తు అని యేసు ఎందుకు పిలవబడ్డాడు?

మరియ గర్భం దాల్చబోతుందని చెప్పడానికి వచ్చిన గబ్రియేలు దూత, ఆమె తన కుమారునికి యేసు అని పేరు పెట్టాలని చెప్పినట్లు సువార్త పుస్తకాలు వివరిస్తున్నాయి. (లూకా 1:31) మొదటి శతాబ్దంలోని యూదుల్లో చాలామందికి సాధారణంగా ఈ పేరు ఉండేది. యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ అదే పేరున్న మరో 12 మంది గురించి రాశాడు. వాళ్లు లేఖనాల్లో ప్రస్తావించబడినవారు కాదు. మరియ కుమారుణ్ణి “నజరేయుడు” అని పిలిచేవారు, దానితో ఆయన నజరేతుకు చెందిన యేసు అని తెలిసేది. (మార్కు 10:47) ఆయనను “క్రీస్తు” లేదా యేసుక్రీస్తు అని కూడా పిలిచేవారు. (మత్తయి 16:16) దాని అర్థమేమిటి?

“క్రీస్తు” అనే తెలుగు పదం క్రీస్టోస్‌ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దానికి సమానార్థం ఉన్న హెబ్రీ పదం మాషీయాక్‌ (మెస్సీయ). ఈ రెండు పదాలకు “అభిషిక్తుడు” అని అర్థం. ఈ పదాన్ని యేసు కంటే ముందున్న కొందరిని ఉద్దేశించి కూడా ఉపయోగించవచ్చు, అలా ఉపయోగించడం సరైనదే. ఎందుకంటే, మోషే ప్రవక్త అహరోనును అభిషేకించాడు, సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించాడు అంటే దేవుడే వారిని బాధ్యత, అధికారం ఉన్న స్థానాల్లో నియమించాడని అర్థం. (నిర్గమకాండము 40:13; 1 సమూయేలు 16:13) ప్రవచించబడిన మెస్సీయ, అంటే యేసు, యెహోవా ప్రతినిధుల్లో ఎంతో ముఖ్యుడు. కాబట్టి, యేసు “సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు” అని సరిగ్గానే పిలువబడ్డాడు.—మత్తయి 16:16; దానియేలు 9:25. (w10-E 04/01)

[15వ పేజీలోని చిత్రం]

ఒక చిత్రకారుడు గీసిన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ చిత్రపటం