కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వాలంటే మీరేం చేయాలి?

దేవునికి దగ్గరవ్వాలంటే మీరేం చేయాలి?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

దేవునికి దగ్గరవ్వాలంటే మీరేం చేయాలి?

ఈ ఆర్టికల్‌ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా?

ప్రార్థన ద్వారా తనకు దగ్గరవ్వమని యెహోవా అన్ని ప్రాంతాల ప్రజలను కోరుతున్నాడు. (కీర్తన 65:2) అయితే, ఆయన అందరి ప్రార్థనలు వినడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు అదేపనిగా చెడు పనులు చేసినప్పుడు దేవుడు వాళ్ల ప్రార్థనలు వినలేదు. (యెషయా 1:15) అంతేకాదు, భార్యతో సరిగ్గా వ్యవహరించని వ్యక్తి ప్రార్థనలు దేవునికి చేరవు. (1 పేతురు 3:7) కానీ పశ్చాత్తాపం చూపిస్తే, ఘోరమైన పాపాలు చేసినవాళ్ల ప్రార్థనలైనా దేవుడు వింటాడు.—2 దినవృత్తాంతములు 33:9-13 చదవండి.

2. మనం ఎలా ప్రార్థించాలి?

దేవునికి ప్రార్థన చేయడం ఒక గొప్ప గౌరవం. అది మన ఆరాధనలో ఒక భాగం, అందుకే యెహోవాకు మాత్రమే ప్రార్థించాలి. (మత్తయి 4:10; 6:9, 10) మనం పరిపూర్ణులం కాదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ‘మార్గంలోనే’ అంటే యేసు నామంలో మాత్రమే ప్రార్థించాలి. (యోహాను 14:6) కంఠస్థం చేసి ప్రార్థించమని లేదా పుస్తకంలో చూసి ప్రార్థించమని యెహోవా అనడం లేదు కానీ మనసులోని భావాలు చెప్పుకుంటూ ప్రార్థించమని అంటున్నాడు.—మత్తయి 6:7; ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

మనసులో చేసుకునే ప్రార్థనలను కూడా మన సృష్టికర్త వినగలడు. (1 సమూయేలు 1:11బి-13) ప్రతీ సందర్భంలో అంటే ఉదయం లేచినప్పుడు, పడుకునేముందు, భోజనం చేసేటప్పుడు, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించమని ఆయన చెబుతున్నాడు.—కీర్తన 55:22; మత్తయి 15:36 చదవండి.

3. క్రైస్తవులు కూటాలకు ఎందుకు వెళ్తారు?

మన చుట్టూవున్న వాళ్లకు దేవుని మీద విశ్వాసం లేదు. భూమ్మీద శాంతి తీసుకొస్తాననే ఆయన వాగ్దానాన్ని వాళ్లు ఎగతాళి చేస్తారు. అలాంటి వాళ్ల మధ్య జీవిస్తూ దేవునికి దగ్గరవ్వడం అంత సులువు కాదు. (2 తిమోతి 3:1, 4; 2 పేతురు 3:3, 13) అందుకే ప్రోత్సాహం కోసం తోటి విశ్వాసులతో సహవాసం చేయాలి.—హెబ్రీయులు 10:24, 25 చదవండి.

దేవుణ్ణి ప్రేమించే వాళ్లతో సహవసిస్తే ఆయనకు దగ్గరవ్వగలుగుతాం. యెహోవాసాక్షుల కూటాల్లో, ఇతరుల విశ్వాసాన్ని చూసి ఎంతో ప్రయోజనం పొందవచ్చు.—రోమీయులు 1:11, 12 చదవండి.

4. దేవునికి మీరెలా దగ్గరవ్వగలరు?

దానికోసం మీరు యెహోవా వాక్యంలో నేర్చుకున్న విషయాలను ధ్యానించాలి. ఆయన చేసిన వాటి గురించి, ఆయన నిర్దేశాల గురించి, ఆయన వాగ్దానాల గురించి ఆలోచించండి. ప్రార్థన చేసి ధ్యానిస్తే దేవుని ప్రేమ, జ్ఞానం పట్ల మనలో నిజమైన మెప్పు పెరుగుతుంది.—యెహోషువ 1:8; కీర్తన 1:1-3 చదవండి.

దేవుని మీద మీకు నమ్మకం, విశ్వాసం ఉంటేనే మీరు ఆయనకు దగ్గరవ్వగలరు. విశ్వాసాన్ని మానవ శరీరంతో పోల్చవచ్చు. మనం జీవించివుండాలంటే మన శరీరాన్ని ఎప్పటికప్పుడు పోషించుకుంటూ ఉండాలి. అలాగే, విశ్వాసం సజీవంగా ఉండాలంటే నేర్చుకున్న వాటిని ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ ఉండాలి.—1 థెస్సలొనీకయులు 5:21; హెబ్రీయులు 11:1, 6 చదవండి.

5. దేవునికి దగ్గరైతే మీకు ఏ ప్రయోజనం ఉంటుంది?

తనను ప్రేమించేవాళ్ల గురించి యెహోవా శ్రద్ధ తీసుకుంటాడు. వాళ్ల విశ్వాసాన్ని పాడుచేసే వేటినుండైనా, నిరంతరం జీవించే అవకాశం దొరకకుండా చేసే దేన్నుండైనా ఆయన వాళ్లను కాపాడతాడు. (కీర్తన 91:1, 2, 7-10) మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రమాదంలో పడవేసే జీవన విధానాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. యెహోవా అన్నిటికన్నా ఉత్తమమైన మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు.—కీర్తన 73:27, 28; యాకోబు 4:4, 8 చదవండి. (w11-E 09/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 17వ అధ్యాయం చూడండి.