కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోయిన వాళ్లకు ఏదైనా నిరీక్షణ ఉందా?

చనిపోయిన వాళ్లకు ఏదైనా నిరీక్షణ ఉందా?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

చనిపోయిన వాళ్లకు ఏదైనా నిరీక్షణ ఉందా?

ఈ ఆర్టికల్‌ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారా?

యేసు యెరూషలేము దగ్గర్లోని బేతనియ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికి ఆయన స్నేహితుడైన లాజరు చనిపోయి నాలుగు రోజులైంది. యేసు లాజరు సహోదరీలైన మార్త, మరియతో కలిసి సమాధి దగ్గరకు వెళ్లాడు. కాసేపటికే అక్కడకు చాలామంది వచ్చారు. యేసు లాజరును తిరిగి బ్రతికించినప్పుడు మార్త, మరియ ఎంత సంతోషించి ఉంటారో ఒక్కసారి ఊహించండి!—యోహాను 11:20-24, 38-44 చదవండి.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని మార్త నమ్మింది. చనిపోయినవాళ్లు మళ్లీ భూమ్మీద జీవించేలా యెహోవా దేవుడు వాళ్లను భవిష్యత్తులో తిరిగి బ్రతికిస్తాడని ఆయన నమ్మకమైన సేవకులకు ముందు నుండే తెలుసు.—యోబు 14:14, 15 చదవండి.

2. చనిపోయినవాళ్లు ఎలాంటి స్థితిలో ఉన్నారు?

మానవులు, జంతువులు జీవించి ఉండేలా జీవశక్తి లేదా “ప్రాణము” అవసరం. మన శరీరం చనిపోయిన తర్వాత కూడా బ్రతికివుండే ఆత్మ ఏదీ మనలో లేదు. (ప్రసంగి 3:19; ఆదికాండము 7:21, 22) మనం మట్టి నుండి తయారుచేయబడిన భౌతిక ప్రాణులం. (ఆదికాండము 2:7; 3:19) మన మెదడు పనిచేయడం ఆగిపోయినప్పుడు మన ఆలోచనలు నశిస్తాయి. అందుకే లాజరును యేసు పునరుత్థానం చేసిన తర్వాత అంటే తిరిగి బ్రతికించిన తర్వాత లాజరు ఆ నాలుగు రోజులు తనకు ఏమి జరిగిందో చెప్పలేదు, ఎందుకంటే చనిపోయిన వాళ్లకు ఏమీ తెలీదు.—కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10 చదవండి.

చనిపోయినవాళ్లు బాధపడలేరు. కాబట్టి చనిపోయినవాళ్లను దేవుడు యాతన పెడతాడనేది తప్పుడు బోధ. అది ఆయనను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. ప్రజలను అగ్నిలో వేసి కాల్చడాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు.—యిర్మీయా 7:31 చదవండి.

3. చనిపోయిన వాళ్లతో మాట్లాడడం సాధ్యమేనా?

చనిపోయినవాళ్లు మాట్లాడలేరు. (కీర్తన 115:17) కానీ దుష్ట దూతలు ప్రజలతో మాట్లాడినప్పుడు, చనిపోయిన వ్యక్తి ఆత్మే వచ్చి మాట్లాడుతున్నట్లు తెలివిగా నమ్మించవచ్చు. (2 పేతురు 2:4) చనిపోయిన వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించకూడదని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు.—ద్వితీయోపదేశకాండము 18:10, 11 చదవండి.

4. ఎవరెవరు తిరిగి బ్రతికించబడతారు?

చనిపోయిన కోట్లాదిమంది రాబోయే నూతన లోకంలో తిరిగి బ్రతికించబడతారు. యెహోవా గురించి తెలియకుండా తప్పు చేసిన కొంతమంది కూడా లేపబడతారు.—లూకా 23:43; అపొస్తలుల కార్యములు 24:14, 15 చదవండి.

అలా తిరిగి బ్రతికినవాళ్లకు దేవుని గురించిన సత్యం తెలుసుకునే అవకాశం, యేసు చెప్పినది చేయడం ద్వారా ఆయన మీద విశ్వాసం చూపించే అవకాశం దొరుకుతుంది. (ప్రకటన 20:11-13) వాళ్లు మంచి పనులు చేస్తే భూమ్మీద ఎల్లకాలం జీవిస్తారు. కానీ అప్పుడు కూడా కొంతమంది చెడు పనులు చేస్తారు. వాళ్లకది “తీర్పు పునరుత్థానం” అవుతుంది.—యోహాను 5:28, 29 చదవండి.

5. పునరుత్థాన ఏర్పాటు యెహోవా గురించి ఏమి తెలియజేస్తుంది?

యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మన కోసం బలి అర్పించినందు వల్లే పునరుత్థానం సాధ్యమైంది. కాబట్టి అది యెహోవా దేవుని ప్రేమకు, కృపకు నిదర్శనం.—యోహాను 3:16; రోమీయులు 6:23 చదవండి. (w11-E 06/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 6, 7 అధ్యాయాలు చూడండి.

[20వ పేజీలోని చిత్రం]

దేవుడు ఆదామును మట్టితో సృష్టించాడు