కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకులకు

మా పాఠకులకు

మీరు ఇప్పుడు చదువుతున్న పత్రికను ప్రచురించడం 1879 జూలైలో మొదలైంది. అప్పటినుండి మారుతున్న కాలంతోపాటు ఈ పత్రికలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. (పై చిత్రాలు చూడండి.) ఈ సంచిక నుండి మీరు కావలికోటలో మరిన్ని మార్పులు చూస్తారు. అవి ఏంటి?

చాలా దేశాల్లో, తమకు కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో చదివేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అలా చదవడం వాళ్లకు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటోంది. ఇంటర్నెట్‌లో మాత్రమే దొరికే సమాచారాన్ని చూడడానికి ఒక్క క్లిక్‌ చాలు. ఎన్నో పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు కూడా ఇంటర్నెట్‌లో చదవొచ్చు.

దీన్ని మనసులో ఉంచుకొని, మేము www.pr418.com అనే మా వెబ్‌సైట్‌ ఆసక్తికరంగా, సౌకర్యంగా ఉండేలా ఇటీవల దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాం. ఆ వెబ్‌సైట్‌ని సందర్శించేవాళ్లు 430 కంటే ఎక్కువ భాషల్లో ఉన్న ప్రచురణలను చదవొచ్చు. ఇప్పటివరకూ మా ముద్రిత పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలు ఇకనుండి మా వెబ్‌సైట్‌లో మాత్రమే వస్తాయి, దాన్ని సందర్శించేవాళ్లు ఈ నెల నుండి వాటిని కూడా చదవొచ్చు. a

ఇకనుండి చాలా ఆర్టికల్స్‌ ఇంటర్నెట్‌లో మాత్రమే వస్తాయి కాబట్టి, ఈ సంచిక నుండి కావలికోట పత్రికలో 32 పేజీలకు బదులు 16 పేజీలే ఉంటాయి. కావలికోట ఇప్పటికే 204 భాషల్లో ప్రచురితం అవుతోంది. ఇకనుండి 16 పేజీలే కాబట్టి ఈ పత్రికను మరిన్ని భాషల్లోకి అనువదించే అవకాశం ఉంది.

ఈ మార్పుల వల్ల, ప్రాణాల్ని రక్షించే బైబిలు సందేశాన్ని ఇంకా ఎక్కువమందికి అందించగలమని ఆశిస్తున్నాం. బైబిలు మీద గౌరవంతో అది నిజంగా ఏమి బోధిస్తోందో తెలుసుకోవాలనుకునే మా పాఠకులందరికీ అవగాహన కల్పించే ఆసక్తికరమైన విషయాలను ముద్రిత పత్రికల రూపంలోనూ, ఇంటర్నెట్‌లోనూ విరివిగా అందించాలని నిశ్చయించుకున్నాం. (w13-E 01/01)

ప్రకాశకులు

a ఇంటర్నెట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని ఆర్టికల్స్‌: “For Young People” (మన యువతకు) అనే ఆర్టికల్‌ యువతీయువకులు బైబిలును క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. “My Bible Lessons” (బైబిలు పాఠాలు నేర్చుకుందాం) అనే సిరీస్‌లోని ఆర్టికల్స్‌ మూడు లేదా అంతకన్నా తక్కువ వయసున్న తమ చిన్నారులకు నేర్పించేలా తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.