కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డబ్బును, వస్తువులను కాదు మనుషుల్ని ప్రేమించండి

డబ్బును, వస్తువులను కాదు మనుషుల్ని ప్రేమించండి

మొదటిది

డబ్బును, వస్తువులను కాదు మనుషుల్ని ప్రేమించండి

దీని గురించి బైబిలు ఏమి చెబుతోంది? ‘డబ్బు మీది వ్యామోహం అన్నిరకాల కీడులకు మూలం.’—1 తిమోతి 6:10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

దీన్ని పాటించడం ఎందుకు కష్టం? వాణిజ్య ప్రకటనలు చేసేవాళ్లు మనల్ని ఉన్నదానితో సంతృప్తిపడనివ్వరు. మనం సరికొత్త, నాణ్యమైన, అతిపెద్ద వస్తువులను కొనడానికి కావాల్సిన డబ్బు కోసం రాత్రనకా పగలనకా పనిచేయాలని వాళ్లు కోరుకుంటారు. డబ్బు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే, మనం ఇట్టే దాని వ్యామోహంలో పడిపోతాం. ఏదేమైనా, ధనాన్ని ప్రేమించేవాళ్లు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేరని బైబిలు హెచ్చరిస్తోంది. ‘డబ్బంటే వ్యామోహం ఉన్నవాళ్లు తమకున్న డబ్బుతో ఎప్పటికీ తృప్తిపడరు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాళ్లు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తిపడరు’ అని రాజైన సొలొమోను రాశాడు.—ప్రసంగి 5:10, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

మీరేమి చేయవచ్చు? యేసును ఆదర్శంగా తీసుకుంటూ, వస్తువులకన్నా ప్రజలను ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోండి. ఆయన ప్రజలమీద ప్రేమతో తనకున్న సమస్తాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. (యోహాను 15:13) ‘తీసుకోవడంలో కంటే ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది’ అని ఆయన చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35, NW) మనకున్నవాటిని, సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించడం అలవాటు చేసుకుంటే, వాళ్లు కూడా అలాగే చేస్తారు. ఇతరులకు ‘ఇవ్వండి, అప్పుడు వాళ్లు మీకిస్తారు’ అని యేసు చెప్పాడు. (లూకా 6:38) డబ్బు, వస్తువులు సమకూర్చుకోవడానికి ప్రయాసపడేవాళ్లు బాధలు, కష్టాలు కొనితెచ్చుకుంటారు. (1 తిమోతి 6:9, 10) అయితే, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరుల ప్రేమను పొందినప్పుడు నిజమైన సంతృప్తి కలుగుతుంది.

మీరు మీ జీవన విధానాన్ని సరళం చేసుకోగలరేమో చూడండి. ఇప్పటికే మీ దగ్గరున్న వస్తువులను తగ్గించుకోగలరా, లేదా ఇకమీదట ఎక్కువ వస్తువులు కొనకుండా ఉండగలరా? మీరలా చేస్తే, మీకు బోలెడంత సమయం ఉంటుంది. అప్పుడు, మీకున్న వాటన్నిటినీ అనుగ్రహించిన దేవుణ్ణి సేవించగలుగుతారు, ప్రజలకు సహాయం చేయగలుగుతారు. జీవితంలో ఇవే చాలా ప్రాముఖ్యమైనవి.—మత్తయి 6:24; అపొస్తలుల కార్యములు 17:28. (w10-E 11/01)

[4వ పేజీలోని చిత్రం]

ఇతరులకు ‘ఇవ్వండి, అప్పుడు వాళ్లు మీకిస్తారు’